Best Smart Watches: రూ. 500లోపే స్మార్ట్‌ వాచ్‌లు.. ఫీచర్స్ కూడా అదుర్స్‌

Best Smart Watches: రూ. 500లోపే స్మార్ట్‌ వాచ్‌లు.. ఫీచర్స్ కూడా అదుర్స్‌
x
Highlights

Best Smart Watches under Rs 500: ప్రస్తుతం స్మార్ట్‌వాచ్‌ల వినియోగం భారీగా పెరిగింది. అయితే స్మార్ట్‌వాచ్‌లు అనగానే ఎక్కువ ధర ఉంటాయనే ఆలోచనలో ఉంటాం....

Best Smart Watches under Rs 500: ప్రస్తుతం స్మార్ట్‌వాచ్‌ల వినియోగం భారీగా పెరిగింది. అయితే స్మార్ట్‌వాచ్‌లు అనగానే ఎక్కువ ధర ఉంటాయనే ఆలోచనలో ఉంటాం. కానీ రూ. 500 లోపు ధరలో కూడా స్మార్ట్‌ వాచ్‌లు అందుబాటులో ఉన్నాయి. అమెజాన్‌లో ఉన్న అలాంటి కొన్ని బెస్ట్‌ స్మార్ట్‌ వాచ్‌లు, వాటిలో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి? లాంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

1) Bouncefit D20 Y68: ఈ ఫిట్‌నెస్‌ బ్యాండ్ స్మార్ట్‌ వాచ్‌ అసలు ధర రూ. 3000 కాగా అమెజాన్‌లో ప్రస్తుతం 84 శాతం డిస్కౌంట్‌తో రూ. 488కి లభిస్తోంది. ఫీచర్ల విషయానికొస్తే ఇందులో సింగిల్‌ టచ్‌ ఇంటర్‌‌ఫేస్‌, వాటర్‌ రెసిస్టెంట్‌, వర్క్‌అవుట్‌ మోడ్స్‌, క్విక్‌ ఛార్జ్‌ స్పోర్ట్స్‌ వంటి ఫీచర్లను అందించారు. బ్లూటూత్‌ కనెక్టివిటీకి సపోర్ట్ చేస్తుంది.

2) MI D116 Fitness Band: తక్కువ ధరలో అందుబటులో ఉన్న మరో బెస్ట్‌ స్మార్ట్ వాచ్‌ ఇది. ఈ వాచ్‌ అసలు ధర రూ. 2999కాగా 85 శాతం డిస్కౌంట్‌తో రూ. 449కి లభిస్తోంది. ఇందులో కూడా సింగిల్‌ టచ్‌ ఇంటర్‌ఫేస్‌, వాటర్‌ రెసిస్టెంట్‌, వర్కవుట్‌ మోడ్స్‌ వంటి ఫీచర్లను అందించారు. ఇందులో కాలింగ్ పీచర్‌ లేదు.

3) mi New Smart: ఈ స్మార్ట్‌వాచ్‌ అసలు ధర రూ. 1199 కాగా అమెజాన్‌లో 63 శాతం డిస్కౌంట్‌తో రూ. 449కి లభిస్తోంది. ఈ వాచ్‌ను చిన్నారులను దృష్టిలో పెట్టుకొని డిజైన్‌ చేశారు. ఫీచర్ల విషయానికొస్తే ఈ వాచ్‌ ఐఓఎస్‌, ఆండ్రాయిడ్ డివైజ్‌లకు కనెక్ట్ చేసుకోవచ్చు. వాటర్‌ రెసట్ఇంగ్, సింగిల్‌ టచ్‌ ఇంటర్‌ఫేస్‌ వంటి ఫీచర్లను అందించారు.

4) MI D18 Round: రౌండ్‌ డయల్‌లో వచ్చిన ఈ వాచ్‌ అసలు ధర రూ. 2999కాగా అమెజాన్‌లో 84 శాతం డిస్కౌంట్‌తో రూ. 488కే లభిస్తోంది. ఈ వాచ్‌లో అన్ని రకాల వర్కవుట్‌ మోడ్స్‌ అందించారు. అలాగే బ్లూడ్‌ ప్రెజర్‌ మానిటర్‌, యాక్టివిటీ ట్రాకర్‌ డెయిలీ వర్కవుట్ మెమోరీ, కేలరీ ట్రాకర్‌ వంటి ఫీచర్లను అందించారు.

5) MI D18 Round: ఈ వాచ్‌లో కూడా రౌండ్ డయల్‌ను అందించారు. ధర విషయానికొస్తే ఈ వాచ్‌ అసలు ధర రూ. 2999కాగా 84 శాతం డిస్కౌంట్‌తో రూ. 488కి లభిస్తోంది. ఫీచర్ల విషయానికొస్తే ఇందులో కూడా బ్లూడ్‌ ప్రెజర్‌ మానిటర్‌, యాక్టివిటీ ట్రాకర్‌ డెయిలీ వర్కవుట్ మెమోరీ, కేలరీ ట్రాకర్‌ వంటి ఫీచర్లను ఇచ్చారు.

Show Full Article
Print Article
Next Story
More Stories