BSNL Recharge Plans Under 250: వామ్మో వామ్మె అదిరిపోయే రీఛార్జ్ ప్లాన్లు.. ఇంత తక్కువ ధరకే అన్‌లిమిటెడ్ కాలింగ్, డేటా..!

BSNL Recharge Plans Under 250
x

BSNL Recharge Plans Under 250

Highlights

BSNL Recharge Plans Under 250: BSNL 250 రూపాయల్లోపు మూడు రీఛార్జ్ ప్లాన్లు తీసుకొచ్చింది. అన్‌లిమిటెడ్ కాలింగ్, డేటా వస్తుంది.

BSNL Recharge Plans Under 250: ప్రభుత్వ టెలికాం దిగ్గజం బీఎస్‌ఎన్‌ఎల్ పూర్వవైభదం దిశగా అడుగులు వేస్తుంది. ప్రైవేట్ కంపెనీ హోరులో తన సత్తా చాటేందుకు సిద్ధమైంది. BSNL వినియోగదారుల అవసరాలకు తగ్గట్టుగా అప్‌డేట్ అవుతుంది. మరీ ముఖ్యంగా బడ్జెట్ ధరలోనే రీఛార్జ్ ప్లాన్‌లను తీసుకొస్తూ కొత్త సబ్‌స్క్రైబర్లను పెంచుకుంటుంది. ఈ నేపథ్యంలోమీ స్మార్ట్‌ఫోన్‌లో BSNLసిమ్‌ని ఉపయోగిస్తుంటే మీకు అన్‌లిమిటెడ్ కాలింగ్, ఎస్ఎమ్‌ఎస్‌లను అందించే ప్లాన్లు ఉన్నాయి. ఇవి జేబులకు భారంగా అనిపించవు. మీరు రూ రూ. 250 కంటే తక్కువ ధరకు అద్భుతమైన ప్లాన్‌లను ఎంజాయ్ చేయొచ్చు. వీటి గురించి వివరంగా తెలుసుకుందాం.

BSNL Rs 147Recharge Plan
మీరు హార్డ్‌కోర్ డేటా యూజర్ కానట్లయితే. మీకు 10GB డేటా సరిపోతుంది. అప్పుడు మీరు ఈ ప్లాన్‌ని ఎంచుకోవచ్చు. ఇందులో, 10 GB డేటాతో పాటు మీకు అన్‌లిమిటెడ్ కాలింగ్, ఉచిత PRBT అంటే వ్యక్తిగత రింగ్ బ్యాక్ టోన్ ఫీచర్ కూడా పొందుతారు. ఈ ప్లాన్ 30 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది.

BSNL Rs. 187 Recharge Plan
మీరు ఈ ప్లాన్‌ని ఎంచుకుంటే రోజుకు 2GB డేటాతో పాటు అన్‌లిమిటెడ్ కాలింగ్, 100 SMSలను పొందుతారు. ఈ ప్లాన్ 28 రోజులు వాలిడిటీతో వస్తుంది. చూస్తే, ఇప్పటి వరకు రూ. 200 కంటే తక్కువ ధరకు ఇదే అత్యుత్తమ ప్లాన్. మీరు Jio, Vi, Airtelలో కూడా అటువంటి ప్రయోజనాలను పొందలేరు.

BSNL Rs. 247 Recharge Plan
ఎక్కువ డేటా కావాలనుకునే యూజర్లు కేవలం రూ.247 చెల్లించి 30 రోజుల పాటు అన్‌లిమిటెడ్ కాల్స్‌తో పాటు 50 జీబీ డేటాను పొందవచ్చు. ఈ ప్లాన్ రోజువారీ డేటా అన్‌లిమిటెడ్ డేటా నుండి మీకు కొంత ఉపశమనం కలిగిస్తుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories