Cheapest 5G Smartphones: మరీ ఇంత చీపా.. రూ.673లకే కొత్త 5జీ ఫోన్లు.. కొనేస్తే ఓ పనైపోద్ది..!

Cheapest 5G Smartphones
x

Cheapest 5G Smartphones

Highlights

Cheapest 5G Smartphones: అమెజాన్ రియల్‌మీ నార్జో 60 5జీ, HMD క్రెస్ట్ మ్యాక్స్ 5G స్మార్ట్‌ఫోన్లపై భారీ ఆఫర్లు ప్రకటించింది. ఇప్పుడు మీరు నెలవారీ EMI రూ. 673తో కొనుగోలు చేయవచ్చు

Cheapest 5G Smartphones: దేశంలో స్మార్ట్‌ఫోన్ కంపెనీలన్నీ 5G జపం చేస్తున్నాయి. మొబైల్ ప్రియులు కూడా కొత్త ఫీచర్లతో వచ్చే 5జీ ఫోన్ల వైపు చూస్తున్నారు. గతంలో ఈ ఫోన్ల ధరలు కాస్త ఎక్కువగా ఉండేవి. అయితే ప్రస్తుతం తక్కువ ధరకే లభిస్తున్నాయి. ఈ క్రమంలో మీరు కూడా కొత్త 5G ఫోన్‌ను తక్కువ ధరకు కొనుగోలు చేయాలనుకుంటే లేదా మీ పాత 4G ఫోన్‌ను 5Gకి అప్‌గ్రేడ్ చేయాలనుకుంటే టాప్ బ్రాండ్‌ల నుండి కొన్ని చీపెస్ట్ ఫోన్‌లను షార్ట్‌లిస్ట్ చేసాము. ఈ ఫోన్‌లను రూ. 1000 కంటే తక్కువ ధరకే మీ ఇంటికి తీసుకెళ్లవచ్చు. వీటన్నింటి అమెజాన్ నుంచి కొనుగోలు చేయవచ్చు. వాటి గురించి వివరంగా తెలుసుకుందాం.

Realme Narzo 60 5G
రియల్‌మీ ఈ ఫోన్‌లో అందుబాటులో ఉన్న ఫీచర్ల విషయానికి వస్తే ఈ 5G ఫోన్‌లో గరిష్టంగా 12GB RAM, 256GB వరకు స్టోరేజ్ ఉంటుంది. ఫోన్‌లో 6.43 అంగుళాల సూపర్ అమోలెడ్ డిస్‌ప్లే ఉంది. ఫోటోగ్రఫీ కోసం 64 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంది. ఈ ఫోన్ పర్ఫామెన్స్ పెంచడానికి డైమెన్సిటీ 6020 5G చిప్‌సెట్ అందించారు. పవర్ కోసం 5000mAh బ్యాటరీ ఉంది. ఇది 33W SUPERVOOC ఛార్జింగ్ టెక్నాలజీకి సపోర్ట్ ఇస్తుంది. ఈ ఫోన్ ధర అమెజాన్‌లో రూ.18,999గా ఉంది. మీరు నెలవారీ EMI రూ. 673తో కొనుగోలు చేయవచ్చు.

HMD Crest Max 5G
HMD ఈ కొత్త స్మార్ట్‌ఫోన్‌లో అందుబాటులో ఉన్న కొన్ని ఫీచర్ల గురించి మాట్లాడితే ఈ ఫోన్ ఫోటోగ్రఫీ కోసం 64MP ప్రైమరీ కెమెరాను ఉంది. ముందు వైపు సెల్ఫీ వీడియో కాలింగ్ కోసం 50MP ఫ్రంట్ కెమెరా ఉంది. ఫోన్‌‌లో 5000mAh బ్యాటరీ ఉంది. ఇది 33W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ ఇస్తుంది. కంపెనీ ఫోన్‌లో Unisoc T760 5G ఆక్టా కోర్ చిప్‌సెట్‌ ఉపయోగించింది. ఫోన్ 6.67 అంగుళాల ఫుల్ హెచ్‌డి+ డిస్‌ప్లేను కలిగి ఉంది. HMD ఈ కొత్త ఫోన్ Android 14 ఆపరేటింగ్ సిస్టమ్‌పై ఆధారపడి ఉంటుంది. ఇది 8GB RAMతో 256GB ఇంటర్నల్ స్టోరేజ్ ఆప్షన్‌ను కలిగి ఉంది. ఈఫోన్ ధర రూ. 13,999. మీరు నెలవారీ రూ. 679 EMIతో దీన్ని మీ సొంతం చేసుకోవచ్చు.

Show Full Article
Print Article
Next Story
More Stories