5G Phone: తక్కువ ధరలో 5జీ ఫోన్‌ కోసం చూస్తున్నారా.? అయితే దీనిపై ఓ లుక్కేయాల్సిందే..!

Best 5G smartphone under 10k, Poco M6 Pro 5G smartphone Features and price details
x

5G Phone: తక్కువ ధరలో 5జీ ఫోన్‌ కోసం చూస్తున్నారా.? అయితే దీనిపై ఓ లుక్కేయాల్సిందే 

Highlights

5G Phone: తక్కువ ధరలో 5జీ ఫోన్‌ కోసం చూస్తున్నారా.? అయితే దీనిపై ఓ లుక్కేయాల్సిందే

5G Phone: ప్రస్తుతం 5జీ స్మార్ట్‌ఫోన్‌లకు డిమాండ్ పెరుగుతోంది. దేశవ్యాప్తంగా 5జీ సేవలు విస్తరిస్తున్న నేపథ్యంలో చాలా మంది 5జీ ఫోన్‌లను షిఫ్ట్‌ అవుతున్నారు. కంపెనీలు సైతం మార్కెట్లోకి 5జీ ఫోన్‌లను పెద్ద ఎత్తున తీసుకొస్తున్నాయి. అయితే మొదట్లో భారీగా ఉన్న 5జీ ఫోన్‌ల ధరలు ప్రస్తుతం తగ్గుముఖం పడుతున్నాయి. మరీ ముఖ్యంగా రూ. 10వేల బడ్జెట్‌లోనే 5జీ ఫోన్‌లు అందుబాటులోకి వస్తున్నాయి.

అయితే తక్కువ బడ్జెట్‌ అని ఫీచర్ల విషయంలో ఎలాంటి కాంప్రమైజ్‌ అవ్వట్లేదు కంపెనీలు. ఇందులో భాగంగానే చైనాకు చెందిన స్మార్ట్‌ ఫోన్‌ దిగ్గజం పోకో మార్కెట్లోకి బడ్జెట్‌ ఫోన్‌ను గతేడాది తీసుకొచ్చింది. దీనిపేరే పోకో ఎమ్‌6 ప్రో 5జీ. అత్యంత తక్కువ బడ్జెట్‌లో తీసుకొచ్చిన ఈ ఫోన్‌కు మంచి ఆదరణ లభించింది. మరి మీరు కూడా తక్కువ బడ్జెట్‌లో 5జీ ఫోన్‌ సొంతం చేసుకోవాలనుకుంటే. ఈ ఫోన్‌ బెస్ట్‌ ఆప్షన్‌గా చెప్పొచ్చు. మరి పోకో ఎమ్‌6 ప్రో 5జీలో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి.? దీని ధర ఎంతో ఇప్పుడు తెలుసుకుందాం..

పోకో ఎమ్‌6 ప్రో 5జీ ఫోన్‌ అసలు ధర రూ. 16,999గా ఉండగా అమెజాన్‌లో 41 శాతం డిస్కౌంట్‌తో రూ. 9,999కి లభిస్తోంది. దీంతో పాటు రూ. 250 కూపన్‌ కూడా డిస్కౌంట్‌ లభిస్తోంది. ఈ ఫోన్‌ను రూ. 485 ప్రారంభ ఈఎమ్‌ఐతో సొంతం చేసుకోవచ్చు. ఇక ఈ ఫోన్‌ ఫీచర్ల విషయానికొస్తే 6 జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌తో తీసుకొచ్చారు. ఆండ్రాయిడ్‌ 13 ఆపరేటింగ్‌ సిస్టమ్‌తో ఈ ఫోన్‌ పనిచేస్తుంది. తక్కువ బడ్జెట్‌లో స్నాప్‌డ్రాగన్ 4 జెన్‌ 2 ప్రాసెసర్‌ను అందించారు.

ఇక ఈ స్మార్ట్‌ ఫోన్‌లో 6.79 ఇంచెస్‌తో కూడిన ఫుల్‌హెచ్‌డీ+ స్క్రీన్‌ను తీసుకొచ్చారు. 90 హెజ్‌జెడ్ రిఫ్రెష్‌ రేట్ ఈ స్క్రీన్ సొంతం. గొరిల్లా గ్లాస్‌ 3 లేయర్‌ స్క్రీన్‌ ప్రొటెక్షన్‌ను అందించారు. ఓటీటీ కంటెంట్‌ను హెచ్‌డ్‌ క్వాలిటీలో వీక్షించే అవకాశం కల్పించారు. ఇక కెమెరా విషయానికొస్తే 50 మెగాపిక్సెల్స్‌తో కూడిన రెయిర్ కెమెరాను అందించారు. అలాగే 8 మెగాపిక్సెల్స్‌ హోల్‌ పంచ్‌ కట్‌అవుట్‌తో కూడిన ఫ్రంట్‌ కెమెరాను అందించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories