Best Recharge Plans: ఏడాదికి ఒకేసారి రీఛార్జ్‌ చేసుకోవాలనుకుంటున్నారా.? ఇవే బెస్ట్ ఆప్షన్స్‌..!

Best Recharge Plans With one Year Validity in Jio, Vi, And BSNL, Check Here for Full Details
x

Best Recharge Plans: ఏడాదికి ఒకేసారి రీఛార్జ్‌ చేసుకోవాలనుకుంటున్నారా.? ఇవే బెస్ట్ ఆప్షన్స్‌..!

Highlights

Best Recharge Plans: ప్రస్తుతం ఫోన్‌ లేనిది రోజు గడవని పరిస్థితి ఉంది. దీంతో కచ్చితంగా రీఛార్జ్ ప్లాన్ చేసుకోవాల్సిందే.

Best Recharge Plans: ప్రస్తుతం ఫోన్‌ లేనిది రోజు గడవని పరిస్థితి ఉంది. దీంతో కచ్చితంగా రీఛార్జ్ ప్లాన్ చేసుకోవాల్సిందే. ప్రతీ నెల మర్చిపోకుండా రీఛార్జ్ చేసుకోవాల్సిందే. అయితే ప్రస్తుతం ఉన్న ప్లాన్స్ తో నెల నెల రీఛార్జ్ చేసుకుంటే ఎడాదంతా అమౌంట్ ఎక్కువయ్యే అవకాశం ఉంటుంది. అలాంటి వారి కోసమే టెలికం కంపెనీలు ఇయర్లీ ప్యాక్ లు అందుబాటులోకి తీసుకొచ్చాయి. ప్రస్తుతం అందుబాటులో ఉన్న కొన్ని బెస్ట్ రీఛార్జ్ ప్లాన్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

జియో రీఛార్జ్ ప్లాన్..

జియో 336, 365 రోజుల వ్యాలిడిటీతో కూడిన రెండు ప్లాన్స్ ను అందిస్తోంది. 336 రోజుల వ్యాలిడిటీ కోసం రూ. 895 రీచార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ప్లాన్‌తో మొత్తం 24 GB హై స్పీడ్ డేటా లభిస్తుంది. అలాగే అన్ లిమిటెడ్ కాలింగ్, ప్రతీ 28 రోజులకు 50 SMSలు, Jio TV, Jio సినిమాతో పాటు Jio క్లౌడ్‌కి ఉచిత యాక్సెస్‌ పొందుతారు. ఇక 365 రోజుల ప్లాన్ విషయానికొస్తే.. రూ. 3,599గా ఉంది. ఈ ప్లాన్ తో రీఛార్జ్ చేసుకుంటే ప్రతిరోజూ 2.5GB డేటా, అన్ లిమిటెడ్ కాలింగ్, 100 SMS లను పొందొచ్చు.

ఎయిర్ టెల్, వీఐ..

ఎయిర్‌టెల్, వోడాఫోన్ రెండూ 365 రోజుల చెల్లుబాటుతో ప్లాన్‌లను అందిస్తున్నాయి. రూ. 1999 ప్లాన్ తో ప్రతిరోజూ 24 GB హై స్పీడ్ డేటా, అపరిమిత కాలింగ్, 100 SMSల ప్రయోజనాన్ని పొందొచ్చు.

BSNL ఏడాది ప్లాన్..

ప్రముఖ ప్రభుత్వ రంగ సంస్థ అయిన బీఎస్ఎన్ఎల్ కూడా ఏడాది వ్యాలిడిటీతో కూడిన ప్లాన్ ను అందిస్తోంది. రూ.2,999కి ప్లాన్ తో రీఛార్జ్ చేసుకుంటే.. 4జీ నెట్ వర్క్ హై స్పీడ్ ఇంటర్నెట్ అందిస్తుంది. ప్రతిరోజూ 3GB డేటా పొందొచ్చు. ఉంటుంది. అలాగే 100 SMS లతో పాటు అన్ లిమిటెడ్ కాలింగ్ పొందొచ్చు.

Show Full Article
Print Article
Next Story
More Stories