BSNL New Cheapest Recharge Plan: అయ్యగారే నంబర్ వన్.. BSNL కొత్త ప్లాన్.. రూ. 107కే 35 రోజుల వాలిడిటీ..!

BSNL New Cheapest Recharge Plan
x

BSNL New Cheapest Recharge Plan

Highlights

BSNL New Cheapest Recharge Plan: BSNL తన కొత్త చీపెస్ట్ రీఛార్జ్ ప్లాన్ రూ.107ని తీసుకొచ్చింది. దీని వాలిడిటీ 35 రోజులు.

BSNL New Cheapest Recharge Plan: BSNL ప్రజలకు చౌకైన రీఛార్జ్ ప్లాన్‌లను అందించడంలో మొదటి స్థానంలో ఉంది. దేశ వ్యాప్తంగా 9 కోట్ల మంది బీఎస్ఎన్‌ఎల్ సిమ్‌ను ఉపయోగిస్తున్నారు. BSNL నిరంతరం తక్కువ ధరకే రీఛార్జ్ ప్లాన్‌లను అందిస్తూ వినియోగదారును రికార్డ్ స్థాయిలో పెంచుకుంటుంది. ప్రైవేట్ టెలికాం కంపెనీలైన జియో, విఐ, ఎయిర్‌టెల్ కంపెనీలకు చెమటలు పట్టిస్తుంది. ఇటీవలే BSNL 5G నెట్వర్క్ టెస్టింగ్ కూడా నిర్వహించింది. అయితే ఇప్పుడు తాజాగా బడ్జెట్ ప్రైస్‌లో మరో కొత్త రీఛార్జ్ ప్లాన్‌ను తీసుకొచ్చింది.

BSNL తన పోర్ట్‌ఫోలియోకు అనేక రకాల చౌకైన, ఖరీదైన రీఛార్జ్ ప్లాన్‌లను యాడ్ చేసింది. ఈ ప్లాన్లు అన్ని రకాలు యూజర్ల అవసరాలకు సరిపోయే విధంగా ఉంటాయి. BSNL కొత్త ప్లాన్‌‌లలో కస్టమర్ల కోసం రూ. 107 గొప్ప ప్లాన్ కూడా ఉంది. తక్కువ బడ్జెట్ ధరతో వస్తున్న ఈ ప్లాన్ కస్టమర్లకు గొప్ప ఆఫర్లను అందిస్తుంది. ఈ రీఛార్జ్ ప్లాన్ గురించి వివరంగా తెలుసుకుందాం.

BSNLఈ రూ. 107 ప్లాన్ అంత ఇంటర్నెట్ డేటా అవసరం లేని వినియోగదారులకు అత్యంత ప్రయోజనకరంగా ఉంటుంది. బీఎస్ఎన్‌ఎల్ నుంచి ఇది చౌకైన రీఛార్జ్ ప్లాన్‌లలో ఒకటి. దాని ప్రయోజనాల గురించి మాట్లాడితే మొదటగా ఎక్కువకాలం వాలిడితో వస్తుంది. చాలా కంపెనీలు తమ తక్కువ ధర ప్లాన్‌లలో 20 రోజులు, 24 రోజులు లేదా 28 రోజుల వాలిడిటీ అందిస్తే, BSNLతన వినియోగదారులకు రూ. 107కి 35 రోజుల వాలిడిటీ ఇస్తోంది.

BSNLఈ రీఛార్జ్ ప్లాన్‌లో కంపెనీ మీకు ఉచిత కాలింగ్‌కు బదులుగా నిమిషాలను కాల్ చేసే అవకాశాన్ని అందిస్తుంది. ఇందులో వినియోగదారులు 35 రోజుల పాటు 200 కాలింగ్ నిమిషాలను పొందుతారు. మీరు ఏ నెట్‌వర్క్‌లోనైనా కాల్ చేయడానికి ఈ కాలింగ్ నిమిషాలను ఉపయోగించవచ్చు. ఈ చౌకైన రీఛార్జ్ ప్లాన్ ఎక్కువ డేటా అవసరమయ్యే వారికి ఉపయోగంగా ఉండదు. ఈ ప్లాన్‌లో కంపెనీ వినియోగదారులకు 3GB డేటాను మాత్రమే ఇస్తుంది. అంటే మీరు ఈ డేటాను 35 రోజుల పాటు వినియోగించుకోవచ్చు.

BSNL తన కస్టమర్ల కోసం 108 రూపాయల ప్లాన్‌ని కూడా ఆఫర్ చేస్తోంది. మీకు మరింత ఇంటర్నెట్ డేటా అవసరమైతే మీరు ఈ ప్లాన్‌కు వెళ్లవచ్చు. ఇందులో మీకు 28 రోజులు మాత్రమే వాలిడిటీ లభిస్తుంది. ఇది మాత్రమే కాదు, ఈ ప్లాన్‌లో మీరు డైలీ 1 జీబీ డేటా పొందుతారు. మీకు అన్ని నెట్‌వర్క్‌లలో 28 రోజుల పాటు ఉచిత కాలింగ్ అందుబాటులో ఉంటుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories