BSNL Offer: దిమ్మతిరిగే ఆఫర్.. సగం ధరకే 52 రోజులు అన్‌లిమిటెడ్ కాలింగ్, డేటా.. షిఫ్ట్ అవ్వడం బెటర్..!

bsnl
x

bsnl

Highlights

BSNL Offer: బీఎస్‌ఎన్ఎల్ తీక్కువ ధరకే 52 రోజుల పాటు అన్‌లిమిటెడ్ కాలింగ్, డేటాను అందిస్తుంది.

BSNL Offer: ప్రైవేట్ టెలికాం కంపెనీలు ధరలు పెంచడాన్ని బీఎస్‌ఎన్ఎల్ పూర్తిగా సద్వినియోగం చేసుకుంటుంది. పెరిగిన రీఛార్జ్ ప్లాన్ల భారాన్ని ఎదుర్కొంటున్న వినియోగదారులకు ఉపశమనం కలిగించడానికి బీఎస్‌ఎన్‌ఎల్ నిరంతరం చౌక, సరసమైన ప్లాన్‌లను తీసుకొస్తుంది. కంపెనీ కూడా దీని ప్రభావాన్ని చూడటం ప్రారంభించింది. జులై నెలలో 29 లక్షల మంది బీఎస్‌ఎన్‌ఎల్‌లో చేరారు. కొత్త కస్టమర్లను పొందేందుకు ఈ వేగాన్ని కొనసాగించడానికి ఇప్పుడు కొత్త రీఛార్జ్ ప్లాన్‌తో ముందుకు వచ్చింది.

ప్రస్తుతం టెలికాం పరిశ్రమలో వినియోగదారులకు తక్కువ ధరకు రీఛార్జ్ ప్లాన్‌లను అందిస్తున్న ఏకైక సంస్థ BSNL. జూలైలో రీఛార్జ్ ప్లాన్‌ల ధరలు పెంచిన తర్వాత మొబైల్ వినియోగదారులు చౌకైన ప్లాన్‌ల కోసం BSNL వైపు మొగ్గు చూపుతున్నారు. జియో, ఎయిర్‌టెల్ ప్లాన్‌ల కంటే ఎక్కువ ప్రయోజనాలను అందించే రీఛార్జ్ ప్లాన్‌లు చాలా బీఎస్‌ఎన్‌ఎల్ దగ్గర ఉన్నాయి. అయితే వాటి ధర జియో, ఎయిర్‌టెల్‌లో సగం ఉంటుంది.

ప్రభుత్వ టెలికాం ఏజెన్సీ BSNL రీఛార్జ్ ప్లాన్ ధర రూ. 300 కంటే తక్కువ. ఈ చౌకైన ప్లాన్‌లో మీరు 52 రోజుల లాంగ్ వాలిడిటీ పొందుతారు. ఈ విధంగా మీరు 28 రోజుల తర్వాత మీ రీఛార్జ్ అయిపోతుందనే ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఇందులో మీరు అన్‌లిమిటెడ్ ఫ్రీ కాలింగ్, డేటా ఆఫర్‌లు రెండింటినీ పొందుతారు.

BSNL ఈ ప్లాన్‌లో, మీకు రెండు నెలల వాలిడిటీ ఉండదు కానీ ఈ ప్లాన్ రెండు నెలల ప్లాన్‌ల కంటే చౌకగా ఉంటుంది. ఈ రీఛార్జ్ ప్లాన్ కోసం మీరు కేవలం 298 రూపాయలు మాత్రమే ఖర్చు చేయాలి. దీని తర్వాత మీరు 52 రోజుల పాటు ఏదైనా నెట్‌వర్క్‌లో పగలు, రాత్రి అపరిమిత కాలింగ్ ప్రయోజనాన్ని పొందవచ్చు. మీరు మొత్తం వాలిడిటీ కోసం 52GB డేటాను పొందుతారు. అంటే మీరు ప్రతిరోజూ 1GB డేటాను ఉపయోగించవచ్చు. ఇది కాకుండా, Eros Now ఫ్రీ సబ్‌స్క్రిప్షన్ కూడా ప్లాన్‌లో అందుబాటులో ఉంది.

Show Full Article
Print Article
Next Story
More Stories