iPhone 16 Features Leak: ఐఫోన్ 16 ఆగయా.. మతిపోగొడుతున్న కొత్త మార్పులు.. !

iPhone 16 Features Leak
x

iPhone 16 Features Leak

Highlights

iPhone 16 Features Leak: ఆపిల్ ఐఫోన్ 16 సిరీస్‌ ఫోన్లను త్వరలో లాంచ్ చేయనుంది. దీని ఫీచర్లు, స్పెసిఫికేషన్లు లీక్ అయ్యాయి.

iPhone 16 Features Leak: ఐఫోన్ 16 సిరీస్ గురించి టెక్ ప్రపంచం చాలా ఇంటరెస్ట్‌గా ఎదురుచూస్తుంది. ఈసారి ఆపిల్ తన కొత్త మోడల్స్‌లో అనేక మార్పులు చేయనుంది. వీటి లుక్ కూడా దీని ముందు మోడల్ కంటే చాలా అట్రాక్ట్‌గా కనిపిస్తుంది. ఆపిల్ ఐఫోన్ 16 డిజైన్‌తో పాటు కెమెరా సెటప్, ప్రాసెసర్, బ్యాటరీ, ఛార్జింగ్ టెక్నాలజీలో కూడా ముఖ్యమైన అప్‌గ్రేడ్‌లు చేస్తుంది. ఇంకా కొత్త కలర్, మెరుగైన డిస్‌ప్లేతో ఈ ఫోన్ ప్రీమియం అనుభవాన్ని అందిస్తుంది. అయితే తాజాగా ఈ స్మార్ట్‌ఫోన్ ఫీచర్స్ లీక్ అయ్యాయి. వాటి గురించి వివరంగా తెలుసుకుందాం.

ఐఫోన్ 16 డిజైన్ పూర్తిగా కొత్తగా ఉంటుంది. కెమెరా సెటప్‌లో కూడా పెద్ద మార్పులు ఉంటాయి. కెమెరాలు పాత మోడళ్లతో పోలిస్తే ఈసారి పెద్దగా ఉంటాయి. ఫోన్ కార్నర్‌లో ఫ్లాష్‌తో డ్యూయల్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంటుంది. బిల్డ్ క్వాలిటీలో ఎటువంటి మార్పులు ఉండవు. ఇది అల్యూమినియం బాడీతో వస్తుంది. వాల్యూమ్, పవర్ బటన్‌ల డిజైన్ అలాగే ఉంటుంది అయితే దీనిలో కొత్త 'యాక్షన్ బటన్' చూడొచ్చు. ఇది గతంలో ప్రో సిరీస్‌లో కనిపించింది.

ఈసారి iPhone 16 అనేక కొత్త రంగులలో వస్తుంది. ఇందులో పింక్, లైట్ బ్లూ , ఎల్లో, గ్రీన్, వైట్, పర్పుల్, బ్లాక్ కలర్స్ ఉంటాయి. ఈ స్పెషల్ కలర్‌ను నాన్-ప్రో వేరియంట్‌లలో చూడవచ్చు. ఐఫోన్ 16 స్క్రీన్ సైజు, రిజల్యూషన్ అలాగే ఉంటుంది. బెజెల్‌లు స్లిమ్‌గా ఉంటాయి. డిస్‌ప్లే బ్రైట్‌నెస్ 20 శాతం పెరుగుతుంది. ఇది మునుపటి కంటే బెటర్‌గా కనిపిస్తుంది. ఐఫోన్ 16లో A18 ప్రాసెసర్ ఉపయోగిస్తున్నారు. ఇది ముందు మోడళ్లతో పోలిస్తే పవర్‌ఫుల్ ప్రాసెసర్. బ్యాటరీ కూడా అప్‌గ్రేడ్ అవుతుంది. ఇది పాత మోడళ్ల కంటే ఎక్కువ బ్యాకప్ ఇస్తుంది.

ఆపిల్ ఈసారి USB-C పోర్ట్‌తో ఫాస్ట్ ఛార్జింగ్‌ను పరిచయం చేస్తుంది. ఐఫోన్ 16 సిరీస్ 40 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్‌ను కలిగి ఉంటుంది. దీని వల్ల మునుపటి మోడల్‌ల కంటే వేగంగా ఛార్జ్ అవుతుంది. ఐఫోన్ 16 ప్రో వేరియంట్ 5x టెలిఫోటో సెన్సార్‌ను ఉపయోగిస్తుంది. ఇది మునుపటి 3x సెన్సార్‌తో పోలిస్తే బెటర్ జూమింగ్ సామర్థ్యాన్ని అందిస్తుంది. ధర గురించి ఇంకా ఎటువంటి సమాచారం అందుబాటులోకి రాలేదు. అయితే కొత్త ఫీచర్లు, అప్‌గ్రేడ్‌లతో దీని ధరలు పెరగవచ్చని టాక్ వినిపిస్తుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories