BSNL Recharge Offers: కొత్త సంవత్సరం కొత్త ఆఫర్లు... అతి తక్కువ ధరకే అదిరిపోయే బెనిఫిట్స్

BSNL Recharge Offers
x

BSNL Recharge Offers: కొత్త సంవత్సరం కొత్త ఆఫర్లు... అతి తక్కువ ధరకే అదిరిపోయే బెనిఫిట్స్

Highlights

BSNL New Year 2025 Offers: ఇతర టెలికాం కంపెనీలతో పోలిస్తే BSNL ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్స్ అందుబాటు ధరలో లభిస్తాయి.

BSNL New Year 2025 Offers: ఇతర టెలికాం కంపెనీలతో పోలిస్తే BSNL ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్స్ అందుబాటు ధరలో లభిస్తాయి. దేశమంతటా బీఎస్ఎన్ఎల్ 4G మొబైల్ ఇంటర్నెట్ సేవలు, 5G నెట్‌వర్క్‌ను అతి త్వరలో ప్రారంభించబోతోంది. ఇది రెండు కొత్త ప్రీపెయిడ్ ప్లాన్‌లను కూడా ప్రారంభించింది. వాటి ధర రూ.628, రూ.215 గా ఉంది. ఈ రీఛార్జ్ ప్లాన్లలో అన్‌లిమిటెడ్ కాల్స్, ఎస్ఎమ్ఎస్, డేటా బెనిఫిట్స్ అందుబాటులో ఉన్నాయి. ఈ రీఛార్జ్ ప్లాన్స్‌తో బీఎస్ఎన్ఎల్ ఇంకా ఎటువంటి ప్రయోజనాలు అందిస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం.

BSNL Rs .628 Recharge Plan -బీఎస్ఎన్ఎల్ రూ. 628 రీచార్జ్ ప్లాన్

ఈ రీఛార్జ్ ప్లాన్ 84 రోజుల పూర్తి వ్యాలిడిటీని అందిస్తుంది. ఇంత వాలిడిటీతో ఇతర టెలికాం కంపెనీల రీఛార్జ్ ప్లాన్‌లు రూ.800 కంటే ఎక్కువే ఉన్నాయి కానీ తక్కువ ధరలో లేవు. 628 రూపాయల BSNL రీఛార్జ్‌పై అపరిమిత వాయిస్ కాలింగ్ లభిస్తుంది. ప్రతిరోజూ 100 SMSలు పంపవచ్చు. అలానే వినియోగదారులు ప్రతిరోజూ 3GB డేటాను పొందుతారు. వినియోగదారులు అనేక గేమ్స్, ఎంటర్‌టైన్మెంట్ ఆఫర్స్‌ను ఎంజాయ్ చేయొచ్చు. ఇందులో జింగ్ మ్యూజిక్, వావ్ ఎంటర్‌టైన్‌మెంట్ ఉన్నాయి.

BSNL Rs .215 Recharge Plan - బిఎస్ఎన్ఎల్ రూ. 215 రీచార్జ్ ప్లాన్

BSNL ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ రూ. 215 కూడా అపరిమిత వాయిస్ కాలింగ్‌ను అందిస్తోంది. అలాగే రోజుకు 100 SMS, ప్రతిరోజూ 2GB డేటా ఇస్తున్నారు. ఈ ప్లాన్ వాలిడిటీ 30 రోజులు. దీనిని ప్రైవేట్ టెలికాం కంపెనీల రీఛార్జ్‌తో పోల్చినట్లయితే, 30 రోజుల వ్యాలిడిటీ, రోజుకు 2 GB డేటాతో అటువంటి చౌకైన ప్లాన్ అందుబాటులో లేదు. ఈ ప్లాన్ జింగ్ మ్యూజిక్, వావ్ ఎంటర్‌టైన్‌మెంట్ వంటి అనేక గేమ్స్, ఎంటర్‌టైన్‌మెంట్‌లకు కూడా యాక్సెస్‌ను అందిస్తుంది.

ఇక BSNL కు సంబంధించిన ఇతర వార్తల విషయానికొస్తే... సంస్థలో కార్మికులను తొలగించాలనే ప్రణాళికకు వారి నుండే ఎదురుదెబ్బ తగిలింది. ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని BSNL ఉద్యోగుల సంఘం కంపెనీ డైరెక్టర్ల బోర్డును డిమాండ్ చేసింది. BSNL స్వచ్ఛంద పదవీ విరమణ పథకం (VRS) కింద సుమారు 19,000 మంది కార్మికులను తొలగించాలని ప్రతిపాదించిన విషయం తెలిసిందే.

Show Full Article
Print Article
Next Story
More Stories