BSNL 5G: బీఎస్ఎన్ఎల్ 5G వస్తుంది.. ఫస్ట్ సర్వీసెస్ ఇక్కడే స్టార్ట్

BSNL 5G: బీఎస్ఎన్ఎల్ 5G వస్తుంది.. ఫస్ట్ సర్వీసెస్ ఇక్కడే స్టార్ట్
x
Highlights

BSNL 5G: ప్రభుత్వ టెలికాం కంపెనీ బీఎస్ఎన్ఎల్ (BSNL) 5G నెట్‌వర్క్ తయారీకి సంబంధించి ముఖ్యమైన చర్యలు చేపట్టింది.

BSNL 5G: ప్రభుత్వ టెలికాం కంపెనీ బీఎస్ఎన్ఎల్ (BSNL) 5G నెట్‌వర్క్ తయారీకి సంబంధించి ముఖ్యమైన చర్యలు చేపట్టింది. త్వరలో 5G టవర్ల ఇన్‌స్టాలేషన్‌ను ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తోంది. కోట్లాది మంది వినియోగదారులకు వేగవంతమైన ఇంటర్నెట్ కనెక్టివిటీని తీసుకువస్తామని కంపెనీ తెలిపింది. ఇది హై-స్పీడ్ డేటా అవసరాలను తీరుస్తుంది.

5G టవర్ల ఏర్పాటు కోసం BSNL 1876 సైట్‌లను ఎంపిక చేసింది. ఈ పనులకు సంబంధించి టెండర్ల ప్రక్రియ కూడా ప్రారంభమైందని, ఇందులో నవంబర్ 22 వరకు బిడ్లు దాఖలు చేయవచ్చని తెలిపారు. టెండర్‌లో పాల్గొనాలనుకునే కంపెనీలు రూ.50 లక్షలు డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. నివేదికల ప్రకారం BSNL 5G సేవ మకర సంక్రాంతి నాటికి ప్రారంభమవుతుంది. ఇది వినియోగదారులకు వేగవంతమైన, స్థిరమైన ఇంటర్నెట్ సేవలను అందిస్తుంది.

BSNL తన 5G సేవలను మొదట ఢిల్లీలో ప్రారంభించనుంది. రెండు రకాల 5G సర్వీస్ ప్రొవైడర్లు ఉంటారు. ప్రైమరీ 5G-a-a-service providers,సెకండరీ 5GaaSP. ప్రారంభ దశలో రాజధానిలోని మింటో రోడ్, చాణక్యపురి, కన్నాట్ ప్లేస్‌లలో 5G సేవలను ప్రారంభించాలని BSNL యోచిస్తోంది.

BSNL 5G కోర్ నెట్‌వర్క్ మొదటి దశలో 1 లక్ష మంది వినియోగదారులకు మద్దతు ఇస్తుంది. BSNL 5G కింద మొబైల్ బ్రాడ్‌బ్యాండ్, వాయిస్ కాలింగ్, వీడియో కాలింగ్, డేటా, తక్కువ లేటెన్సీ కమ్యూనికేషన్ వంటి సేవలు అందింస్తాయి. BSNL తమ 5G సేవ ఎటువంటి లాగ్ లేకుండా వినియోగదారులకు హై క్వాలిటీ వీడియో, ఆడియో సౌకర్యాలను అందిస్తుందని పేర్కొంది.

4G సేవను విస్తరించడానికి, 5Gకి అప్‌గ్రేడ్ చేయడానికి BSNL టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS), ITI లిమిటెడ్‌తో 19,000 కోట్ల రూపాయల భాగస్వామ్యాన్ని కుదుర్చుకుంది. దీని కింద BSNL 4G టవర్లు భవిష్యత్తులో 5Gకి అప్‌గ్రేడ్ అయ్యే విధంగా రూపొందించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories