Amazon Great Freedom Festival Sale: ఆఫర్ల జాతర.. సగం ధరకే ఫోన్లు, టీవీలు, ఫ్రిజ్‌లు.. మిస్ అవ్వొద్దు బ్రదర్!

Amazon Great Freedom Festival Sale: ఆఫర్ల జాతర.. సగం ధరకే ఫోన్లు, టీవీలు, ఫ్రిజ్‌లు.. మిస్ అవ్వొద్దు బ్రదర్!
x

Best Deals

Highlights

Amazon Great Freedom Festival Sale: అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్‌ను ప్రారంభించింది. స్మార్ట్‌ఫోన్లు, టీవీలు, గృహోపకరణాలకు 80 శాతం డిస్కౌంట్‌తో కొనుగోలు చేయవచ్చు.

Amazon Great Freedom Festival Sale 2024: ప్రముఖ ఈ కామర్స్ సంస్థ అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ ‌సేల్‌ను ప్రారంభించింది. సేల్ ఈ రోజు నుంచి ఆగస్ట్ 11 వరకు లైవ్ అవుతుంది. ఈ సేల్‌లో స్మార్ట్‌ఫోన్లు, కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్, టీవీతో సహా అనేక రకాల ప్రొడక్ట్స్‌పై డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయి. ఆపిల్, హెచ్‌పీ, డెల్, షియోమీ, హిటాచి, వన్‌ప్లస్ వంటి బ్రాండెడ్ గ్యాడ్జెట్లను తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చు. ఈ సేల్ ఇప్పటికే ప్రైమ్ మెంబర్లకు లైవ్ అవుతుంది. అలానే జియో మార్ట్‌ కూడా చాలా ఉత్పత్తులపై డిస్కౌంట్లు అందిస్తుంది.

అమెజాన్ సేల్ బ్యాంక్ ఆఫర్‌లు బ్యాంక్ ఆఫర్‌ల గురించి మాట్లాడితే.. ఈ సేల్‌లో SBI క్రెడిట్, డెబిట్ కార్డులపై 50 శాతం డిస్కౌంట్ ఆఫర్ చేస్తుంది. మీరు ఎలక్ట్రానిక్స్, ఫ్యాషన్, గృహోపకరణాలు, అనేక ఉత్పత్తులపై ఈ సేల్‌లో స్పెషల్ డిస్కౌంట్ పొందొచ్చు. ఈ షాపింగ్ ఈవెంట్ సమయంలో మీరు SBI క్రెడిట్ కార్డ్‌పై అదనపు ఆఫర్లను కూడా దక్కించుకోవచ్చు

అమెజాన్ సేల్ సమయంలో మొబైల్స్, యాక్సెసరీలపై 40 శాతం వరకు తగ్గింపు అందుబాటులో ఉంటుంది. దీనిలో కొత్త స్మార్ట్‌ఫోన్‌లు, కేసులు, ఛార్జర్‌లు, ఇతర అవసరమైన టూల్స్‌పై భారీ ఆఫర్లు ఉన్నాయి. మీరు కొత్త మోడల్‌కి అప్‌గ్రేడ్ అవ్వాలంటే ఈ సేల్‌ చాలా ఉపయోగంగా ఉంటుంది.

అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్‌లో ఎలక్ట్రానిక్స్, యాక్సెసరీలపై 80 శాతం వరకు డిస్కౌంట్ లభిస్తుంది. ఈ ఆఫర్‌లో గాడ్జెట్‌లు, టూల్స్‌ను రాక్ బాటమ్ ధరలకు అప్‌గ్రేడ్ చేయవచ్చు. మీరు సరికొత్త స్మార్ట్‌ఫోన్, ల్యాప్‌టాప్, హెడ్‌ఫోన్‌లు, స్మార్ట్‌వాచ్ లేదా ఇతర ఎలక్ట్రానిక్స్‌ కొనాలంటే ఈ సేల్ టాప్ బ్రాండ్‌లపై డిస్కౌంట్లను అందిస్తుంది.

సేల్ సమయంలో గృహోపకరణాలపై 65 శాతం వరకు తగ్గింపును లభిస్తుంది. దీనితో మీరు మీ ఇంటికి కొత్త లుక్ ఇవ్వొచ్చు. ఈ సేల్‌లో కిచెన్ గాడ్జెట్‌లు, ఇతర ఇతర వస్తువులను అప్‌గ్రేడ్ చేయవచ్చు. ఈ సేల్‌లో రిఫ్రిజిరేటర్‌లు, వాషింగ్ మెషీన్‌ల నుంచి కాఫీ మేకర్‌లు, ఎయిర్ ఫ్రైయర్‌ల వంటి చిన్న ఉత్పత్తులపై భారీ డిస్కౌంట్లు అందుబాటులో ఉంటాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories