Wi Fi Router: ఇంట్లో ఈ ప్రదేశాల్లో వై ఫై రూటర్‌ పెట్టవద్దు.. ఇంటర్నెట్‌ స్పీడ్‌ తగ్గుతుంది..!

Do Not Put Wi-Fi Router in These Places at Home Internet Speed Will Decrease
x

Wi Fi Router: ఇంట్లో ఈ ప్రదేశాల్లో వై ఫై రూటర్‌ పెట్టవద్దు.. ఇంటర్నెట్‌ స్పీడ్‌ తగ్గుతుంది..!

Highlights

Wi Fi Router: ఇంటర్నెట్‌ కోసం చాలామంది వై ఫై రూటర్స్‌ను ఇన్‌స్టాల్‌ చేసుకుంటారు. దీనివల్ల ఇంట్లోని సభ్యులందరు ఇంటర్నెట్‌ వాడవచ్చు.

Wi Fi Router: ఇంటర్నెట్‌ కోసం చాలామంది వై ఫై రూటర్స్‌ను ఇన్‌స్టాల్‌ చేసుకుంటారు. దీనివల్ల ఇంట్లోని సభ్యులందరు ఇంటర్నెట్‌ వాడవచ్చు. అయితే కొన్నిసార్లు రూటర్‌ ఉన్నప్పటికీ ఇంటర్నెట్‌ మాత్రం రాదు. కొన్నిసార్లు వచ్చినప్పటికీ స్పీడ్‌ తక్కువగా ఉంటుంది. ఏదైనా వీడియో చూస్తుంటే బఫరింగ్‌ అవుతూ ఉంటుంది. దీనికి కారణం రూటర్‌ని తప్పు దిశలో ఇన్‌స్టాల్‌ చేయడమే. రూటర్‌ని ఇంట్లో ఎక్కడ ఇన్‌స్టాల్‌ చేయాలో ఈ రోజు తెలుసుకుందాం.

Wi-Fi రూటర్ ఎల్లప్పుడూ ఇంటి మధ్య ప్రాంతంలో ఇన్‌స్టాల్‌ చేయాలి. దీనివల్ల ప్రతి గదికి మంచి కవరేజీని అందిస్తుంది. మీరు రూటర్‌ను ఇంట్లో కవర్ చేయబడని ప్రదేశంలో ఇన్‌స్టాల్‌ చేస్తే దీని కారణంగా ఇంటర్నెట్‌ స్పీడ్‌ తగ్గుతుంది. మీరు రూటర్‌ని ఇంట్లో క్లోజ్‌చేసిన గదిలో ఇన్‌స్టాల్‌ చేయకూడదు. దీనివల్ల ఆ రూమ్‌ వరకే ఇంటర్నెట్‌ పరిమితమవుతుంది. మిగతా రూమ్‌లకు రాదు. రూటర్‌ను స్టూల్ లేదా టేబుల్‌పై ఉంచడం చాలా ఇళ్లలో కనిపిస్తుంది. దీని కారణంగా ఇంటర్నెట్ స్పీడ్‌ తగ్గుతుంది. రూటర్ ఎల్లప్పుడూ కొంత ఎత్తులో ఇన్‌స్టాల్ చేయాలి. ఇది అప్పుడే ప్రతి గదికి సమాన పరిధిని అందిస్తుంది ఇంటర్నెట్ కనెక్టివిటీ బాగా ఉంటుంది.

మీ ఇల్లు చాలా అంతస్తుల ఇళ్లు అయితే మీరు మధ్య అంతస్తులో మాత్రమే రూటర్‌ని ఇన్‌స్టాల్ చేయడానికి ప్రయత్నించాలి. దీనివల్ల మీ పై అంతస్తుల వారికి కింది అంతస్తుల వారికి ఇంటర్నెట్ అందుతుంది. అయితే గ్రౌండ్ ఫ్లోర్‌లో రూటర్‌ని ఇన్‌స్టాల్‌ చేస్తే అక్కడి వరకు మాత్రమే పరిమితమవుతుందని గుర్తుంచుకోండి. అలాగే రూటర్‌ రెండు అంతస్తుల వరకు మాత్రమే ఇంటర్నెట్‌ అందిస్తుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories