Bajaj: పెట్రోల్ పోయాల్సిన పనిలేదు.. బ్యాటరీని ఛార్జ్ చేసే టెన్షన్ వద్దు.. కొత్త టెక్నాలజీతో బజాజ్ స్కూటర్.. విడుదల ఎప్పుడంటే?

Bajaj Auto Electric Scooter Comes With New Technology And Swappable Removable Battery Check Features And Price Details
x

Bajaj: పెట్రోల్ పోయాల్సిన పనిలేదు.. బ్యాటరీని ఛార్జ్ చేసే టెన్షన్ వద్దు.. కొత్త టెక్నాలజీతో బజాజ్ స్కూటర్.. విడుదల ఎప్పుడంటే?

Highlights

Bajaj: బజాజ్ ఆటో తన ఎలక్ట్రిక్ టూ-వీలర్ పోర్ట్‌ఫోలియోను విస్తరించాలని యోచిస్తోంది. కంపెనీ ప్రీమియం ఎలక్ట్రిక్ స్కూటర్‌పై పని చేస్తోంది. ఇది స్వాప్ చేయగల బ్యాటరీతో విడుదల కానుంది.

Bajaj: బజాజ్ ఆటో తన ఎలక్ట్రిక్ టూ-వీలర్ పోర్ట్‌ఫోలియోను విస్తరించాలని యోచిస్తోంది. కంపెనీ ప్రీమియం ఎలక్ట్రిక్ స్కూటర్‌పై పని చేస్తోంది. ఇది స్వాప్ చేయగల బ్యాటరీతో ప్రారంభించనుందని వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం, కంపెనీకి బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ మోడల్ మాత్రమే ఉంది. కొత్త స్వాప్ చేయగల బ్యాటరీ ఇ-స్కూటర్ చేతక్ ఎలక్ట్రిక్ వేరియంట్‌ కూడా అవుతుంది. మార్కెట్‌లో ఛార్జింగ్ స్టేషన్ల ఆదరణను పెంచేందుకు ఈ చర్య తీసుకోనున్నట్లు కంపెనీ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. తద్వారా వినియోగదారులు బ్యాటరీని మార్చుకోవడం ద్వారా తమ ప్రయాణాన్ని కొనసాగించవచ్చు. ఇందులో ఛార్జింగ్‌కు ఇబ్బంది ఉండదు.

7% పెరిగిన బజాజ్ ఆటో అమ్మకాలు..

బజాజ్ ఆటో అమ్మకాలు ఏప్రిల్‌లో 7% పెరిగి 331,278 యూనిట్లకు చేరుకున్నాయి. ఏప్రిల్ 2022లో కంపెనీ 310,774 వాహనాలను విక్రయించింది. ఏప్రిల్‌లో ద్విచక్ర వాహన విక్రయాలు 2% వృద్ధి చెంది 287,985 యూనిట్లకు చేరుకున్నాయని కంపెనీ తెలిపింది. దేశీయ విపణిలో, కంపెనీ ద్విచక్ర వాహనాల విక్రయాలు 95% వృద్ధితో 181,828 యూనిట్లకు చేరాయి. ఏడాది క్రితం ఇదే నెలలో 93,233 యూనిట్లు ఉన్నాయి. అయితే, కంపెనీ ద్విచక్ర వాహనాల ఎగుమతులు 44% క్షీణించి 106,157 యూనిట్లకు చేరుకున్నాయి.

బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ రేంజ్, ఫీచర్లు..

బజాజ్ చేతక్ 3 kWh లిథియం-అయాన్ బ్యాటరీని పొందుతుంది. ఇది 3.8 kW ఎలక్ట్రిక్ మోటారుతో జత చేయబడింది. ఇది గరిష్టంగా 5.5 PS శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ఇది ఏకో మోడ్‌లో గరిష్టంగా 95 కి.మీ.లు, స్పోర్ట్ మోడ్‌లో 85 కి.మీ.ల వరకు వెళ్తుంది. 5 Amp అవుట్‌లెట్ ద్వారా బ్యాటరీని 100%కి ఛార్జ్ చేయడానికి సుమారు 5 గంటలు పడుతుంది.

చేతక్‌కి రెండు చివర్లలో 12-అంగుళాల అల్లాయ్ వీల్స్ ఉన్నాయి. ఇది ముందు 90/90 టైర్, వెనుక 90/100 టైర్ (రెండూ ట్యూబ్ లెస్)లు ఇచ్చారు. ఫ్రంట్-వీల్ లీడింగ్-లింక్-టైప్ సస్పెన్షన్‌ను పొందగా, వెనుక చక్రం మోనోషాక్ సస్పెన్షన్‌ను పొందుతుంది. స్కూటర్‌కి రివర్స్ గేర్ కూడా ఉంది.

స్కూటర్‌లో LED లైట్లు (హెడ్‌ల్యాంప్, DRLలు, టర్న్ ఇండికేటర్లు, టెయిల్‌లైట్లు), ఫ్రంట్ డిస్క్ బ్రేక్, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ (బ్లూటూత్ ద్వారా స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీతో) కూడా అందించారు. కంపెనీ బ్యాటరీపై 3 సంవత్సరాలు లేదా 50,000 కిమీల వారంటీని అందిస్తోంది. దీని ఎలక్ట్రికల్స్ IP67 రేట్ అందుకుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories