iPhone 16: ఐఫోన్లకు అదిరిపోయే అప్‌డేట్ వచ్చింది.. ఇప్పుడు ఫోటోలు తీస్తే బొమ్మ ఉంటది..!

Apple has Released iOS 18.2 Beta 2 Software Update for iPhone 16 This Will Lock the Exposure
x

iPhone 16: ఐఫోన్లకు అదిరిపోయే అప్‌డేట్ వచ్చింది.. ఇప్పుడు ఫోటోలు తీస్తే బొమ్మ ఉంటది..!

Highlights

iPhone 16: టెక్ దిగ్గజం ఆపిల్ ఐఫోన్ 16ను సెప్టెంబర్‌లో విడుదల చేసింది. అయితే అప్పుడు కంపెనీ కెమెరా కంట్రోల్ బటన్‌ను భారీగా ప్రచారం చేసింది.

iPhone 16: టెక్ దిగ్గజం ఆపిల్ ఐఫోన్ 16ను సెప్టెంబర్‌లో విడుదల చేసింది. అయితే అప్పుడు కంపెనీ కెమెరా కంట్రోల్ బటన్‌ను భారీగా ప్రచారం చేసింది. అయితే బ్రాండ్ హైలైట్ చేసిన ఒక ఫీచర్-ఫోకస్. ఇది ఎక్స్‌పోజర్‌ను లాక్ చేయగల ఫీచర్. లాంచ్ అయినప్పుడు ఇది మొబైల్‌లో కనిపించలేదు. అయితే iOS 18.2 బీటా 2 విడుదలతో ఇది మారిపోయింది. iOS 18.2 బీటా ఇప్పుడు డెవలపర్‌ల కోసం అందుబాటులోకి వచ్చింది.దానితో ఆపిల్ చివరకు iPhone 16 మోడల్‌లలో కెమెరా కంట్రోల్‌ ఫోకస్, ఎక్స్‌పోజర్‌ను లాక్ చేసే ఫీచర్‌ను పరిచయం చేసింది. ఇందులో iPhone 16, iPhone 16 Pro రెండు వేరియంట్లు ఉన్నాయి.

ఫోకస్, ఎక్స్‌పోజర్‌ను లాక్ చేయడం కోసం iPhone 16లో కెమెరా కంట్రోల్ బటన్‌ను ఉపయోగించడానికి, మీరు కెమెరా కంట్రోల్‌ని లైట్‌గా నొక్కి పట్టుకోవాలి. ఇది ఫోకస్, ఎక్స్‌పోజర్‌ను లాక్ చేస్తుంది. దీని వలన ఎక్స్‌పోజర్, ఫోకస్ డైనమిక్‌గా మారకుండా కంట్రోల్ చేయడం,షాట్‌పై మీకు మరింత గ్రిప్ అందిస్తుంది. ఇది ఎక్స్‌పోజర్, ఫోకస్ కోసం ఫోన్‌పై ఆధారపడకుండా ఈమేజ్‌లను కంట్రోల్ చేస్తుంది.

మీరు నిర్దిష్ట వస్తువును షూట్ చేయడానికి ప్రయత్నిస్తున్నప్పుడు ఈ ఫీచర్ ప్రత్యేకంగా ఉపయోగపడుతుంది. అయితే ఫోన్ ఫోకస్ లేదా ఎక్స్‌పోజర్‌ను అడ్జస్ట్ చేయకూడదనుకుంటే ముఖ్యంగా లో లైటింగ్‌లో ఇది పని చేయడానికి మీరు కెమెరా కంట్రోల్ బటన్‌ను పట్టుకొని ఉంచాలి. బటన్‌ను పూర్తిగా నొక్కినప్పుడు ప్రొఫెషనల్ ఎస్ఎల్ఆర్‌లు, మిర్రర్‌లెస్ కెమెరాలు ఎలా పని చేస్తాయో అదే విధంగా ఫోటో క్యాప్చర్ చేస్తుంది. ఈ ఫీచర్ iPhone 16 కోసం iOS 18.2 అప్‌డేట్‌లో భాగంగా ఉంటుందని భావిస్తున్నారు. అయితే అప్డేట్ కోసం ఇప్పుడే iOS 18.2 డెవలపర్ బీటా 2ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

iPhone 16 కోసం ఈ ఫీచర్‌తో పాటు, వినియోగదారులు Genmoji, ఇమేజ్ ప్లేగ్రౌండ్, OpenAI, ChatGPT ఇంటిగ్రేషన్, విజువల్ ఇంటెలిజెన్స్ వంటి హెడ్‌లైన్ ఆపిల్ ఇంటెలిజెన్స్ ఫీచర్‌లను కూడా ఉంటాయి. అయితే, విజువల్ ఇంటెలిజెన్స్ ఐఫోన్ 16కి చాలా ప్రత్యేకమైనది. ఇది ఐఫోన్ 15 ప్రోలో అందుబాటులో ఉండదు.

అదనంగా ఆపిల్ ఇంటెలిజెన్స్ కోసం మరిన్ని భాషలకు సపోర్ట్ ఇస్తుంది. అంటే అనేక దేశ ప్రజలు దీనిని ఉపయోగించుకోవచ్చు. యూఎస్ ఇంగ్లీషుకు మాత్రమే పరిమితం కాలేదు. ఈ అప్‌డేట్ డిసెంబర్‌లో స్టాండర్ట్ అప్‌డేట్‌గా వస్తుందని టెక్ నిపుణులు భావిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories