చైనాకు బాయ్ బాయ్... ఇండియాకు యాపిల్..

Apple to Choose India Over Apple Products
x

చైనాకు బాయ్ బాయ్... ఇండియాకు యాపిల్.. 

Highlights

Apple: ప్రపంచ దిగ్గజ మొబైల్ యాపిల్ చైనాకు బాయ్ బాయ్ చెప్పే ఆలోచనలో ఉన్నట్టు కన్పిస్తోంది.

Apple: ప్రపంచ దిగ్గజ మొబైల్ యాపిల్ చైనాకు బాయ్ బాయ్ చెప్పే ఆలోచనలో ఉన్నట్టు కన్పిస్తోంది. అంతే కాదు చైనా నుంచి వ్యాపారాన్ని ఇండియాకు షిప్ట్ చేసే వ్యూహాలు రచిస్తున్నట్టు తెలుస్తోంది. చైనా వ్యవహరిస్తున్న తీరు కారణంగా ఆ దేశంలో యాపిల్ తయారీని తగ్గించాలన్న నిర్ణయానికి యాపిల్ వచ్చిందని అమెరికా మీడియాలో వార్తలు హల్ చల్ చేస్తున్నాయ్. చైనా నుంచి బయటకు వచ్చి ఇండియా, వియత్నాం వైపునకు రావాలని ఆ కంపెనీ మొగ్గు చూపుతోంది. ఇండియాలో ఉత్పత్తి పెంచి స్థానికంగా ఉన్న ప్రయోజనాలు పొందాలని కంపెనీ యోచిస్తోంది. ఇప్పటికే ఇందుకు సంబంధించి పలు కంపెనీలతో యాపిల్ ప్రతినిధులు చర్చలు జరిపినట్టు తెలుస్తోంది.

యాపిల్‌ ఎగుమతుల్లో ప్రపంచంలో ఇండియా రెండో స్థానంలో ఉంది. శాంసంగ్ తర్వాత ఎక్కువ దిగుమతి అవుతోంది యాపిల్ ఫోన్లే. గత నాలుగైదేళ్లుగా చైనా దిగ్గజ కంపెనీలన్నీ ఫోన్లను ఇండియాలోనే తయారు చేస్తున్న విషయం తెలిసింది. ఇండియాకు విదేశాల నుంచి దిగుమతి అవుతున్న ఫోన్ల సంఖ్య తగ్గినా ఖరీదైన ఐఫోన్లు, శాంసంగ్ ఫోన్లు నేటికి ఇండియాకు గణనీయ సంఖ్యలో దిగుమతి అవుతున్నాయ్. గత ఏడాది ఇండియాలో 3.1 శాతమే ఆపిల్ ఫోన్లు తయారీ జరిగితే ఈ ఏడాది 7 శాతం వరకు ఉత్పత్తి పెంచాలని ఆ కంపెనీ భావిస్తోంది. శాంసంగ్ తో పోల్చుకుంటే యాపిల్ విక్రయాల ద్వారా వచ్చే రెవిన్యూ ఎక్కువ. గత ఏడాది 16 వేల కోట్ల రూపాయలకు పైగా యాపిల్ అమ్మకాలు సాగించింది. మొత్తంగా ఐఫోన్లను ఇండియాలోనే తయారు చేస్తే మేలని ఆ కంపెనీ భావిస్తోంది. అత్యధిక జనాభా, చీప్ లేబర్‌తో కలిసి వస్తోందని కంపెనీ అభిప్రాయపడుతోంది. దీంతో ఇండియాలో ఉత్పత్తులు చేస్తే ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ ఇవ్వడంతో కొన్ని కంపెనీలు ఇండియావైపు మొగ్గుచూపుతున్నాయ్. ఇలా చేయడం ద్వారా యాపిల్ కంపెనీకి భారీ ఆదాయం సమకూరనుంది.

ఐతే యాపిల్ కంపెనీని చైనా నుంచి ఇండియాకు షిఫ్ట్ చేసే విషయంలో క్లారిటీ ఇవ్వడానికి యాపిల్ నిరాకరించింది. గాల్వన్ లో ఇండియా-చైనా మధ్య ఘర్షణ తర్వాత చైనా వ్యాపారులు ఆదేశం వదిలి ఇండియా వస్తారా అన్న అనుమానం కూడా ఉంది. చాలా చైనా కంపెనీలు ఆ దేశం వెలుపల వియత్నాంలో ఎక్కువ తయారీ కేంద్రాలను ఏర్పాటు చేసుకున్నారు. చైనా కంపెనీ లక్సర్ ప్రొసెషన్ ఇండియస్ట్రీ కంపెనీ వియత్నాంలో యాపిల్ కోసం ఐబడ్స్ తయారు చేస్తోంది. ఐతే కరోనా తర్వాత వియత్నాంలో విద్యుత్ సంక్షోభం రావడంతో అక్కడ కంపెనీలకు చిక్కులు ఎదురవుతున్నాయ్. యుద్ధంలో రష్యాకు చైనా సహకరించడం వల్లే డ్రాగన్ కంట్రీ అక్కడ్నుంచి షిఫ్ట్ అవ్వాలని డిసైడైనట్టు తెలుస్తోంది. అయితే చైనాలో ఇప్పటికే విస్తరించిన యాపిల్ కంపెనీకి అది అంత తేలికకాకపోవచ్చు.

Show Full Article
Print Article
Next Story
More Stories