BSNL: ప్రీపెయిడ్ ప్లాన్లలో నే ది బెస్ట్.. 600GB డేటాతో పాటు.. దీర్ఘకాల వ్యాలిడిటీతో పాటు ఓ స్పెషల్ ఓటీటీ కూడా..!

BSNL Offers Rs 1999 Year Prepaid Plan With 600Gb Data And Eros Now OTT Check Details
x

BSNL: ప్రీపెయిడ్ ప్లాన్లలో నే ది బెస్ట్.. 600GB డేటాతో పాటు.. దీర్ఘకాల వ్యాలిడిటీతో పాటు ఓ స్పెషల్ ఓటీటీ కూడా..!

Highlights

BSNL Prepaid Plan: భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) తన కస్టమర్లకు అనేక రకాల ప్లాన్‌లను అందిస్తోంది.

BSNL Prepaid Plan: భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) తన కస్టమర్లకు అనేక రకాల ప్లాన్‌లను అందిస్తోంది. ప్రతి ప్లాన్ కస్టమర్ల వివిధ అవసరాలకు అనుగుణంగా అందిస్తోంది. కంపెనీ ఓ అద్భతమైన ప్రీపెయిడ్ ప్లాన్‌ను కలిగి ఉంది. దీనిలో కంపెనీ 600GB డేటా, Eros Now ప్రయోజనాన్ని అందిస్తుంది. లాంగ్ టర్మ్ వాలిడిటీ ప్లాన్ ఉంది. ఈ ప్లాన్ వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..

మేం మాట్లాడుతున్న ప్లాన్ చాలా కాలం చెల్లుబాటుతో కూడిన BSNL ప్లాన్. ఈ ప్లాన్‌లో, వినియోగదారులు ప్రత్యేక డేటా, వ్యాలిడిటీని పొందుతారు. ఈ ప్రయోజనాల్లో కొన్ని ప్లాన్ చెల్లుబాటు కంటే ముందే ముగుస్తాయి.

వాస్తవానికి, మేం కంపెనీ ప్రీపెయిడ్ ప్లాన్ రూ. 1,999 గురించి మాట్లాడుతున్నాం. ఇది కంపెనీ పాత ప్లాన్. దేశంలోని అన్ని ప్రాంతాల్లో కంపెనీ ఈ ప్లాన్‌ను అందిస్తోంది.

BSNL రూ. 1,999 ప్లాన్‌లో అపరిమిత వాయిస్ కాలింగ్, రోజుకు 100 SMS, 600GB డేటా అందించనుంది. 600GB డేటా వినియోగం తర్వాత వేగం 40 Kbpsకి పడిపోతుంది.

ఈ ప్లాన్‌లో, ఎరోస్ నౌ ఎంటర్‌టైన్‌మెంట్ సేవ కూడా వినియోగదారులకు ఉచితంగా అందించనుంది. కానీ, ఈరోస్ నౌ ప్రయోజనాలు వినియోగదారులకు 30 రోజులు మాత్రమే అందించబడతాయి. అంతేకాకుండా, ఈ ప్లాన్‌లో, మొదటి 30 రోజుల పాటు వినియోగదారులకు PRBT ఎంపిక కూడా ఇవ్వనుంది.

BSNL ఈ రూ. 1,999 ప్లాన్ 365 రోజుల చెల్లుబాటుతో వస్తుంది. అంటే, ఈ ప్లాన్‌లో పూర్తి ఒక సంవత్సరం వాలిడిటీ అందించింది. అయితే, BSNL దేశంలోని చాలా ప్రాంతాల్లో 4Gని అందించడం లేదు.

Show Full Article
Print Article
Next Story
More Stories