Amazon Prime Day Sale 2024: ఫోన్‌ కొనే ప్లాన్‌లో ఉన్నారా.? అదిరిపోయే అమెజాన్‌ సేల్‌ వచ్చేస్తోంది

Amazon Prime Day Sale 2024: ఫోన్‌ కొనే ప్లాన్‌లో ఉన్నారా.? అదిరిపోయే అమెజాన్‌ సేల్‌ వచ్చేస్తోంది
x

Amazon Prime Day Sale 2024: ఫోన్‌ కొనే ప్లాన్‌లో ఉన్నారా.? అదిరిపోయే అమెజాన్‌ సేల్‌ వచ్చేస్తోంది

Highlights

Amazon Prime Day Sale 2024: ఈ నెల 20వ తేదీన అర్థరాత్రి 12 గంటలకు మొదులకానున్న సేల్‌, 21వ అర్థరాత్రి 11.59 గంటల వరకు ఉండనుంది.

Amazon Prime Day Sale 2024: కొత్తగా స్మార్ట్‌ఫోన్‌ కొనే ప్లాన్‌లో ఉన్నారా.? స్పీకర్స్‌ వంటి ఎలక్ట్రానిక్‌ గ్యాడ్జెట్స్ కొనుగోలు చేయాలని చూస్తున్నారా.? అయితే కొన్ని రోజులు వేచి ఉండండి. అదిరిపోయే సేల్‌ వచ్చేస్తోంది. ప్రముఖ ఈ కామర్స్‌ సంస్థ అమెజాన్‌ ప్రైమ్‌ డే సేల్‌ పేరుతో భారీ డిస్కౌంట్స్‌ను అందించేందుకు సిద్ధమవుతోంది. ఈ సేల్ అమెజాన్‌ ప్రైమ్‌ యూజర్లకు మాత్రమే వర్తిస్తుంది.

ఈ సేల్‌లో భాగంగా రెండు రోజుల పాటు డిస్కౌంట్స్‌ అందించనున్నారు. తాజాగా దీనికి సంబంధించిన తేదీలను ప్రకటించారు. ఈ నెల 20వ తేదీన అర్థరాత్రి 12 గంటలకు మొదులకానున్న సేల్‌, 21వ అర్థరాత్రి 11.59 గంటల వరకు ఉండనుంది. సేల్‌లో భాగంగా పలు బ్యాంకులకు చెందిన క్రెడిట్ లేదా డెబిట్ కార్డులు, ఈఎంఐ ట్రాన్సాక్షన్‌పై భారీ డిస్కౌంట్స్‌ను అందించనున్నారు. ఈ సేల్‌ భాగంగా ఇంటెల్, శాంసంగ్, వన్ ప్లస్, ఐక్యూ, హానర్, సోనీ, అసుస్ వంటి టెక్ దిగ్గజ కంపెనీలు సహా 450కి పైగా బ్రాండ్లకు చెందిన ప్రొడక్ట్స్‌పై డిస్కౌంట్‌ అందిస్తున్నారు.

అంతేకాకుండా ఈ సేల్‌లో భాగంగా ఐసీఐసీఐ బ్యాంకు డెబిట్ లేదా క్రెడిట్ కార్డులు, ఎస్బీఐ క్రెడిట్ కార్డులు, క్రెడిట్ కార్డులతో ఈఎంఐ లావాదేవీలపై 10 శాతం ఇన్‌స్టాంట్ డిస్కౌంట్‌ను అందిస్తున్నారు. అమెజాన్ పే ఐసీఐసీఐ క్రెడిట్ కార్డుతో కొనుగోలు చేస్తే రూ.2500 క్యాష్ బ్యాక్, అమెజాన్ ప్రైమ్ మెంబర్లకు రూ.300లతోపాటు సేల్స్ లో రూ.2,200 విలువ గల రివార్డు పాయింట్లు పొందొచ్చు.

ఇక ఫైర్‌ టీవీ స్టిక్స్‌ మీద ఏకంగా 55 శాతం డిస్కౌంట్స్‌ను అందిస్తున్నారు. ఈ సేల్స్‌లో బుక్‌ చేసుకున్న వారికి అదే రోజు గానీ, మరుసటి రోజు గానీ డెలివరీ చేస్తారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం అమెజాన్‌ ప్రైమ్‌ మెంబర్‌ షిప్‌ రూ. 299,, మూడు నెలలకు రూ.599, ఏడాదికి రూ.1499, అమెజాన్ ప్రైమ్ షాపింగ్ ఎడిషన్ ప్లాన్ ఫీజు రూ.399గా ఉన్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories