Charging Problems: ఫోన్ ఛార్జింగ్ పెట్టి.. స్విచ్ఛ్ ఆన్ చేయడం మర్చిపోతున్నారా.. ఈ సింపుల్ టెక్నిక్‌తో చెక్ పెట్టండిలా..!

Do you Forget to Switch on While Charging the Phone Follow This Simple Technique
x

Charging Problems: ఫోన్ ఛార్జింగ్ పెట్టి.. స్విచ్ఛ్ ఆన్ చేయడం మర్చిపోతున్నారా.. ఈ సింపుల్ టెక్నిక్‌తో చెక్ పెట్టండిలా..!

Highlights

Charging Problems: స్మార్ట్‌ఫోన్‌ వాడే ప్రతీ ఒక్కరికీ ప్రధాన సమస్య బ్యాటరీనే.

Charging Problems: స్మార్ట్‌ఫోన్‌ వాడే ప్రతీ ఒక్కరికీ ప్రధాన సమస్య బ్యాటరీనే. నిత్యం ఎన్నో రకాల యాప్స్ వాడుతుండడంతో.. బ్యాటరీ తర్వగా డిశ్చార్జ్‌ అయిపోతుంది. ఈ క్రమంలో గ్యాప్ దొరికితే చాలు.. ఛార్జింగ్ గురించి ఆలోచిస్తుంటాం. ఇలాంటి సందర్భంలో కొంతమంది ఛార్జింగ్ పెట్టి అక్కడే తిష్ట వేస్తుంటారు. కానీ, ఇంకొంతమంది మాత్రం ఛార్జింగ్ పెట్టి ఫోన్‌ను అలాగే వదిలేస్తుంటారు. పవర్ ఆన్ చేయడం మాత్రం మర్చిపోతుంటారు. ఇలా చాలా సేపటి తర్వాత వచ్చి ఫుల్ ఛార్జ్ అయిందనుకుని వచ్చి చూస్తే.. అసలు స్విచ్ ఆన్ చేయలేదనే విషయం గుర్తుకువస్తుంది.

ప్రతిరోజూ చాలా మంది ఇలాంటి సమస్యనే ఎదుర్కొంటుంటాం. అయితే, ఈ సమస్యకు ఓ సింపుల్ పరిష్కారం ఉందని మీకు తెలుసా? అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం.. మనం సాధారణంగా ఛార్జర్‌కు ఫోన్‌ను కనెక్ట్ చేయగానే.. ఛార్జింగ్ అవుతున్నట్లు చిన్న సౌండ్ వస్తుంటుంది. కానీ, మన హడావుడిలో దానిని పట్టించుకోకుండా అలాగే వెళ్లిపోతుంటాం. ఇకపై ఇలాంటి సమస్యలకు ఈ యాప్‌‌తో చెక్‌ పెట్టొచ్చన్నమాట. ప్లే స్టోర్ నుంచి ఆండ్రాయిడ్ యూజర్లు ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుంటే సరిపోతుంది. అది ఎలా పనిచేస్తుందో కూడా తెలుసుకుందాం..

ముందుగా ప్లే స్టోర్ నుంచి 'బ్యాటరీ సౌండ్ నోటిఫికేషన్‌' అనే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి.

ఆ తర్వాత యాప్‌పై క్లిక్ చేసి ఓపెన్ చేయాలి. యాప్‌లో పైన కనిపించే '+'(ప్లస్) సింబల్‌పై క్లిక్ చేయాలి.

ఇప్పుడు 'మోడ్‌'లో కనెక్టడ్‌ ఆప్షన్‌ను ఎంచుకోవాలి.

ఛార్జర్‌ కనెక్ట్ చేసేప్పుడు ఎలాంటి వాయిస్‌ కావాలో సెలక్ట్ చేసుకోవాలి.

వీటితో పాటు 'డిస్‌కనెక్ట్‌', 'లో బ్యాటరీ', 'ఫుల్ బ్యాటరీ' లాంటి ఆప్షన్స్‌కి కూడా ఆడియో క్లిప్స్‌ని ఎంచుకునే అవకాశం ఉంది.

వాయిస్ కమాండ్‌ను ఎంచుకుని, సేవ్ చేసుకోవాలి.

ఫైన‌ల్‌గా పవర్‌ బటన్‌పై క్లిక్‌ చేయాల్సి ఉంటుంది.

దీంతో మనం ఛార్జింగ్‌కు కనెక్ట్ చేయగానే, ఆటోమెటిక్‌గా ఈ అలారం వినిపిస్తుంది. అంటే మన పవర్ ఆన్ చేయండి మర్చిపోయామని గుర్తుచేస్తుందన్నమాట. మరి ఇంకెందుకు ఆలస్యం వెంటనే ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుని, అలారం సెట్ చేసుకోండి మరి.

Show Full Article
Print Article
Next Story
More Stories