Phone Tips: ఫోన్‌ను 100 శాతం ఛార్జ్ చేస్తున్నారా.. బ్యాటరీ పని ఖతమే.. ఎక్కువ కాలం బ్యాటరీ పనిచేయాలంటే ఈ టిప్స్ పాటిస్తే బెటర్..!

Are You Charging the Smartphone Battery With 100 Percent Check Full Details
x

Phone Tips: ఫోన్‌ను 100 శాతం ఛార్జ్ చేస్తున్నారా.. బ్యాటరీ పని ఖతమే.. ఎక్కువ కాలం బ్యాటరీ పనిచేయాలంటే ఈ టిప్స్ పాటిస్తే బెటర్..!

Highlights

Smartphone Battery: ప్రస్తుతం స్మార్ట్‌ఫోన్ జీవితంలో కీలకంగా మారింది.

Smartphone Battery: ప్రస్తుతం స్మార్ట్‌ఫోన్ జీవితంలో కీలకంగా మారింది. ఫొటోను క్లిక్ చేయాలన్నా లేదా ఆన్‌లైన్ సమావేశానికి హాజరు కావాలన్నా లేదా తెలిసిన వ్యక్తికి డబ్బు పంపాలన్నా.. ఇలా జీవితంలో ఫొన్ లేకుండా జరగడం లేదు. ఇటువంటి పరిస్థితిలో దాన్ని జాగ్రత్తగా చూసుకోవడం చాలా మంచిది. బ్యాటరీ కూడా ఫోన్‌లో ముఖ్యమైన భాగం. దీన్ని ఛార్జ్ చేయడానికి సరైన మార్గం చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు. ఇటువంటి పరిస్థితిలో అసులు ఫోన్ బ్యాటరినీ ఎంత ఛార్జ్ చేయాలనే విషయం తెలుసుకుందాం..

ఫోన్ అనేది పోర్టబుల్ పరికరం. ఇందులో బ్యాటరీ ఉంటుంది. ఫోన్‌ను ప్రారంభించడానికి అత్యంత ముఖ్యమైన భాగం బ్యాటరీ. ఫోన్‌లోని మిగిలిన భాగాలు మంచి స్థితిలో ఉండాలంటే బ్యాటరీ ఎంతో ముఖ్యమైనది. కానీ, బ్యాటరీ సపోర్ట్ చేయకపోతే, ఫోన్ షట్ డౌన్ అవుతుంది.

అత్యవసర సమయంలో ఫోన్‌లోని బ్యాటరీ సపోర్ట్ చేయకుంటే ఇబ్బందులు ఎదురవుతుంటాయి. ఇటువంటి పరిస్థితిలో బ్యాటరీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవడం చాలా ముఖ్యం. గమనించదగ్గ విషయం ఏమిటంటే, సరిగ్గా ఛార్జింగ్ చేయడం ద్వారా కూడా, ఫోన్ బ్యాటరీని ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. చాలా మందికి ఈ అలవాటు ఉంటుంది. ఫోన్ 100 శాతం వరకు ఛార్జింగ్ అయ్యే వరకు ఫోన్‌ను ఛార్జింగ్‌లో ఉంచుతుంటారు. కానీ, ఇది మంచిది కాదు.

ఇంతకుముందు ఉపయోగించిన బ్యాటరీల్లో యాసిడ్ వాడేవారు. ప్రస్తుతం బ్యాటరీలు లిథియం వాడుతున్నారు. కాబట్టి, పూర్తిగా ఛార్జ్ అయ్యే వరకు లిథియం అయాన్ బ్యాటరీలను ఛార్జ్ చేయాల్సిన అవసరం లేదు. ఇలా చేయడం వల్ల ఆధునిక లిథియం అయాన్ బ్యాటరీ దెబ్బతింటుంది. బ్యాటరీ పూర్తిగా అయిపోయినప్పుడు లేదా పూర్తిగా ఛార్జ్ అయినప్పుడు చాలా ఒత్తిడికి గురవుతుంటాయి. కాబట్టి, ఈ పరిస్థితులను నివారించాలి. తద్వారా లిథియం-అయాన్ బ్యాటరీల జీవితాన్ని పెంచవచ్చంట.

ఇటువంటి పరిస్థితిలో ఫోన్ ఛార్జింగ్‌ను 80 నుంచి 90 శాతం వరకు మాత్రమే ఛార్జ్ చేయాలి. అలాగే, బ్యాటరీ శాతం 20 లేదా 30కి పడిపోయిన తర్వాత దాన్ని మళ్లీ ఛార్జింగ్‌లో పెట్టాలి. ఇలా చేయడం వల్ల ఫోన్ బ్యాటరీ లైఫ్‌ను ఎక్కువ కాలం ఉంచుకోవచ్చు.

Show Full Article
Print Article
Next Story
More Stories