iPhone 13: ఐఫోన్‌13పై రూ. 15 వేలకుపైగా డిస్కౌంట్‌.. ఎక్స్ఛేంజ్‌తో మరింత తగ్గింపు..!

Big Discount on Apple iPhone 13 in Amazon, Check Here for Features and Price Details
x

iPhone 13: ఐఫోన్‌13పై రూ. 15 వేలకుపైగా డిస్కౌంట్‌.. ఎక్స్ఛేంజ్‌తో మరింత తగ్గింపు..!

Highlights

iPhone 13: యాపిల్ బ్రాండ్‌కు ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రేజ్‌ ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ బ్రాండ్ నుంచి ఏదైనా కొత్త ప్రొడక్ట్‌ వస్తుందంటే చాలు ఎక్కడలేని క్రేజ్‌ ఉంటుంది.

iPhone 13: యాపిల్ బ్రాండ్‌కు ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రేజ్‌ ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ బ్రాండ్ నుంచి ఏదైనా కొత్త ప్రొడక్ట్‌ వస్తుందంటే చాలు ఎక్కడలేని క్రేజ్‌ ఉంటుంది. ముఖ్యంగా ఐఫోన్‌కు మార్కట్లో బలే డిమాండ్‌ ఉంటుంది. ఐఫోన్‌ నుంచి కొత్త మోడల్ వస్తుందంటే ప్రపంచ టెక్‌ మార్కెట్‌ ఆతృతగా చూస్తుంది. అయితే ధర విషయంలో వెనుకంజ వేస్తుంటారు. అలాంటి వారి కోసమే అమెజాన్‌లో ప్రస్తుతం ఒక సూపర్ ఆఫర్‌ లభిస్తోంది. ఐఫోన్‌13 ఫోన్‌పై భారీ డిస్కౌంట్‌ లభిస్తోంది.

మార్కెట్లో ఐఫోన్‌16 సందడి చేస్తున్న ప్రస్తుత తరుణంలో ఐఫోన్‌ 13పై మంచి ఆఫర్‌ అందిస్తున్నారు. ఐఫోన్‌ 13 స్మార్ట్‌ఫోన్‌ అసలు ధర రూ. 59,900గా ఉండగా ప్రస్తుతం సేల్‌లో భాగంగా 24 శాతం డిస్కౌంట్‌ లభిస్తోంది. దీంతో ఈ ఫోన్‌ను రూ. 45,490కి సొంతం చేసుకోవచ్చు. అలాగే పలు బ్యాంకులకు చెందిన క్రెడిట్‌ కార్డుల సహాయంతో కొనుగోలు చేస్తే అదనంగా మరో రూ. 2000 వరకు డిస్కౌంట్‌ పొందొచ్చు. ఇలా ఈ ఫోన్‌ను రూ. 43,490కే దక్కించుకోవచ్చన్నామ. ఇక మీ పాత ఫోన్‌ను ఎక్స్ఛేంజ్‌ చేసుకోవడం ద్వారా కూడా డిస్కౌంట్‌ పొందొచ్చు. మీ ఫోన్‌ కండిషన్‌ ఆధారంగా ఏకంగా రూ. 43,150 వరకు డిస్కౌంట్‌ను పొందొచ్చు.

ఇక ఐఫోన్‌13 ఫీచర్ల విషయానికొస్తే.. ఈ స్మార్ట్‌ ఫోన్‌ 128 జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌తో అందుబాటులో ఉంది. ఈ ఫోన్‌ ఐఓఎస్‌ 14 ఆపరేటింగ్‌ సిస్టమ్‌తో పనిచేస్తుంది. అలాగే ఇందులో 6.1 ఇంచెస్‌తో కూడిన 4కే రిజల్యూషన్‌ స్క్రీన్‌ను అందించారు. సూపర్ రెటినా ఎక్స్‌డీఆర్‌ డిస్‌ప్లే ఈ ఫోన్‌ ఒసంతం. కెమెరా విషయానికొస్తే ఇందులో 12 మెగాపిక్సెల్స్‌తో కూడిన రెయిర్‌ కెమెరాను అందించారు. దీంతో స్మార్ట్‌ హెచ్‌డీఆర్‌ 4, నైట్‌ మోడ్‌, 4కే డాల్బీ విజన్‌ హెచ్‌డీఆర్‌ రికార్డ్‌ చేసుకోవచ్చు.

సెల్ఫీలు, వీడియో కాల్స్‌ కోసం ఇందులో 12 ఎంపీతో కూడిన ఫ్రంట్‌ కెమెరాను ఇచ్చారు. ఈ స్మార్ట్‌ ఫోణ్‌ ఏ15 బయోనిక్‌ చిప్‌ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. బ్యాటరీ విషయానికొస్తే ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే 19 గంటల వీడియో ప్లేబ్యాక్‌ను అందిస్తుంది. ఐఫోన్‌ 13 5జీ నెట్‌వర్క్‌కి సపోర్ట్‌ చేస్తుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories