Apple: యాపిల్‌ నుంచి స్మార్ట్‌ డోర్‌ బెల్స్‌.. ఎలా పనిచేస్తుందో తెలుసా?

Apple to Launch Smart Door Bell With Face Unlocking
x

Apple: యాపిల్‌ నుంచి స్మార్ట్‌ డోర్‌ బెల్స్‌.. ఎలా పనిచేస్తుందో తెలుసా?

Highlights

Smart Doorbell: టెక్నాలజీ రోజురోజుకీ మారుతోంది. అన్ని రంగాల్లో టెక్నాలజీ సమూల మార్పులు తీసుకొస్తోంది.

Smart Doorbell: టెక్నాలజీ రోజురోజుకీ మారుతోంది. అన్ని రంగాల్లో టెక్నాలజీ సమూల మార్పులు తీసుకొస్తోంది. చివరికి డోర్‌ బెల్స్, డోర్‌ లాక్స్‌లో కూడా మార్పులు వచ్చాయి. ఈ క్రమంలోనే తాజాగా ప్రముఖ టెక్‌ దిగ్గజం యాపిల్‌ వినూత్నమైన డోర్‌ బెల్‌ను తయారు చేస్తోంది. ఫేస్‌ ఐడతో ఇంటి డోర్‌ అన్‌లాక్‌ చేసే స్మార్ట్‌ హోమ్‌ డోర్‌బెల్‌ను తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది. ఇందులో అడ్వాన్స్‌ టెక్నాలజీతో కూడిన ఫేస్‌ రికాగ్నిజన్‌ టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు.

ఈ వైర్‌లెస్‌ మిషిన్‌లో ముందుగా కొన్ని ఫేస్‌ ఐడీలను సెట్‌ చేసుకోవచ్చు. డేటా బేస్‌లో ఉన్న ఫొటోలతో మ్యాచ్‌ అయితేనే డోర్‌ ఓపెన్‌ అవుతుంది. ప్రస్తుతం స్మార్ట్ ఫోన్స్‌లో ఫేస్‌ అన్‌లాక్‌ విధానంలో ఇది పని చేస్తుందన్నమాట. ఇదిలా ఉంటే యాపిల్‌ ఇందుకోసం లాక్‌ మాన్యుఫాక్చరింగ్‌ కంపెనీతో ఒప్పందం చేసుకున్నట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది ప్రారంభంలో ఈ డోర్‌ లాక్స్‌ తయారీ ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.

యాపిల్‌ ఈ డివైజ్‌లలో తన ఇన్‌ హౌజ్‌ నెట్‌వర్కింగ్ చిప్‌ను ఉపయోగిచనున్నట్ల తెలుస్తోంది. అయితే యాపిల్‌ ఈ గ్యాడ్జెట్‌ ఇతర పేరుతో మార్కెట్లోకి తీసుకొచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఇందుకు సంబంధించి అధికారిక ప్రకటన వచ్చే అవకాశాలు ఉన్నాయి. ధర, ఇతర ఫీచర్లకు సంబంధించి త్వరలోనే యాపిల్‌ ప్రకటించనుంది. అయితే స్మార్ట్ ఫోన్‌ సహాయంతో ఇతరులకు కూడా యాక్సెస్‌ ఇచ్చే ఫీచర్ ఇందులో ఉండనున్నట్లు అభిప్రాయపడుతున్నారు.

ఇదిలా ఉంటే యాపిల్‌ తన స్మార్ట్ హోమ్ ఉత్పత్తులను వచ్చే ఏడాది విస్తరించేందుకు సన్నాహాలు చేస్తోంది. హోమ్‌ కంట్రోల్‌ పేరుతో తీసుకురానున్న ఈ గ్యాడ్జెట్‌లో ఫేస్‌టైమ్‌ కాల్స్‌ చేసుకోవచ్చు. ఇందులో 6 ఇంచెస్‌ స్క్రీన్‌ను ఇవ్వనున్నారు. ఈ గ్యాడ్జెట్‌ను ఎంచక్కా గోడకు హ్యాంగ్ చేసుకోవచ్చు. ఇది అచ్చంగా గూగుల్‌ నెస్ట్‌ హబ్‌లాగా పనిచేస్తుంది. దీంతో గూగుల్‌ టీవీ, యాపిల్‌ టీవీ, హోమ్‌ప్యాడ్ మినీ వంటి వాటిని ఆపరేట్‌ చేసుకోవచ్చు.

Show Full Article
Print Article
Next Story
More Stories