స్మార్ట్‌ఫోన్‌ యూజర్లకు వార్నింగ్‌‌.. మీ ఫోన్‌లో ఈ యాప్స్‌ ఉంటే వెంటనే డిలీట్‌ చేయండి..!

Delete These Dangerous Apps From Your Mobile
x

స్మార్ట్‌ఫోన్‌ యూజర్లకు వార్నింగ్‌‌.. మీ ఫోన్‌లో ఈ యాప్స్‌ ఉంటే వెంటనే డిలీట్‌ చేయండి..!

Highlights

Dangerous Apps: పెరుగుతోన్న టెక్నాలజీతో పాటు నేరాలు కూడా పెరుగుతూనే ఉన్నాయి.

Dangerous Apps: పెరుగుతోన్న టెక్నాలజీతో పాటు నేరాలు కూడా పెరుగుతూనే ఉన్నాయి. స్మార్ట్‌ఫోన్లలో మాల్‌వేర్ మరోసారి కలకలం రేపుతోంది. ఈ సారి ఏకంగా రెండు వందలకు పైగా ఆండ్రాయిడ్, ఐఓఎస్ యాప్స్ ప్రమాదకరంగా గుర్తించారు సైబర్ సెక్యూరిటీ నిపుణులు. వీటిలో కొన్ని పాపులర్ యాప్స్ కూడా ఉన్నాయి. మీ మొబైల్‌లో ఈ యాప్స్ ఉంటే వెంటనే డిలిట్ చేయండి. ఈ యాప్స్ మీ స్మార్ట్‌ఫోన్‌ను కంట్రోల్ చేసి, మీ బ్యాంక్ ఖాతాలను కూడా యాక్సెస్ చేస్తాయి. అకౌంట్‌లోని డబ్బుల్ని కాజేస్తాయి.

ఈ యాప్‌లను థాయిలాండ్ మినిస్ట్రీ ఆఫ్ డిజిటల్ ఎకానమీ అండ్ సొసైటీ (DES), నేషనల్ సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీ (NCSA) గుర్తించాయి. 203 ప్రమాదకరమైన యాప్స్‌ను గుర్తించిన ఈ సంస్థలు వీటిని తొలగించాలంటూ గూగుల్, యాపిల్‌ను కోరాయి. ఈ యాప్స్‌ని లక్షలాది మంది యూజర్లు డౌన్‌లోడ్ చేశారని అంచనా. ఒకవేళ మీ డివైజ్‌లో ఈ యాప్‌లను ఇన్‌స్టాల్ చేసుంటే మీ బ్యాటరీ డ్రెయిన్ లేదా పరికరం పనితీరు మందగించడం లాంటివి మార్పులును గమనిస్తారు. కనుక మీ స్మార్ట్‌ఫోన్ పనితీరులో ఏవైనా మార్పులు కనిపిస్తే వెంటనే అవసరం లేని యాప్స్ డిలిట్ చేయండి ఉత్తమం. లేదంటే డేటా బ్యాకప్ చేసి మొబైల్‌ను పూర్తిగా రీసెట్ చేయండి.



Show Full Article
Print Article
Next Story
More Stories