Inverter Care Tips: ఇంట్లో ఇన్‌వర్టర్‌ ఉందా.. ఎండాకాలం ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!

Do You Have An Inverter At Home These Precautions Are Mandatory During Summer
x

Inverter Care Tips: ఇంట్లో ఇన్‌వర్టర్‌ ఉందా.. ఎండాకాలం ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!

Highlights

Inverter Care Tips: ఎండాకాలం వచ్చేసింది. ఈ సీజన్‌లో విద్యుత్‌ వినియోగం ఎక్కువగా ఉంటుంది.

Inverter Care Tips: ఎండాకాలం వచ్చేసింది. ఈ సీజన్‌లో విద్యుత్‌ వినియోగం ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా నగరాలు, పట్టణాల్లో విద్యుత్‌ వాడకం ఎక్కువగా ఉంటుంది. అలాగే కరెంట్‌ కోతలు కూడా ఎక్కువగా ఉంటాయి. అందుకే చాలామంది ఇన్‌వర్టర్‌ను తెచ్చుకుంటారు. కరెంట్‌ లేనప్పుడు దీనిని వినియోగిస్తారు. అయితే ఇంట్లో ఇన్వర్టర్‌ని ఉపయోగిస్తున్నప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. వాటి గురించి ఈరోజు తెలుసుకుందాం.

ఇన్వర్టర్ బ్యాటరీని చెక్‌ చేస్తూ ఉండాలి

ఇన్వర్టర్‌లో బ్యాటరీ అత్యంత ముఖ్యమైన భాగం. వేసవిలో బ్యాటరీ త్వరగా పాడైపోయే అవకాశాలు ఉంటాయి. బ్యాటరీలో ఉండే నీటిని తరచుగా చెక్‌ చేస్తూ ఉండాలి. అవసరమైతే నీటిని మార్చుతూ ఉండాలి. బ్యాటరీ టెర్మినల్స్ శుభ్రం చేస్తూ ఉండాలి. బ్యాటరీ ఛార్జింగ్ సామర్థ్యాన్ని పరిశీలిస్తూ ఉండాలి.

ఇన్వర్టర్ వైరింగ్‌ని చెక్‌ చేయాలి

ఇన్వర్టర్ వైరింగ్‌లో ఏదైనా లోపం ఏర్పడితే ఇన్వర్టర్‌ త్వరగా పాడవుతుంది. అందుకే వైరింగ్‌ను తరచుగా చెక్‌ చేస్తూ ఉండాలి. వదులుగా ఉన్న కనెక్షన్లను గట్టిగా బిగించాలి. అవసరమైతే దెబ్బతిన్న వైర్లను మార్చుకోవాలి.

ఇన్వర్టర్‌ను సర్వీసింగ్ చేయాలి

వేసవిలో ఇన్వర్టర్‌పై ఎక్కువ లోడ్ పడుతుంది. తరచుగా ఇన్వర్టర్‌ను సర్వీసింగ్ చేయడం వల్ల ఎటువంటి సమస్యలు దరిచేరవు. సర్వీసింగ్‌లో ఇన్వర్టర్‌ను శుభ్రపరచడం, ఆయిల్‌మార్చడం, ఇతర అవసరమైన పనులు చేస్తూ ఉండాలి.

తగిన ప్రదేశంలో పెట్టాలి

ఇన్వర్టర్‌ను వెంటిలేషన్, పొడి ప్రదేశంలో పెట్టాలి. సూర్యకాంతి పడని చోట పెట్టాలి. గాలి సులభంగా అందేవిధంగా ఉండాలి. చుట్టూ తగినంత స్థలం ఉండాలి. ఇన్వర్టర్‌ను ఎప్పుడు ఓవర్‌లోడ్ చేయవద్దు. ఇన్వర్టర్ ను అవసరమైన మేరకే వాడాలి. ఇన్వర్టర్ స్విచ్ ఆఫ్ చేస్తున్నప్పుడు దీంతో నడిచే అన్ని ఉపకరణాలను స్విచ్ ఆఫ్ చేయాలి. ఇన్వర్టర్ దగ్గర మండే పదార్థాలను ఉంచవద్దు.

Show Full Article
Print Article
Next Story
More Stories