iPhone 17: యాపిల్ లవర్స్‌కు పండగే.. మేడ్ ఇన్ ఇండియా ఐఫోన్ 17 వచ్చేస్తుంది..!

Apple Company Gave a Shock to China Pre Production of iPhone 17 Phones will be done in India
x

iPhone 17: యాపిల్ లవర్స్‌కు పండగే.. మేడ్ ఇన్ ఇండియా ఐఫోన్ 17 వచ్చేస్తుంది..!

Highlights

iPhone 17: చైనాకు యాపిల్ కంపెనీ షాక్ ఇచ్చింది. ఐఫోన్ 17 ఫోన్‌ల ప్రీ-ప్రొడక్షన్ భారతదేశంలో చేపట్టనుంది.

iPhone 17: చైనాకు యాపిల్ కంపెనీ షాక్ ఇచ్చింది. ఐఫోన్ 17 ఫోన్‌ల ప్రీ-ప్రొడక్షన్ భారతదేశంలో చేపట్టనుంది. ఎప్పుడూ చైనాలో పాతుకుపోయిన యాపిల్ కంపెనీ ఇప్పుడు ఇతర దేశాల్లోనూ ఐఫోన్లను తయారు చేస్తోంది. ఐఫోన్‌లు మార్కెట్లోకి రాకముందే భారతదేశంలోనే తయారవుతాయి. ఐఫోన్ 16 తర్వాత ఫోన్‌గా ఐఫోన్ 17 మార్కెట్లోకి రానుంది.

ప్రధానంగా యాపిల్ కంపెనీ భారత్‌లో ఐఫోన్ 17 మొబైల్‌ల ప్రీ-ప్రొడక్షన్ చేయనుంది. ఇది చైనాకు పెద్ద షాక్ . కొద్ది రోజుల క్రితం విడుదలైన ఐఫోన్ 16 ఫోన్‌లు కూడా భారతదేశంలోనే తయారయ్యాయి. ప్రస్తుతం ఆపిల్ కంపెనీ ఐఫోన్ 17 ప్రారంభ తయారీ పనులను చైనాకు బదులుగా భారతీయ ఫ్యాక్టరీలో నిర్వహిస్తుంది.

కరోనా మహమ్మారి సమయంలో చైనాలో ఫాక్స్‌కాన్ మూసివేశారు. ఆపిల్ ఫోన్ల ఉత్పత్తిని నిలిపివేసిన తరువాత, కంపెనీ క్రమంగా ఇతర దేశాలకు విస్తరించింది. అందుకు తగ్గట్టుగానే ఇప్పుడు భారత్‌లోనూ అనేక ప్లాంట్లు ఏర్పాటయ్యాయి. కోవిడ్ సమయంలో చైనాలో ఆపిల్ ఎదుర్కొన్న ఎదురుదెబ్బ కారణంగా, ఆపిల్ ఇతర దేశాలలో ఐఫోన్‌ల తయారీని ప్రారంభించింది.

యాపిల్ తొలిసారిగా భారతదేశంలో ఐఫోన్ 17 మొబైల్‌ల ప్రీ-ప్రొడక్షన్‌ను ప్రారంభించనుంది. కేవలం చైనాలోనే ఈ ఐఫోన్ల ప్రీ ప్రొడక్షన్ ప్రక్రియను చేపట్టిన యాపిల్ కంపెనీ తొలిసారిగా చైనాను దాటి మరో దేశానికి వెళ్లడం విశేషం. గత కొన్ని సంవత్సరాలుగా భారతదేశంలో అనేక ఐఫోన్ మోడల్‌లు తయారయ్యాయి. యాపిల్ కంపెనీ భారతదేశంలో తయారైన ఈ ఐఫోన్లను ఇతర దేశాలకు పెద్దఎత్తున ఎగుమతి చేస్తోంది.

సాధారణంగా ఐఫోన్ మోడల్ విడుదలైన తర్వాత మిగిలిన ఫోన్‌లు భారతదేశంలోనే తయారయ్యాయి. అయితే అమెరికాలోని ఆపిల్ పార్క్‌లో నెక్స్ట్ జనరేషన్ మొబైల్ డిజైన్‌ను రూపొందించిన తర్వాత ఆపిల్ కంపెనీ వాణిజ్య ప్రారంభానికి ముందు చైనాలో ఫోన్‌లను తీసుకుంది. ఐఫోన్‌లన్నీ పూర్తిగా తయారు కాకముందే చైనాలో తయారవుతుండటం గమనార్హం. సాధారణంగా ఈ ప్రక్రియ అక్టోబర్ - మే మధ్య జరుగుతుంది.

ఇప్పుడు యాపిల్ కంపెనీ మనసు మార్చుకుంది. ఐఫోన్ 17 మోడల్ విషయానికొస్తే, భారతదేశంలోని ఒక ప్లాంట్‌లో ప్రీ-ప్రొడక్షన్ జరుగుతోందని కొన్ని వర్గాలు తెలిపాయి. ఈ విధంగా తయారయిన ఐఫోన్ సాధారణంగా జూన్ 2025 తర్వాత విడుదల అవుతుంది. కరోనా వైరస్ సమయంలో చైనాలోని యాపిల్ కంపెనీకి తలెత్తిన సమస్యలను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories