BSNL: కస్టమర్లకు బిఎస్ఎన్ఎల్ షాక్..వ్యాలిడిటీలో కోత.!

BSNL: కస్టమర్లకు బిఎస్ఎన్ఎల్ షాక్..వ్యాలిడిటీలో కోత.!
x
Highlights

BSNL: కస్టమర్లకు బిఎస్ఎన్ఎల్ షాకిచ్చింది. కంపెనీ తన చౌక ప్లాన్ లలో ఒకదానిపై వ్యాలిడిటీలో కోత పెట్టింది. దీంతో వినియోగదారులపై పరోక్షంగా భారం మోపింది.

BSNL: ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ వినియోగదారులకు షాక్ ఇచ్చింది. యూజర్‌బేస్ పరంగా BSNL నాలుగో స్థానంలో ఉంది. దేశవ్యాప్తంగా 8-9 కోట్ల మంది ప్రజలు తమ స్మార్ట్‌ఫోన్‌లలో BSNL సిమ్‌ని ఉపయోగిస్తున్నారు. బీఎస్ఎన్ఎల్ ఇతర టెలికాం కంపెనీలతో పోల్చితే తక్కువ వినియోగదారులను కలిగి ఉన్నప్పటికీ.. కంపెనీ దాని చౌక, సరసమైన రీఛార్జ్ ప్లాన్‌లతో జియో (Jio), ఎయిర్ టెల్ (Airtel), వొడాఫోన్ ఐడియా (Vi) లకు గట్టి పోటీనిస్తుంది. బీఎస్ఎన్ఎల్ వినియోగదారులు కంపెనీ నుంచి చాలా ఏళ్లుగా శుభవార్తలే వింటున్నప్పటికీ..తాజాగా తన కస్టమర్లకు పెద్ద షాక్ ఇచ్చింది.

బీఎస్ఎన్ఎల్ దాని చౌకైన, సరసమైన ప్రీపెయిడ్ ప్లాన్‌లలో ఒకదాని చెల్లుబాటును తగ్గించింది. అంటే ఇప్పుడు మీరు బీఎస్ఎన్ఎల్ రీఛార్జ్ ప్లాన్‌లో ఎక్కువ డబ్బు ఖర్చు చేయబోతున్నారు. బీఎస్ఎన్ఎల్ చేసిన ఈ మార్పు గురించి తెలుసుకుందాం. బీఎస్ఎన్ఎల్ తన రూ. 88 ప్లాన్ వ్యాలిడిటీని తగ్గించింది. ఇప్పుడు ఈ చిన్న, చౌక ప్లాన్‌లో, కస్టమర్‌లు తక్కువ రోజుల వ్యాలిడిటీని పొందుతారు. బీఎస్ఎన్ఎల్ ఈ ప్లాన్ వాలిడిటీని 5 రోజులు తగ్గించింది. ఇంతకుముందు కంపెనీ ఈ ప్లాన్‌లో తన వినియోగదారులకు 35 రోజుల చెల్లుబాటును ఇచ్చేది. కానీ ఇప్పుడు వినియోగదారులకు 30 రోజుల చెల్లుబాటు మాత్రమే అందిస్తుంది.

ఈ రూ.88 రీఛార్జ్ ప్లాన్‌లో బీఎస్ఎన్ఎల్ కస్టమర్లు నిమిషానికి 10 పైసల చొప్పున కాలింగ్ సౌకర్యాన్ని అందిస్తుంది. ఈ రీఛార్జ్ ప్లాన్‌లో, వినియోగదారులకు ఇంటర్నెట్ డేటా ఫెసిలిటి లేదు. ఈ రీఛార్జ్ ప్లాన్ ఇప్పుడు దేశంలోని అన్ని టెలికాం సర్కిల్‌లలో కొత్త చెల్లుబాటుతో అందుబాటులో ఉంది. ఈ రీఛార్జ్ ప్లాన్ ఇంటర్నెట్ డేటాతోపాటు తక్కువగా కాల్స్ మాట్లాడే వినియోగదారులకు ఈ ప్యాక్ బెస్ట్ ఛాయిస్ అని చెప్పవచ్చు. ఈ ప్లాన్ తక్కువ ఖర్చుతో 30 రోజుల పాటు కాలింగ్ ఇన్‌కమింగ్ సౌకర్యాన్ని అందిస్తుంది. మీరు బిఎస్ఎన్ఎల్ సిమ్‌ని ఉపయోగిస్తే, మీరు ఈ ప్లాన్‌తో చాలా వరకు డబ్బు ఆదా చేసుకోవచ్చు.

Show Full Article
Print Article
Next Story
More Stories