Sim Card Details: మీ పేరుపై ఎన్ని సిమ్స్ ఉన్నాయో తెలుసుకోండి ఇలా

Check How Many Mobile Numbers On Your Name By This Web Site And Protect From Sim Card Fraud
x

సిమ్ కార్డు (ఫైల్ ఫోటో)

Highlights

Sim Card Details: ప్రస్తుతం టెలికాం సంస్థలు ఇచ్చే ఆఫర్ లకు ఉత్సాహంతో వివిధ రకాల కంపెనీల సిమ్ లను మనం మారుస్తునే ఉంటాం పర్మినెంట్ గా ఒక నెంబర్ మేంటైన్...

Sim Card Details: ప్రస్తుతం టెలికాం సంస్థలు ఇచ్చే ఆఫర్ లకు ఉత్సాహంతో వివిధ రకాల కంపెనీల సిమ్ లను మనం మారుస్తునే ఉంటాం పర్మినెంట్ గా ఒక నెంబర్ మేంటైన్ చేస్తూనే కొన్ని వ్యక్తిగత అవసరాల కోసం, బిజినెస్ ల కోసం కొత్త నెంబర్ లను తీస్కొని వాడి వాటి ఆఫర్లు పూర్తయిన తరవాత ఈ సిమ్ ను పక్కన పెట్టేసి మరో కొత్త అఫర్ ఉన్న సిమ్ తీసుకుంటుంటాం. ఆలా మనం మొబైల్ లో సిమ్ లను మార్చే క్రమంలో మన పేరుపై ఎన్ని సిమ్ లు ఉన్నాయో కూడా మర్చిపోతాము. అయితే ఆ సిమ్ యొక్క వివరాలను తెలుసుకోడానికి కేంద్ర టెలికం మంత్రిత్వ శాఖా పైలట్ ప్రాజెక్ట్ మీద తెలుగు రాష్ట్రాల్లో ఒక అధికారిక వెబ్ సైట్ ద్వారా సేవలను అందించనుంది.

tafcop.dgtelecom.gov.in

వెబ్ సైట్ లో మీ సంబంధిత నెంబర్ ఎంటర్ చేయగానే ఓటీపీ తో లాగిన్ అయ్యాక అందులో మీ పేరుని ఎంటర్ చేయాలి దాంతో మీ పేరు మీద ఉన్న సిమ్ కార్డు యొక్క వివరాలు కనబడుతాయి. మీకు అవసరం, అవసరం లేదు, ఈ నెంబర్ నాది కాదు అనే ఆప్షన్స్ ఉంటాయి దాంట్లో ఒక ఆప్షన్ ని క్లిక్ చేస్తే మీరు తీసుకున్న ప్రకారం కేంద్ర టెలికాం సంస్థ ఆ నెంబర్ పై చర్యలు తీసుకుంటుంది. ఇటీవలే ఈ ప్రాజెక్ట్ ని లాంచ్ చేసిన ప్రభుత్వం ఆ సైట్ కి పూర్తి స్థాయిలో మెరుగులు దిద్ది దేశ వ్యాప్తంగా ఈ ప్రాజెక్ట్ ని లాంచ్ చేయనుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories