Smartphone: రూ. 8 వేలలో కళ్లు చెదిరే ఫీచర్లు.. బెస్ట్‌ స్మార్ట్‌ ఫోన్స్‌ ఇవే..!

Best Smartphones Under 8K in Amazon Check Here for More Details
x

Smartphone: రూ. 8 వేలలో కళ్లు చెదిరే ఫీచర్లు.. బెస్ట్‌ స్మార్ట్‌ ఫోన్స్‌ ఇవే..!

Highlights

Smartphone: ప్రస్తుతం స్మార్ట్‌ఫోన్‌ వినియోం అనివార్యంగా మారింది ప్రతీ ఒక్కరూ కచ్చితంగా స్మార్ట్‌ ఫోన్‌లను ఉపయోగించే రోజులు వచ్చేశాయ్‌.

Smartphone: ప్రస్తుతం స్మార్ట్‌ఫోన్‌ వినియోం అనివార్యంగా మారింది ప్రతీ ఒక్కరూ కచ్చితంగా స్మార్ట్‌ ఫోన్‌లను ఉపయోగించే రోజులు వచ్చేశాయ్‌. ప్రతీ అవసరానికి ఒక యాప్‌ అందుబాటులోకి రావడంతో స్మార్ట్‌ ఫోన్‌ లేకపోతే పని జరిగే పరిస్థితి లేదు. అయితే కంపెనీల మధ్య నెలకొన్న పోటీ నేపథ్యంలో స్మార్ట్‌ ఫోన్ ధరలు భారీగా తగ్గుముఖం పడుతున్నాయి. ఇక ఈ కామర్స్‌ సంస్థలు భారీ ఆఫర్లను అందిస్తున్నాయి. మరి అమెజాన్‌లో ఇలా డిస్కౌంట్‌లో రూ. 8 వేలకే లభిస్తున్న కొన్ని బెస్ట్ ఫోన్‌లు, వాటి ఫీచర్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

Redmi 13C: తక్కువ ధరలో అందుబాటులో ఉన్న బెస్ట్ స్మార్ట్ ఫోన్స్‌లో ఇదీ ఒకటి. రెడ్‌మీ 13సీ స్మార్ట్ ఫోన్‌ అసలు ధర రూ. 11,999కాగా అమెజాన్‌లో 36శాతం డిస్కౌంట్‌లో భాగంగా రూ. 7699కే సొంతం చేసుకోవచ్చు. ఈ ఫోన్‌ ఫీచర్ల విషయానికొస్తే 4 జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌తో తీసుకొచ్చారు. ఆండ్రాయిడ్‌ 14 ఆపరేటింగ్ సిస్టమ్‌తో ఈ ఫోన్‌ పనిచేస్తుంది. ఈ స్మార్ట్‌ ఫోన్‌లో 6.74 ఇంచెస్‌తో కూడిన హెచ్‌డీ+ డిస్‌ప్లేను అందించారు. కార్నింగ్ గొరిల్లా గ్లాస్‌ 3 ప్రొటెక్షన్‌ను అందించారు. కెమెరా విషయానికొస్తే ఇందులో 50 మెగాపిక్సెల్స్‌తో కూడిన ట్రిపుల్ కెమెరా సెటప్‌ను అందించారు.

TECNO Spark 20C: తక్కువ ధరలో అందుబాటులో ఉన్న మరో బెస్ట్‌ స్మార్ట్‌ ఫోన్స్‌లో టెక్నో స్పార్క్‌ 20సీ ఒకటి. ఈ ఫోన్‌ అసలు ధర రూ. 10,499కాగా అమెజాన్‌లో 24 శాతం డిస్కౌంట్‌తో రూ. 7,999కే సొంతం చేసుకోవచ్చు. ఈ ఫోన్‌ ఫీచర్ల విషయానికొస్తే ఇందులో 6.56 ఇంచెస్‌తో కూడిన డాట్ ఇన్‌ డిస్‌ప్లేను అందించారు. 16 జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్‌ను ఇచ్చారు. డ్యూయల్ స్టీరియో స్పీకర్‌ను ఈ ఫోన్‌లో అందించారు. ఇక 5000 ఎమ్‌ఏహెచ్‌తో కూడిన టైప్‌ సీ ఛార్జర్‌ను అందించారు. 18 వాట్స్‌కు ఈ బ్యాటరీ సపోర్ట్ చేస్తుంది. కెమెరా విషయానికొస్తే ఈ ఫోన్‌లో 50 మెగాపిక్సెల్స్‌తో కూడిన రెయిర్‌ కెమెరాను అందించారు.

POCO C65 Matte Black: ఈ స్మార్ట్‌ ఫోన్‌ అసలు ధర రూ. 10,999కాగా ప్రస్తుతం అమెజాన్‌లో 38 శాతం డిస్కౌంట్‌తో రూ. 6,799కే సొంతం చేసుకోవచ్చు. ఈ ఫోన్‌ ఆండ్రాయిడ్‌ 13 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది. 4జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్‌ను అందించారు. ఇందులో 6.74 ఇంచెస్‌తో కూడిన డిస్‌ప్లేను అందించారు. ఇక కెమెరా విషయానికొస్తే ఇందులో 50 మెగాపిక్సెల్స్‌తో కూడిన రెయిర్‌ కెమెరాను అందించారు. 5000 ఎమ్‌ఏహెచ్‌ బ్యాటరీని ఇచ్చారు. ఈ పోన్‌ హీలియో జీ85 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది.

Redmi A3: రెడ్‌మీ ఏ3 స్మార్ట్‌ ఫోన్‌ అసలు ధర రూ. 9,999కాగా అమెజాన్‌లో 30 శాతం డిస్కౌంట్‌లో భాగంగా రూ. 6999కే సొంతం చేసుకోవచ్చు. ఈ ఫోన్‌లో 3 జీబీ ర్యామ్‌, 64 జీబీ స్టోరేజ్‌ను అందించారు. ఆండ్రాయిడ్‌ 14 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేసే ఈ ఫోన్‌లో స్నాప్‌డ్రాగన్‌ ప్రాసెసర్‌ను అందించారు. ఇక ఈ ఫోన్‌లో 6.71 ఇంచెస్‌తో కూడిన హెచ్‌డీ+ డిస్‌ప్లేను ఇచ్చారు. ఇందులో 8 ఎంపీ రెయిర్‌ కెమెరాను, 5 ఎంపీ ఫ్రంట్‌ కెమెరాను అందించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories