5G Smartphone: 5G స్మార్ట్‌ఫోన్ వాడితే క్యాన్సర్ సంభవిస్తుందా..!

Does 5G Smartphone Increase the Risk of Cancer Know the Truth
x

5G Smartphone: 5G స్మార్ట్‌ఫోన్ వాడితే క్యాన్సర్ సంభవిస్తుందా..!

Highlights

5G Smartphone: నేషనల్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ప్రకారం రెండు రకాల సెల్ ఫోన్లు రేడియో తరంగాల రూపంలో రేడియేషన్‌ను ఉత్పత్తి చేస్తాయి.

5G Smartphone: నేషనల్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ప్రకారం రెండు రకాల సెల్ ఫోన్లు రేడియో తరంగాల రూపంలో రేడియేషన్‌ను ఉత్పత్తి చేస్తాయి. అయితే వాటిని జనాలు విస్తృతంగా ఉపయోగిస్తున్నారు. సెల్‌ఫోన్‌ల వల్ల క్యాన్సర్‌ బారిన పడేవారి సంఖ్య స్వల్పంగా పెరిగినప్పటికీ భవిష్యత్‌లో ఇది చాలా ఆందోళన కలిగించే విషయమని చెప్పవచ్చు. దీని గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం.

ఫోన్ తల దగ్గర పెట్టుకొని మాట్లాడుతారు కాబట్టి రేడియేషన్ అనేది మెదడు, కేంద్ర నాడీ వ్యవస్థపై ప్రభావం చూపుతుందని కొంతమంది నిపుణులు చెబుతున్నారు. సెల్ ఫోన్లు మానవ ఆరోగ్యానికి హానికరం కాదా అని తెలుసుకోవడానికి అనేక అధ్యయనాలు జరిగాయి. సెల్‌ఫోన్‌లు విద్యుదయస్కాంత స్పెక్ట్రమ్‌లోని రేడియో ఫ్రీక్వెన్సీ పరిధిలో రేడియేషన్‌ను విడుదల చేస్తాయి. రెండవ, మూడవ, నాలుగవ జనరేషన్‌ నెట్‌వర్క్‌లలో పనిచేసే ఫోన్‌ల ద్వారా 0.7 నుంచి 2.7 GHz మధ్య ఫ్రీక్వెన్సీ పరిధి ఉంటుంది. మరోవైపు ఐదవ తరం (5G) సెల్ ఫోన్‌లు 80 GHz వరకు ఫ్రీక్వెన్సీ పరిధిని ఉపయోగిస్తాయని నిపుణులు భావిస్తున్నారు.

అధిక పౌనఃపున్యాలు, ఎనర్జీ వల్ల DNA దెబ్బతినే అవకాశం ఉంది. కొన్ని జన్యువులు పరివర్తన చెందుతాయి. దీనివల్ల క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుందని కొంతమంది పరిశోధకుల వాదన. అయితే నేషనల్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ప్రకారం కోహోర్ట్ స్టడీస్, కేస్-కంట్రోల్ స్టడీస్ అనే రెండు రకాల ఎపిడెమియోలాజికల్ పరిశోధనలు జరిగాయి. అందుబాటులో ఉన్న డేటా ప్రకారం సెల్ ఫోన్ వాడకం వల్ల మెదడు క్యాన్సర్ లేదా మరే ఇతర రకాల క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉండదని వీరు తేల్చారు.

Show Full Article
Print Article
Next Story
More Stories