Smartphone: వర్షంలో ఫోన్‌ తడిసిందా.? వెంటనే ఇలా చేయండి..

Smartphone: వర్షంలో ఫోన్‌ తడిసిందా.? వెంటనే ఇలా చేయండి..
x

Smartphone: వర్షంలో ఫోన్‌ తడిసిందా.? వెంటనే ఇలా చేయండి..

Highlights

అనుకోకుండా కురిసే వర్షం కారణంగా స్మార్ట్‌ ఫోన్‌లు తడిసిపోతుంటాయి. స్మార్ట్‌ఫోన్‌ నీటిలో తడిస్తే పాడయ్యే ప్రమాదం ఉంటుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

వర్షాకాలం వచ్చిందంటే దుస్తులు ఆరడం ఎంత ఇబ్బందిగా ఉంటుందో. స్మార్ట్‌ ఫోన్స్‌ ఉపయోగించే వారికి అంతే ఇబ్బందిగా ఉంటుంది. అనుకోకుండా కురిసే వర్షం కారణంగా స్మార్ట్‌ ఫోన్‌లు తడిసిపోతుంటాయి. స్మార్ట్‌ఫోన్‌ నీటిలో తడిస్తే పాడయ్యే ప్రమాదం ఉంటుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

వాటర్‌ రెసిస్టెంట్ ఫోన్స్‌ అందుబాటులో ఉన్న మెజారిటీ ప్రజలు మాత్రం సాధారణ ఫోన్‌లను ఉపయోగిస్తున్నారు. దీంతో వర్షాకాలంలో ఫోన్‌లు పాడవ్వడం సర్వసాధారణంగా మారిపోయింది. అయితే కొన్ని సింపుల్‌ టిప్స్‌ పాటించడం ద్వారా ఫోన్‌ నీటిలో తడిసినా నష్టాన్ని నివారించుకోవచ్చు. ఇంతకీ వర్షంలో తడిసినా వెంటనే ఏం చేస్తే ఫోన్‌ను రక్షించుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం..

స్మార్ట్‌ ఫోన్‌ తడిసిన వెంటనే ఫోన్‌ను ఆఫ్‌ చేయాలి. అయితే చాలా మంది ఆతృతలో ఫోన్‌ పనిచేస్తుందా లేదా అని చూసేందుకు ఆపరేట్‌ చేస్తుంటారు. అయితే ఇలా చేయడం వల్ల ఫోన్‌ షార్ట్‌ సర్క్యూట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో వెంటనే ఫోన్‌ను ఆఫ్‌ చేయాలి. ఇక ఒకవేళ మీ ఫోన్‌లో బ్యాటరీ తీయడానికి వీలుంటే బ్యాటరీని రిమూవ్‌ చేయడం బెటర్‌. అయితే ప్రస్తుతం మార్కెట్లో నాన్‌ రీమూవబుల్ బ్యాటరీ ఫోన్స్‌ ఎక్కువగా ఉన్నాయి.

అలాగే ఫోన్‌ తడిసినా వెంటనే సిమ్‌కార్డ్‌, మెమోరీ కార్డ్ వంటి వాటిని తొలగించాలి. అనంతరం టిష్యూ పేపర్‌ లేదా న్యూస్‌ పేపర్‌తో శుభ్రం చేయాలి. వీలైనంత వరకు ఫోన్‌లోని అన్ని భాగాలను బాగా తూడ్చాలి. ఇక కొందరు ఫోన్‌లు నీటిలో పడగానే హెయిర్ డ్రయ్యర్లను ఉపయోగిస్తుంటారు. అయితే ఇలా చేయడం వల్ల ఫోన్‌లోని భాగాలు వేడికి పాడయ్యే అవకాశం ఉంటుంది. ఫోన్‌ లోపలికి వెళ్లిన నీటిని తొలగించడానికి బియ్యం ఉపయోగపడుతుంది.

ఇందుకోసం ఫోన్‌ను వెంటనే బియ్యం ఉన్న సంచిలో లేదా డబ్బాలో వేయాలి. ఇలా చేయడం వల్ల ఫోన్‌లోని నీటిని బియ్యం పీల్చేస్తుంది. ఇక సిలికా జెల్‌ బ్యాగ్స్‌ను కూడా ఉపయోగించవచ్చు. ఒక కవర్‌లో ఫోన్‌తో పాటు కొన్ని సిలికా జెల్‌ ప్యాకెట్స్‌ను వేసి ఉంచాలి. ఇవి ఫోన్‌లోని నీటిని మొత్తం పీల్చేస్తాయి.

మరిన్ని టెక్నాలజీ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Show Full Article
Print Article
Next Story
More Stories