5G Smartphones Under 12K: రూ.12 వేలల్లో దుమ్ములేపే మొబైల్స్.. ఇవి కొంటే చాలా బెస్ట్..!

5G Smartphones Under 12K
x

5G Smartphones Under 12K

Highlights

5G Smartphones Under 12K: 12 వేల రూపాయల లోపు లభించే మంచి 5G స్మార్ట్‌ఫోన్లు. ఫీచర్లు, ధరలు తెలుసుకోండి.

5G Smartphones Under 12K: రోజులు గడిచే కొద్ది దేశంలో 5జీ సేవలు విస్తరిస్తున్నాయి. టెలికాం కంపెనీలు చిన్నచిన్న నగరాల్లో కూడా 5జీ నెట్వర్క్‌ను అందుబాటులోకి తీసుకొచ్చాయి. దీంతో స్మార్ట్‌ఫోన్ కంపెనీలు పోటీపడి 5జీకి సపోర్ట్ చేసే ఫోన్లను తీసుకొస్తున్నాయి. పోటీ పెరగడంతో ఫోన్లను తక్కువ ధరకే అందిస్తున్నాయి. తక్కువ బడ్జెట్‌లో కొత్త 5G స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేయడానికి వెళితే మీకు మార్కెట్లో అనేక ఆప్షన్లు ఉన్నాయి. ఈ నేపథ్యంలో 12 వేల రూపాయల లోపు లభించే మంచి 5G స్మార్ట్‌ఫోన్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

Moto G45 5G
మోటో G45 5G ఫోన్ మొదటి సేల్ ఫ్లిప్‌కార్ట్‌లో ఆగస్టు 28 మధ్యాహ్నం 12 గంటలకు లైవ్ కానుంది. కంపెనీ వేగన్ లెదర్ ఫినిషింగ్, విభిన్న కలర్ ఫుల్ ఆప్షన్స్ వివా మెజెంటా బ్రిలియంట్ బ్లూ బ్రిలియంట్ గ్రీన్‌తో ఫోన్‌ను తీసుకువస్తోంది. ఈ మోటరోలా ఫోన్ ఆగస్టు 21న దేశంలో విడుదలైంది. ఈ ఫోన్‌ని రెండు వేరియంట్లలో కొనుగోలు చేయవచ్చు. ఫోన్‌ను ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులో ఉంటుంది.

Realme C63 5G
కంపెనీ Realme ఫోన్ Realme C63 5Gని ప్రీమియం లుక్‌తో అందజేస్తుంది. స్టార్రీ గోల్డ్, ఫారెస్ట్ గ్రీన్ అనే రెండు కలర్ ఆప్షన్‌లలో ఫోన్ కొనుగోలు చేయవచ్చు. ఫోన్ ప్రారంభ ధర తగ్గింపుతో రూ.9999. Realme ఈ ఫోన్ ఆగస్టు 12 న సేల్‌కి తీసుకొచ్చింది. మీరు ఈ ఫోన్‌ని కంపెనీ అధికారిక వెబ్‌సైట్, Flipkart నుండి కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్‌ను మూడు వేరియంట్లలో లభిస్తుంది.

itel color Pro 5G
ఐటెల్ దేశంలో కొత్త బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేయడం ద్వారా తన పోర్ట్‌ఫోలియోను విస్తరించింది. ఈ 5G ఫోన్ సరసమైన ధర పరిధిలో అనేక గొప్ప ఫీచర్లను అందిస్తుంది. ఇందులో అప్‌గ్రేడ్ చేసిన ర్యామ్ ఆప్షన్ ఇవ్వబడింది. ఫోన్ ధర రూ.10,000 కంటే తక్కువ. itel కలర్ ప్రో 5G జూలై 17న లావెండర్ ఫాంటసీ, రివర్ బ్లూ అనే రెండు కలర్ ఆప్షన్లలో లాంచ్ అయింది. ఈ ఫోన్‌ను అమెజాన్ నుంచి కొనుగోలు చేయవచ్చు.

Show Full Article
Print Article
Next Story
More Stories