Samsung Best Offers: దీపావళి సేల్.. ఈ ఫోన్లపై ఆఫర్ల రచ్చ..!

Samsung Best Offers
x

Samsung Best Offers

Highlights

Samsung Best Offers: అమెజాన్‌ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్‌లో స్మార్ట్‌ఫోన్‌లపై భారీ దీపావళి ప్రత్యేక ఆఫర్‌లను అందిస్తుంది.

Samsung Best Offers: అమెజాన్‌ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్‌లో స్మార్ట్‌ఫోన్‌లపై భారీ దీపావళి ప్రత్యేక ఆఫర్‌లను అందిస్తుంది. ఇందులో ఉత్తమ ఆఫర్‌లతో అనేక బ్రాండ్ల నుంచి స్మార్ట్‌ఫోన్‌లను కొనచ్చు. మీరు సామ్‌సంగ్ అభిమాని అయితే ఈ సేల్‌లో మీ కోసం కొన్ని అద్భుతమైన డీల్‌లు లైవ్ అవుతున్నాయి. ఈ పండుగ సీజన్‌లో జరిగే ఈ బంపర్ సేల్‌లో మీరు రూ.12,500 వరకు తగ్గింపుతో సామ్‌సంగ్ ఫోన్‌లను ఆర్డర్ చేయచ్చు. 6499 రూపాయలకే సేల్‌లో చౌకైన ఫోన్ అందుబాటులో ఉంది. దీపావళి ప్రత్యేక డీల్‌లో మీరు క్యాష్‌బ్యాక్, అద్భుతమైన ఎక్స్ఛేంజ్ బోనస్‌తో కూడా ఈ ఫోన్‌లను దక్కించుకోవచ్చు. ఎక్స్ఛేంజ్ ఆఫర్‌లో లభించే తగ్గింపు మీ పాత ఫోన్, బ్రాండ్, కంపెనీ పాలసీపై ఆధారపడి ఉంటుంది

1. Samsung Galaxy Z Fold6 5G AI

12 జీబీ ర్యామ్, 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ఉన్న ఈ ఫోన్ ధర రూ.1,64,998. గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ దీపావళి స్పెషల్ సేల్‌లో మీరు దీన్ని రూ. 12,500 వరకు బ్యాంక్ తగ్గింపుతో కొనచ్చు. కంపెనీ ఈ ఫోన్‌పై రూ. 8250 వరకు క్యాష్‌బ్యాక్ కూడా ఇస్తోంది. ఎక్స్ఛేంజ్ ఆఫర్‌లో ఈ ఫోన్ ధరను రూ.72,600 వరకు తగ్గించొచ్చు. కంపెనీ ఈ ఫోన్‌లో 7.6 అంగుళాల మెయిన్, 6.3 అంగుళాల ఔటర్ డిస్‌ప్లేను ఇస్తోంది. రెండు డిస్ప్లేలు 120Hz రిఫ్రెష్ రేట్‌కు సపోర్ట్ ఇస్తాయి. ఫోటోగ్రఫీ కోసం ఫోన్‌లో 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంది. ఫోన్ బ్యాటరీ 4400mAh, ఇది 25 వాట్ల వైర్డు ఛార్జింగ్‌కు సపోర్ట్ ఇస్తుంది.

2. Samsung Galaxy S24 5G AI

8 GB RAM,256 GB ఇంటర్నల్ స్టోరేజ్ కలిగిన ఈ ఫోన్ రూ. 67,999 సేల్‌లో అందుబాటులో ఉంది. బ్యాంక్ ఆఫర్‌లో ఫోన్‌పై రూ.3 వేల వరకు తగ్గింపు ఇస్తోంది. ఈ ఫోన్‌పై కంపెనీ రూ.60,600 వరకు ఎక్స్ఛేంజ్ బోనస్ కూడా ఇస్తోంది. మీరు ఫోన్‌పై రూ. 3400 వరకు క్యాష్‌బ్యాక్ కూడా పొందవచ్చు. ఈ Samsung ఫోన్‌లో మీరు ఫుల్ HD+ రిజల్యూషన్‌తో 6.2 అంగుళాల డైనమిక్ AMOLED 2x డిస్‌ప్లే పొందుతారు. ఫోటోగ్రఫీ కోసం ఫోన్‌లో LED ఫ్లాష్‌తో కూడిన 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంది. ఫోన్ సెల్ఫీ కెమెరా 12 మెగాపిక్సెల్స్.

3.Samsung Galaxy M05

ఈ ఎంట్రీ లెవల్ ఫోన్ సేల్‌లో బెస్ట్ డీల్‌లో అందుబాటులో ఉంది. 4 జీబీ ర్యామ్, 64 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ఉన్న ఈ ఫోన్ ధర రూ.6499. మీరు దీన్ని దాదాపు రూ. 325 క్యాష్‌బ్యాక్‌తో సేల్‌లో కొనచ్చు. మీరు ఎక్స్ఛేంజ్ ఆఫర్‌లో రూ. 6,150 వరకు ప్రయోజనం పొందవచ్చు.

ఫీచర్ల గురించి మాట్లాడితే ఫోన్‌లో 6.7 అంగుళాల HD + డిస్‌ప్లే పొందుతారు. ఫోన్ వెనుక ప్యానెల్‌లో ఫోటోగ్రఫీ కోసం 50 మెగాపిక్సెల్ డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ అందించారు. సెల్ఫీ కోసం ఈ ఫోన్‌లో 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను చూడచ్చు. ఫోన్‌లో అందించిన బ్యాటరీ 5000mAh. ఇది 25 వాట్ల ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ ఇస్తుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories