BSNL Recharge Plan: బీఎస్ఎన్‌ఎల్ కళ్లు చెదిరే ఆఫర్.. తక్కువ ధరకే 200 రోజుల వ్యాలిడిటీ!

BSNL Recharge Plan
x

BSNL Recharge Plan: బీఎస్ఎన్‌ఎల్ కళ్లు చెదిరే ఆఫర్.. తక్కువ ధరకే 200 రోజుల వ్యాలిడిటీ!

Highlights

BSNL Recharge Plan: భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) కొత్త రీఛార్జ్ ప్లాన్ ధర రూ.999. ఈ ప్లాన్ సుదీర్ఘ వ్యాలిడిటీని కలిగి ఉంది.

BSNL Recharge Plan: ఇటీవల కాలంలో భారతీ ఎయిర్‌టెల్‌, రిలయన్స్‌ జియో, వొడాఫోన్‌ ఐడియా వంటి ప్రైవేట్‌ కంనీలు టారీఫ్ ప్లాన్లను భారీగా పెంచిన విషయం తెలిసిందే. ఒక్కో రీఛార్జ్ ప్లాన్‌పై 20 నుంచి 30 పెరిగింది. ప్రభుత్వరంగ నెట్‌వర్క్‌ సంస్థ భారత్‌ సంచార్‌ నిగమ్‌ లిమిటెడ్‌ (బీఎస్‌ఎన్‌ఎల్‌) మాత్రం టారీఫ్ ప్లాన్‌లను పెంచలేదు. సమీప భవిష్యత్తులో టారిఫ్‌లు పెంచే ప్రణాళిక లేదని కూడా బీఎస్ఎన్‌ఎల్ తెలిపింది. దాంతో ఎయిర్‌టెల్‌, జియో యూజర్లు బీఎస్ఎన్‌ఎల్‌కు షిఫ్ట్ అవుతున్నారు. యూజర్లను ఆకట్టుకునేందుకు ప్రభుత్వరంగ నెట్‌వర్క్‌ సంస్థ ఎప్పటికప్పడు కొత్త రీఛార్జ్ ప్లాన్‌లను తీసుకొస్తుంది. ఈ క్రమంలోనే కళ్లు చెదిరే ఆఫర్ ప్రకటించింది.

బీఎస్‌ఎన్‌ఎల్‌ కొత్త రీఛార్జ్ ప్లాన్ ధర రూ.999. ఈ ప్లాన్ సుదీర్ఘ వ్యాలిడిటీని కలిగి ఉంది. ఇది 200 రోజులతో వస్తోంది. దేశంలోని ఏ నెట్‌వర్క్‌కు అయినా అపరిమిత వాయిస్ కాలింగ్ చేసుకోవచ్చు. అయితే ఈ ప్లాన్‌లో ఎసెమ్మెస్‌, ఉచిత డేటా మాత్రం రాదు. అపరిమిత కాల్స్ వాడే వారికి ఈ ప్లాన్ బాగా ఉపయోగపడుతుంది. లేదా సెకండ్ సిమ్ వాడే వారికీ ఉపయోగకరంగా ఉంటుంది. ఇలాంటి ప్లాన్ మరే నెట్‌వర్క్‌ సంస్థల్లో లేదు.

అపరిమిత కాలింగ్, డైలీ డేటా కావాలనుకునే వారికి బీఎస్‌ఎన్‌ఎల్‌ మరో రీఛార్జ్ ప్లాన్‌ను అందిస్తోంది. రూ.997 ప్లాన్‌ వ్యాలిడిటీ 160 రోజులు. ఏ నెట్‌వర్క్‌కు అయినా అపరిమిత కాలింగ్ చేసుకోవచ్చు. ఈ ప్లాన్ ప్రతిరోజూ 100 ఉచిత ఎసెమ్మెస్‌లు అందిస్తుంది. ప్రతిరోజూ 2జీబీ హై-స్పీడ్ డేటాను వాడుకోవచ్చు. కాలింగ్ మరియు డేటా సేవలు అవసరమయ్యే స్మార్ట్‌ఫోన్ వినియోగదారులకు ఇది ఉత్తమమైన ఎంపిక అని చెప్పాలి. 90 రోజుల వ్యాలిడిటీకే ఎయిర్‌టెల్‌లో దాదాపుగా వెయ్యి ఉన్న విషయం తెలిసిందే.

బీఎస్‌ఎన్‌ఎల్‌ కంపెనీ ప్రస్తుతం 2జీ, 3జీ, 4జీ, 5జీ సేవలను అందిస్తోంది. 2025లో 5జీ సేవలను దేశవ్యాప్తంగా విస్తరించనుంది. వేగవంతమైన 5జీ సేవలను అందించేందుకు సిద్ధమవుతున్న బీఎస్‌ఎన్‌ఎల్‌.. ఇటీవల కంపెనీ లోగోను మార్చింది. గతంలో వృత్తాకారంలోని ఊదా రంగు లోగోపై నీలం, ఎరుపు వర్ణంలో ఇంటర్నెట్‌ కనెక్టివిటీ సింబల్స్‌ ఉండేవి. కాషాయ రంగు వృత్తాకారం మధ్యలో భారత చిత్రపటాన్ని ఉంచి.. దానిపై తెలుపు, ఆకుపచ్చ వర్ణంలో కనెక్టివిటీ సింబల్స్‌ను ఉంచారు.

Show Full Article
Print Article
Next Story
More Stories