Tech News: ఇయర్‌ ఫోన్స్‌, హెడ్‌ ఫోన్స్‌.. రెండింటీలో ఏది బెస్ట్‌ ఆప్షన్‌.?

Do you have Confusion between headphone and earphone, know her details
x

 Tech News: ఇయర్‌ ఫోన్స్‌, హెడ్‌ ఫోన్స్‌.. రెండింటీలో ఏది బెస్ట్‌ ఆప్షన్‌.?

Highlights

Tech News: ఇయర్‌ ఫోన్స్‌, హెడ్‌ ఫోన్స్‌.. రెండింటీలో ఏది బెస్ట్‌ ఆప్షన్‌.?

Tech News: మ్యూజిక్‌ వినడానికి, గేమ్స్ ఆడే సమయంలో, సినిమాలు వీక్షించే సమయంలో మనం సర్వసాధారనంగా హెడ్‌ఫోన్స్, ఇయర్‌ఫోన్స్‌ను ఉపయోగిస్తుంటాం. అయితే ఈ రెండు చేసేవి ఒకే పని అయినా దేని ఉపయోగాలు, దానికి ఉంటాయి. అయితే మనలో చాలా మంది ఈ రెండింటిలో ఏది కొనుగోలు చేయాలో తెలియక తికమక పడుతుంటారు. ఇంతకీ ఈ రెండింటి మధ్య ఉండే తేడా ఏంటి.? ఏది కొనుగోలు చేస్తే బెటర్‌ ఇప్పుడు తెలుసుకుందాం..

* వాకింగ్‌, జాగింగ్‌ చేసే అలవాటు ఉన్న వారికి ఇయర ఫోన్స్‌ బెస్ట్‌ ఆప్షన్‌గా చెప్పొచ్చు. తీనికి కారణంగా ఇయర్‌ ఫోన్స్‌ చెవుల్లో సులభంగా సెట్ అవుతాయి. తేలికగా ఉంటాయి. పరిగెత్తే సమయంలో పడిపోకుండా చెవుల్లో సెట్‌ అవుతాయి. అంతే కాకుండా ఇయర్‌ ఫోన్స్‌ను క్యారీ చేయడం కూడా చాలా సులభం. బ్యాగ్‌ లేదా ప్యాంట్‌ జేబుల్లో సులభంగా పెట్టుకోవచ్చు. ఇక కాల్స్‌ ఎక్కువగా మాట్లాడే వారికి కూడా మైక్రో ఫోన్‌తో కూడిన ఇయర్‌ ఫోన్స్‌ ఉపయోగపడతాయి. నడుస్తూ, పరిగెడుతూ కూడా ఫోన్స్‌ మాట్లాడుకోవచ్చు. అన్నింటికంటే ముఖ్యంగా ఇయర్‌ ఫోన్‌ ధరలు, హెడ్‌ ఫోన్స్‌తో పోల్చితే తక్కువగా ఉంటాయి.

* ఇక ఎక్కువగా సినిమాలు చూసే వారికి హెడ్‌ ఫోన్స్‌ బెస్ట్ ఆప్షన్‌గా చెప్పొచ్చు. ఎందుంటే ఇందుకే మంచి సౌండ్‌ అనుభూతిని అందిస్తాయి. ఇక ఎక్కువగా సౌండ్స్‌ వచ్చే ప్రదేశాల్లో పనిచేసే వారికి కూడా హెడ్‌ ఫోన్స్‌ ఉపయోగపడతాయి. దీంతో బయటి శబ్ధాలు వినిపించకుండా, పనిపై దృష్టి పెట్టడానికి ఉపయోగపడతాయి. మ్యూజిక్‌ నేర్చుకునే వారికి, సౌండ్ ఇంజనీర్లకు ఇవి మంచి ఎంపికగా చెప్పొచ్చు. ఇక గేమర్స్‌ కూడా హెడ్‌ ఫోన్స్ బాగా ఉపయోగపడతాయి. మెరుగైన గేమింగ్ అనుభూతిని అందిస్తాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories