BSNL Plan: జియో, ఎయిర్‌టెల్‌లకు బిగ్ షాక్.. 60 రోజుల వ్యాలిడిటీతో వచ్చేసిన బీఎస్‌ఎన్‌ఎల్ ప్లాన్.. ధరెంతంటే?

BSNL Launched Daily 1 GB Data RS 345 Prepaid Plan With 60 Days Validity
x

BSNL Plan: జియో, ఎయిర్‌టెల్‌లకు బిగ్ షాక్.. 60 రోజుల వ్యాలిడిటీతో వచ్చేసిన బీఎస్‌ఎన్‌ఎల్ ప్లాన్.. ధరెంతంటే?

Highlights

BSNL Prepaid Plan: బీఎస్‌ఎన్‌ఎల్ రీఎంట్రీతో Reliance Jio, Airtel, Vi టెన్షన్‌లో ఉన్నాయి. బీఎస్‌ఎన్‌ఎల్ చందాదారులు నిరంతరం పెరుగుతూనే ఉన్నారు.

BSNL Prepaid Plan: బీఎస్‌ఎన్‌ఎల్ రీఎంట్రీతో Reliance Jio, Airtel, Vi టెన్షన్‌లో ఉన్నాయి. బీఎస్‌ఎన్‌ఎల్ చందాదారులు నిరంతరం పెరుగుతూనే ఉన్నారు. గత కొన్ని సంవత్సరాలుగా కొత్త యూజర్లను చేర్చుకుంటూ వస్తోన్న జియో ఈసారి మాత్రం తన కస్టమర్లను భారీగా కోల్పోవాల్సి వచ్చింది. ఈ క్రమంతో ప్రభుత్వ కంపెనీ బీఎస్‌ఎన్‌ఎల్ మరో ప్లాన్‌ను తీసుకొచ్చింది. దీని ధర రూ. 345లే కావడం గమనార్హం. ఈ ప్లాన్‌లో డేటాను పొందుతారు. ఇది 60 రోజుల పాటు కొనసాగుతుంది. ఇతర టెలికాం కంపెనీల ప్లాన్‌లను పరిశీలిస్తే, ఈ ప్లాన్ ఎంతో చౌకగా ఉంటుంది. కానీ, BSNL ప్రస్తుతం 4G నెట్‌వర్క్‌ను అందించడం లేదని గుర్తుంచుకోవాలి. BSNL త్వరలో 4G నెట్‌వర్క్‌ని తీసుకురావడానికి ప్రయత్నిస్తోంది. ఈ రూ. 345 ప్లాన్ గురించి వివరంగా తెలుసుకుందాం..

BSNL రూ. 345 ప్రీపెయిడ్ ప్లాన్..

BSNL రూ.345 ప్లాన్ 60 రోజుల పాటు ప్రతిరోజూ 1GB డేటా, అపరిమిత కాలింగ్, 100 SMSలను పొందుతారు. ఒక రోజులో 1GB కంటే ఎక్కువ డేటాను ఉపయోగిస్తే డేటా స్పీడ్ తగ్గుతుంది.

Jio, Airtel లేదా Vi లకు ఇలాంటి ప్లాన్ ఏదీ లేదు..

BSNL ఈ ప్లాన్ ఇతర కంపెనీల ప్లాన్‌ల కంటే భిన్నంగా ఉంటుంది. ఎందుకంటే ఇతర కంపెనీల్లో 60 రోజుల వ్యాలిడిటీ ప్లాన్స్ ఏవీ లేవు. రోజుకు 1GB డేటాతోపాటు 60 రోజుల పాటు వ్యాలిడిటీ ఉండే ప్లాన్ కావాలనుకుంటే, రిలయన్స్ జియో, భారతీ ఎయిర్‌టెల్, వోడాఫోన్ ఐడియాలో లభించదు. కాగా బీఎస్‌ఎన్‌ఎల్ ఈ ప్లాన్ రోజువారీ ధర రూ. 5.75 మాత్రమే.

BSNL ప్రస్తుతం చౌకైన ప్లాన్‌లకు పెట్టింది పేరుగా మారింది. కానీ, బీఎస్‌ఎన్‌ఎల్ 4G సేవలు మాత్రం భారతదేశం అంతటా చేరుకోలేదు. 2025 నాటికి 4G నెట్‌వర్క్ భారతదేశం అంతటా విస్తరిస్తుందని ప్రభుత్వం తెలిపింది. 4G నెట్‌వర్క్‌లో Jio, Airtel, Vi బలంగా ఉన్న సంగతి తెలిసిందే.

Show Full Article
Print Article
Next Story
More Stories