iPhone 16 Series: అఫీషియల్.. ఐఫోన్ 16 సిరీస్ ఫోన్లు వచ్చేశాయ్.. ఇలా ఆఫర్లపై బుక్ చేయండి..!

iPhone 16 Series
x

iPhone 16 Series

Highlights

iPhone 16 Series : ఆపిల్ ఐఫోన్ 16 సిరీస్‌ను విడుదల చేసింది. ప్రీ బుకింగ్ సెప్టెంబర్ 13 నుండి ప్రారంభమవుతాయి.

iPhone 16 Series: మొబైల్ ప్రియలు ఎప్పుడెప్పుడని ఎదురుచూస్తున్న టైమ్ రానే వచ్చింది. టెక్ దిగ్గజం ఆపిల్ ఐఫోన్ 16 సిరీస్‌ను విడుదల చేసింది. సెప్టెంబర్ 9న రాత్రి 10:30 గంటలకు జరిగిన 'It's GlowTime' ఈవెంట్‌లో iPhone 16 సిరీస్‌ని లాంచ్ చేసింది. కంపెనీ నాలుగు మోడళ్లను సిరీస్‌లో చేర్చింది. ఈ సిరీస్‌లో iPhone 16తో పాటు iPhone 16 Plus, iPhone 16 Pro, iPhone 16 Pro Max ఉన్నాయి. నాలుగు మోడల్స్ అద్భుతమైన లుక్స్, డిజైన్, ఫీచర్లతో పరిచయం

భారతదేశంలో iPhone 16 ధర 128GB వేరియంట్ రూ.79,900, 256GB వేరియంట్ రూ.89,900, 512GB వేరియంట్ రూ.1,09,900. ఐఫోన్ 16 ప్లస్ 128GB వేరియంట్ ధర రూ.89,900, 256GB వేరియంట్ ధర రూ.99,900, 512GB వేరియంట్ ధర రూ.1,19,900.

iPhone 16 Pro 128GB వేరియంట్ ధర రూ.1,19,900, 256GB వేరియంట్ ధర రూ.1,29,990, 512GB వేరియంట్ ధర రూ.1,49,900, 1TB వేరియంట్ ధర రూ.1,50,900. iPhone 16 Pro Max 256GB వేరియంట్ ధర రూ.1,44,900, 512GB వేరియంట్ ధర రూ.1,64,900, 1TB వేరియంట్ ధర రూ.1,84,900.

భారతదేశంలో iPhone 16 సిరీస్ ఫోన్లను మీరు Apple ఆఫ్‌లైన్ స్టోర్ నుండి కొనుగోలు చేయవచ్చు. అంటే Apple స్టోర్ నుండి iPhone 16 (iPhone 16 సిరీస్) కొనుగోలు చేయాలని ఆలోచిస్తున్నట్లయితే యాపిల్‌కు భారతదేశంలో ముంబై, ఢిల్లీలో అధికారిక స్టోర్లు ఉన్నాయి. ఐఫోన్ 16 సిరీస్ సెప్టెంబర్ 20, 2024 నుండి ముంబై, ఢిల్లీ ఆపిల్ అధికారిక స్టోర్‌లలో కొనుగోలు చేయవచ్చు. ఐఫోన్ 16 సిరీస్ ప్రీ-బుకింగ్ సెప్టెంబర్ 13 నుండి ప్రారంభమవుతాయి.

ఐఫోన్ 16ను లాంచ్ చేస్తున్నప్పుడు కంపెనీ బ్యాంక్ కార్డ్‌లపై తగ్గింపును కూడా ఇచ్చింది. ఐఫోన్ 16 కొనుగోలు చేసేటప్పుడు కస్టమర్లు వీటిని పొందవచ్చు. మీరు అమెరికన్ ఎక్స్‌ప్రెస్, యాక్సిస్ బ్యాంక్, ICICI బ్యాంక్ కార్డ్‌ని కలిగి ఉంటే మీకు ఫోన్ కొనుగోలుపై రూ. 5,000 వరకు డిస్కౌంట్ లభిస్తుంది. ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా అందుబాటులో ఉంటుంగి. ఇది కాకుండా EMI సహాయంతో, వినియోగదారులు సులభంగా వాయిదాలతో iPhone 16 ను కొనుగోలు చేయగలుగుతారు.

Show Full Article
Print Article
Next Story
More Stories