Portable AC: మండే ఎండల్లో కూల్ న్యూస్.. ఈ పోర్టబుల్ ఏసీతో ఇంటిని సిమ్లాలా మార్చేయండి.. లాయిడ్ నుంచి 1 టన్ చౌకైన ఏసీ..!

Cheapest Portable Ac Under Rs 40000 Lloyd Air Conditioners 100 Percent Copper Offer Bank Discount
x

Portable AC: మండే ఎండల్లో కూల్ న్యూస్.. ఈ పోర్టబుల్ ఏసీతో ఇంటిని సిమ్లాలా మార్చేయండి.. లాయిడ్ నుంచి 1 టన్ చౌకైన ఏసీ..

Highlights

Cheapest Portable AC in India: దేశంలో ఎండ వేడి పెరిగిపోతోంది. ఏప్రిల్ 2024 చివరి నాటికే సూర్యుని వేడి జనాలకు మంట పుట్టిస్తోంది.

Cheapest Portable AC in India: దేశంలో ఎండ వేడి పెరిగిపోతోంది. ఏప్రిల్ 2024 చివరి నాటికే సూర్యుని వేడి జనాలకు మంట పుట్టిస్తోంది. ఇప్పటికే వేడి విపరీతంగా పెరిగిపోయింది. అలాగే, హీట్‌వేవ్ గురించి హెచ్చరికలు జారీ చేశారు. దీంతో ఎండాకాలం వచ్చిందంటే చాలు కూలర్లు, ఫ్యాన్లు, ఏసీలు కొనుక్కోవడం వల్లే ఇలాంటి కూలింగ్ ఉపకరణాలకు మార్కెట్‌లో ఒక్కసారిగా డిమాండ్ పెరుగుతోంది. ఎండ వేడిమి నుంచి ఉపశమనం పొందేందుకు ప్రజలు తమ సామర్థ్యం మేరకు ఉపకరణాలను కొనుగోలు చేస్తున్నారు. స్ప్లిట్ AC, విండో AC కాకుండా, పోర్టబుల్ AC కూడా మార్కెట్లో అందుబాటులో ఉంది.

అతి ముఖ్యమైన విషయం ఏమిటంటే, పోర్టబుల్ ఏసీని ఒక చోట అమర్చాల్సిన అవసరం లేదు. మీకు కావలసినప్పుడు దాన్ని తీసుకొని మరొక ప్రదేశానికి తరలించవచ్చు. ఈ క్రమంలో వచ్చిందే లాయిడ్ 1 టన్ 3 స్టార్ పోర్టబుల్ AC ధర, ఫీచర్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

Lloyd 1 టన్ 3 స్టార్ పోర్టబుల్ AC ధర..

లాయిడ్ 1 టన్ను 3 స్టార్ పోర్టబుల్ ACని రూ. 40,000కి పొందవచ్చు. 1 టన్ను సామర్థ్యంతో లాయిడ్ పోర్టబుల్ AC 3 స్టార్ BEE రేటింగ్ 2020తో అందుబాటులోకి వచ్చింది.

లాయిడ్ 1 టన్ 3 స్టార్ పోర్టబుల్ AC ఫీచర్లు..

నాన్-ఇన్వర్టర్ 1 స్టార్‌తో పోలిస్తే ఇది 15 శాతం వరకు ఆదా చేయగలదని ఈ AC గురించి కంపెనీ పేర్కొంది. ఈ AC ఆటో రీస్టార్ట్ ఫీచర్‌తో వస్తుంది. ఈ ఏసీలో ఫ్యాన్ మోడ్, కూల్ మోడ్ అందించింది.

Lloyd నుంచి ఈ పోర్టబుల్ AC క్లీన్ ఎయిర్ ఫిల్టర్, హై ఎఫిషియెన్సీ కూలింగ్ ట్యూబ్, ఆటో రీస్టార్ట్, 100 శాతం కాపర్, రిమోట్ కంట్రోల్ ఆపరేషన్, 360 డిగ్రీల కదలిక, బలమైన క్యాస్టర్ వీల్స్‌తో అందించబడింది.

ఈ పోర్టబుల్ ACలో R410A రిఫ్రిజిరేషన్ గ్యాస్ ఉపయోగించారు. Lloyd ఈ ACని కంపెనీ వెబ్‌సైట్ లేదా ఆఫ్‌లైన్ రిటైల్ స్టోర్‌ని సందర్శించడం ద్వారా కొనుగోలు చేయవచ్చు.

Show Full Article
Print Article
Next Story
More Stories