Amazon New Sale: వినాయక చవితి రోజున కొత్త సేల్.. భారీగా తగ్గిన ఈ స్మార్ట్‌ఫోన్ల ధరలు..!

Amazon New Sale
x

Amazon New Sale

Highlights

Amazon New Sale: అమెజాన్ ఎలక్ట్రానిక్స్ ఫెస్టివల్ సేల్‌‌ను ప్రకటించింది. వన్‌ప్లస్ నార్డ్ 4 5జీ, సామ్‌సంగ్ గెలాక్సీ M35 5G ఫోన్లను భారీ ఆఫర్లపై కొనుగోలు చేయవచ్చు.

Amazon New Sale: ఈ కామర్స్ వెబ్‌సైట్ అమెజాన్ వినాయక చవితి ఉత్సవాలను రెట్టింపు చేసింది. ఎలక్ట్రానిక్స్ ఫెస్టివల్ సేల్‌‌ను ప్రకటించింది. ఈ సేల్ సెప్టెంబర్ 10 వరకు జరుగుతుంది. మీరు భారీ డిస్కౌంట్లు, ఆఫర్లపై దాదాపు అన్ని కంపెనీలకు చెందిన గ్యాడ్జెట్లను కొనుగోలు చేయవచ్చు. అదే సమయంలో మీరు సామ్‌సంగ్, వన్‌ప్లస్ స్మార్ట్‌ఫోన్లను అసలు మిస్ అవకండి. ఆ సేల్‌లో రెండు ఫోన్లపై ఉన్న డీల్స్ గురించి వివరంగా తెలుసుకుందాం.

ఈ సేల్‌లో మీరు బంపర్ ఫ్లాట్ తగ్గింపుతో Samsung Galaxy M35 5G, OnePlus Nord 4లను కొనుగోలు చేయవచ్చు. సేల్‌లో ఈ రెండు ఫోన్లను బలమైన క్యాష్‌బ్యాక్, ఎక్స్ఛేంజ్ బోనస్‌తో దక్కించుకోవచ్చు. ఎక్స్ఛేంజ్ ఆఫర్‌లో లభించే తగ్గింపు మీ పాత ఫోన్ పర్ఫామెన్స్, బ్రాండ్, కంపెనీ ఎక్స్‌ఛేంజ్ పాలసీపై ఆధారపడి ఉంటాయి.

Samsung Galaxy M35 5G
6 జీబీ ర్యామ్, 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ఉన్న ఈ ఫోన్ ధర రూ.19,998. మీరు దీన్ని రూ. 2,000 ఫ్లాట్ తగ్గింపుతో సేల్‌లో కొనుగోలు చేయవచ్చు. కంపెనీ ఈ ఫోన్‌పై రూ. 1,000 వరకు క్యాష్‌బ్యాక్ కూడా ఇస్తోంది. మీరు ఎక్స్ఛేంజ్ ఆఫర్‌లో రూ. 18,550 వరకు బెనిఫిట్ పొందవచ్చు.ఫీచర్ల గురించి చెప్పాలంటే మీరు ఫోన్‌లో 6.6 అంగుళాల సూపర్ అమోలెడ్ డిస్‌ప్లేను పొందుతారు. ఫోన్ Exynos 1380 ప్రాసెసర్‌పై పనిచేస్తుంది. ఫోన్‌లో 50-మెగాపిక్సెల్ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఈ Samsung ఫోన్ 6000mAh బ్యాటరీతో వస్తుంది. ఈ బ్యాటరీ 25 వాట్ల ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ ఇస్తుంది.

OnePlus Nord 4 5G
8 జీబీ ర్యామ్, 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ఉన్న ఈ ఫోన్ రూ.2 వేల ఫ్లాట్ డిస్కౌంట్‌తో సేల్‌లో అందుబాటులో ఉంది. దీని ధర రూ.29,998. ఫోన్‌లో సేల్‌లో రూ. 1500 వరకు క్యాష్‌బ్యాక్ కూడా ఆఫర్ చేస్తోంది. ఈ OnePlus ఫోన్‌పై రూ. 25,200 వరకు ఎక్స్‌‌ఛేంజ్ వాల్యూ లభిస్తుంది. ఫీచర్ల గురించి మాట్లాడితే కంపెనీ ఈ ఫోన్‌లో 120Hz రిఫ్రెష్ రేట్‌తో AMOLED డిస్‌ప్లేను అందిస్తోంది. ఫోటోగ్రఫీ కోసం ఫోన్‌లో 50 మెగాపిక్సెల్ సోనీ డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది. ప్రాసెసర్‌గా, మీరు దీనిలో స్నాప్‌డ్రాగన్ 7 ప్లస్ జెన్ 3 చిప్‌సెట్‌ను చూడవచ్చు. ఫోన్‌లో అందించబడిన బ్యాటరీ 5500mAh. ఇది 100W ఛార్జింగ్‌కు సపోర్ట్ ఇస్తుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories