Samsung Mobile Offers:  అమెజాన్ బిగ్గెస్ట్ డీల్.. సగానికి పడిపోయిన సామ్‌సంగ్ 200MP కెమెరా ఫోన్‌ ధర

Samsung Mobile Offers:  అమెజాన్ బిగ్గెస్ట్ డీల్.. సగానికి పడిపోయిన సామ్‌సంగ్ 200MP కెమెరా ఫోన్‌ ధర
x
Highlights

Samsung Galaxy S23 Ultra Mobile Offers: సామ్‌సంగ్ గెలాక్సీ S25 సిరీస్‌ను ఈ నెలలో లాంచ్ చేయనుంది. సామ్‌సంగ్ గెలాక్సీ S23 అల్ట్రా 12GB + 256GB వేరియంట్ ఫోన్ ధర రూ. 1.49 లక్షలు. అయితే ఇది అమెజాన్‌లో రూ. 79,999కి అందుబాటులో ఉంది.

Samsung Galaxy S23 Ultra Mobile Offers: సామ్‌సంగ్ గెలాక్సీ S25 సిరీస్‌ను ఈ నెలలో లాంచ్ చేయనుంది. ఈ లైనప్ జనవరి 22న జరిగే కార్యక్రమంలో ఆవిష్కరించనున్నారు. దీనికి ముందు, కంపెనీ గెలాక్సీ ఎస్ 23 అల్ట్రా ధరలను భారీగా తగ్గించింది. ఈ ఫోన్ అమెజాన్‌లో అత్యంత తక్కువ ధరకు అందుబాటులో ఉంది. ఒకవేళ మీరు ఫ్లాగ్‌షిప్ మొబైల్ కొనుగోలు చేయాలనుకుంటే ఇప్పుడు సరైన అవకాశం లభించింది.

సామ్‌సంగ్ గెలాక్సీ S23 అల్ట్రా 12GB + 256GB వేరియంట్ ఫోన్ ధర రూ. 1.49 లక్షలు. అయితే ఇది అమెజాన్‌లో రూ. 79,999కి అందుబాటులో ఉంది. ఈ ఫోన్‌పై అమెజాన్ దాదాపు 47 శాతం తగ్గింపును అందిస్తోంది. డిస్కౌంట్‌తో పాటు, నో-కాస్ట్ EMI, అనేక బ్యాంక్ ఆఫర్‌లు కూడా అందుబాటులో ఉన్నాయి. దీనితో కొనుగోలు చేసే వ్యక్తులు మరింత డబ్బు ఆదా చేసుకోవచ్చు. అమెజాన్ ఈ ఫ్లాగ్‌షిప్‌ ఫోన్‌ను ఎక్స్‌ఛేంజ్ ఆఫర్‌లో కొనుగోలు చేసే అవకాశాన్ని కూడా కల్పిస్తోంది.

Samsung Galaxy S23 Ultra Features

సామ్‌సంగ్ గెలాక్సీ S23 అల్ట్రాలో గొప్ప ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి. ఈ ఫోన్ AMOLED డిస్‌ప్లేతో వస్తోంది. ఇది 120Hz అడాప్టివ్ రిఫ్రెష్ రేట్‌కు సపోర్ట్ ఇస్తుంది. శక్తివంతమైన పనితీరు, సులభమైన మల్టీ-టాస్కింగ్ కోసం దీనిలో క్వాల్‌కమ్ స్నాప్‌గ్రాగన్ 8 జెన్ 2 చిప్‌సెట్‌ అమర్చారు. ఈ ఫోన్ 12GB+256GB, 12GB+512GB స్టోరేజ్ వేరియంట్లలో లభిస్తుంది.

కెమెరా గురించి చెప్పాలంటే, ఈ ఫోన్ క్వాడ్ కెమెరా సెటప్‌తో వస్తుంది. ఇందులో 200MP మెయిన్ లెన్స్, 10MP టెలిఫోటో లెన్స్, 10MP పెరిస్కోప్ కెమెరా, 12MP అల్ట్రావైడ్ కెమెరా ఉన్నాయి. లాంచింగ్ సమయంలో ఈ ఫోన్ కెమెరా ఫీచర్స్ చాలా ఫేమస్ అయ్యాయి. ఈ కెమెరా సెటప్‌తో ఈ ఫోన్ నేటికీ ఇతర కంపెనీల అనేక ఫ్లాగ్‌షిప్ మోడల్స్‌తో పోటీపడుతోంది. సరసమైన ధరలో గొప్ప ఫీచర్లతో ఫ్లాగ్‌షిప్ ఫోన్‌ను కొనుగోలు చేయాలనుకుంటే ఇప్పుడు సరైన అవకాశం అని శాంసంగ్ చెబుతోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories