Biggest Offer: ఖతర్నాక్ ఆఫర్.. ఫోన్‌పై రూ.40 వేల డిస్కౌంట్.. మళ్లీ మళ్లీ దొరకవు..!

oneplus open
x

oneplus open

Highlights

Biggest Offer: గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌లో అమెజాన్ వన్‌ప్లస్ ఓపెన్ స్మార్ట్‌ఫోన్‌పై రూ.40 వేల డిస్కౌంట్ అందిస్తోంది.

Biggest Offer: మీరు ప్రీమియం ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ కోసం వెతుకుతున్న కస్టమర్‌లలో ఒకరు అయితే మీకో శుభవార్త ఉంది. దీని ద్వారా మీరు భారీగా డబ్బును ఆదా చేసుకోవచ్చు. ఈ కామర్స్ వెబ్‌సైట్ అమెజాన్‌లో గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ జరుగుతుంది. ఈ సేల్‌లో వన్‌ప్లస్ ఓపెన్ డబుల్ డిస్‌ప్లే స్మార్ట్‌ఫోన్‌పై భారీ తగ్గింపులు అందుబాటులో ఉన్నాయి. ఫోన్ మార్కెట్‌లోకి వచ్చినప్పటి నుంచి ఇదే అతిపెద్ద డిస్కౌంట్. ఈ డీల్ గురించి వివరంగా తెలుసుకుందాం.

వన్‌ప్లస్ ఓపెన్ అనేది కంపెనీ మొట్టమొదటి ఫోల్డబుల్ ఫోన్. ఈ ఫోన్ డిజైన, సాఫ్టవేర్ పరంగా చాలా పవర్‌ఫుల్‌గా ఉంటుంది. ఇది కాకుండా పెద్ద ఫోల్డబుల్ డిస్‌ప్లే, డాల్బీ విజన్ సపోర్ట్ కూడా ఉంది. ఈ ఫోల్డబుల్ ఫోన్ టీయూవీ సర్టిఫికేషన్ పొందింది. కంపెనీ 10 సంవత్సరాలు ఉపయోగించడానికి టెస్టింగ్ జరిపింది. ఇది శక్తివంతమైన Qualcomm Snapdragon 8 Gen 2 ప్రాసెసర్, ప్రీమియం సర్వీస్ కలిగి ఉంది.

వన్‌ప్లస్ ఓపెన్ భారతీయ మార్కెట్‌లో రూ.1,39,999 ధరతో ప్రారంభించారు. ఇది 16GB RAM+ 512GB స్టోరేజ్‌ వేరియంట్ ధర. ఇప్పుడు ఈ వేరియంట్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌లో రూ. 99,999కి అందుబాటులో ఉంది. అంటే దానిపై నేరుగా రూ.40 వేలు తగ్గింపు లభిస్తోంది. ఎక్స్ఛేంజ్ ఆఫర్‌తో కస్టమర్‌లు గరిష్టంగా రూ. 55,000 వరకు తగ్గింపును పొందవచ్చు. దీని విలువ పాత ఫోన్ మోడల్, స్థితిపై ఆధారపడి ఉంటుంది.

ఈ ఫోన్‌లో ఫోల్డబుల్ 7.82 అంగుళాల LTPO3 ఫ్లెక్సీ-ఫ్లూయిడ్ AMOLED డిస్‌ప్లే 120Hz రిఫ్రెష్ రేట్, బయట 6.31 అంగుళాల LTPO3 సూపర్ ఫ్లూయిడ్ OLED డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ కూడా పొందుతుంది. రెండు డిస్‌ప్లేలు డాల్బీ విజన్‌కు సపోర్ట్ చేస్తాయి. 2800నిట్స్ పీక్ బ్రైట్నెస్ కలిగి ఉంటాయి. బలమైన పనితీరు కోసం ఇది Qualcomm Snaodragon 8 Gen 2 ప్రాసెసర్‌తో రన్ అవుతుంది. OxygenOS 14 అప్‌డేట్ ఇందులో అందుబాటులో ఉంది.

వెనుక ప్యానెల్‌లో 48MP ప్రైమరీ, 64MP టెలిఫోటో, 48MP అల్ట్రా-వైడ్ సెన్సార్‌తో కూడిన ట్రిపుల్ కెమెరా సెటప్ హాసెల్‌బ్లాడ్ కలర్ కాలిబ్రేషన్‌తో అందుబాటులో ఉంది. ఇది కాకుండా సెల్ఫీ కోసం, ఫోల్డబుల్ డిస్‌ప్లేలో 20MP ఫ్రంట్ కెమెరా, కవర్ డిస్‌ప్లేలో 32MP ఫ్రంట్ కెమెరా ఉన్నాయి. సేఫ్టీ కోసం ఫింగర్ ప్రింట్ స్కానర్ కూడా ఉంది. దీనిలో 4805mAh బ్యాటరీ 67W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో ఉంటుంది. దీనికి రివర్స్ వైర్డ్ ఛార్జింగ్ ఫీచర్ కూడా అందించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories