Digital Condom: డిజిటల్ కండోమ్‌ తీసుకొచ్చిన జర్మన్.. ఎవరి కోసం, ఎలా ఉపయోగించాలంటే?

Digital Condom
x

Digital Condom

Highlights

What is Digital Condom: డిజిటల్ ప్రపంచంలో ఏదైనా సాధ్యమేనని మరోసారి రుజువైంది. ఈ క్రమంలోనే డిజిటల్ కండోమ్‌ను కూడా విడుదల చేసి జనాలకు షాకిచ్చారు.

What is Digital Condom: డిజిటల్ ప్రపంచంలో ఏదైనా సాధ్యమేనని మరోసారి రుజువైంది. ఈ క్రమంలోనే డిజిటల్ కండోమ్‌ను కూడా విడుదల చేసి జనాలకు షాకిచ్చారు. అయితే, ఇది నిజంగా కండోమ్ లాంటిది కాదండోయ్.. ఇది ఓ కండోమ్ యాప్‌. దీని ఉద్దేశ్యం లైంగిక సంపర్కం సమయంలో అనుమతి లేకుండా రికార్డింగ్స్‌ నుంచి రక్షణ కల్పించడం. ఈ కొత్త యాప్ సోషల్ మీడియా ప్రపంచంలో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ యాప్ చూసిన జనాలు పలు కామెంట్స్ పోస్ట్ చేస్తున్నారు. కొందరు ఆశ్చర్యపోతూ ప్రశ్నిస్తుంటే, మరికొందరు ప్రశంసిస్తున్నారు.

కొత్త రకమైన భద్రత..

వాస్తవానికి, ఈ యాప్ సమాజంలో కొత్త రకమైన భద్రతను అందించేందుకు అభివృద్ధి చేశారు. తద్వారా వినియోగదారులు అనుమతి లేకుండా పర్సనల్ వీడియోలను రికార్డింగ్ చేసే ప్రమాదం నుంచి సేవ్ అవుతారన్నమాట. ఏకాభిప్రాయం లేకుండా చేసే రికార్డింగ్‌లను నిరోధించే లక్ష్యంతో దీనిని జర్మన్ బ్రాండ్ బిల్లీ బాయ్, ఏజెన్సీ ఇన్నోసియన్ బెర్లిన్ అభివృద్ధి చేశారు. దీని కింద, వినియోగదారులు బ్లూటూత్ ద్వారా తమ స్మార్ట్‌ఫోన్ కెమెరా, మైక్రోఫోన్‌ను బ్లాక్ చేయవచ్చు. తద్వారా ఏకాభిప్రాయం లేని వీడియో లేదా ఆడియో రికార్డింగ్‌ను అడ్డుకోవచ్చన్నమాట.

ఇది ఎలా పని చేస్తుంది?

ఈ యాప్ లైంగిక భద్రత కోసం రూపొందించింది. ఇది స్మార్ట్‌ఫోన్‌ను బ్లాక్ చేయడం ద్వారా అనుమతి లేకుండా చేసే రికార్డింగ్‌లను నిరోధిస్తుంది. వినియోగదారులు చేయవలసిందల్లా వారి స్మార్ట్‌ఫోన్‌ను భాగస్వామి ఫోన్ దగ్గర ఉంచి, అన్ని కెమెరాలు, మైక్రోఫోన్‌లను ఆఫ్ చేసే వర్చువల్ బటన్‌ను స్వైప్ చేయాలన్నమాట. ఎవరైనా సమాచారం ఇవ్వకుండా బయటకు వెళ్లడానికి ప్రయత్నిస్తే, అలారం మోగుతుంది.

అంటే, ఈ యాప్‌ను ఉపయోగించాలంటే సెక్స్‌కు ముందు యూజర్లు తమ స్మార్ట్‌ఫోన్‌లను దగ్గరగా ఉంచుకోవాలి. వారు వర్చువల్ బటన్ స్వైప్‌తో అన్ని కెమెరాలు, మైక్రోఫోన్‌లను బ్లాక్ చేయవచ్చు. ఎవరైనా రహస్యంగా రికార్డ్ చేయడానికి ప్రయత్నిస్తే? యాప్‌ నుంచి ఓ అలర్ట్ వస్తుంది. అలాగే, ఇది ఏకకాలంలో అనేక డివైజ్‌లను బ్లాక్ చేయగలదు.

ఎవరు తయారు చేశారు?

డేటా గోప్యతను కాపాడేందుకు ఈ యాప్‌ను రూపొందించినట్లు డెవలపర్ ఫెలిప్ అల్మెడా తెలిపారు. ఇన్నోసియన్ బెర్లిన్ సహకారంతో బిల్లీ బాయ్ దీనిని అభివృద్ధి చేశారు.

భద్రత ఎందుకు ముఖ్యం?

ప్రస్తుతం ప్రైవేట్ ఫొటోలు, వీడియోల దుర్వినియోగం పెరిగిపోయింది. దీని కారణంగా బాధితులు మానసిక ఒత్తిడి, ఇతర సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఇటువంటి సంఘటనలను నివారించడానికి ఈ యాప్ సహాయం చేస్తుంది.

ఇది ఏ రకమైన పరికరాలను నిరోధించగలదు?

ఇది ఒకటి కంటే ఎక్కువ ఫోన్‌లను ఏకకాలంలో బ్లాక్ చేయగలదు.

ఎవరు ఉపయోగించగలరు?

ఈ యాప్ లైంగిక భద్రతలో భాగంగా డిజిటల్ జనరేషన్ కోసం ప్రత్యేకంగా రూపొందించారు. తద్వారా వారి గోప్యత రక్షించబడుతుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories