Limited Deal: ఆహా ఏమి ఆఫర్.. నిమిషాల్లో ఫుల్ ఛార్జ్.. ఫోన్‌‌పై రూ.8 వేలు డిస్కౌంట్..!

OnePlus Nord CE 3 5G
x

OnePlus Nord CE 3 5G 

Highlights

Limited Deal: అమెజాన్ వన్‌ప్లస్ నార్డ్ CE 3 5G స్మార్ట్‌ఫోన్‌పై లిమిటెడ్ డీల్ ప్రకటించింది. రూ.8000 డిస్కౌంట్‌తో కొనుగోలు చేయవచ్చు.

OnePlus Nord CE 3 5G: టెక్ మార్కెట్‌లో రోజుకో కొత్త ఫోన్ సందడి చేస్తోంది. వివిధ కంపెనీలు పోటాపోటీగా ఫోన్లను రిలీజ్ చేస్తున్నాయి. ముఖ్యంగా యువతను టార్కెట్ చేసుకొని సరికొత్త ఫీచర్లతో తీసుకొస్తున్నాయి. ఈ క్రమంలో మీరు కూడా కొత్త 5జీ ఫోన్ కొనాలని చూస్తున్నారా? అయితే మీకో శుభవార్త ఉంది. ఆన్‌లైన్ షాపింగ్ ప్లాట్‌ఫామ్ అమెజాన్ OnePlus Nord CE 3 5G స్మార్ట్‌ఫోన్‌పై భారీ డిస్కౌంట్ ప్రకటించింది.ఈ ఫోన్ AMOLED డిస్‌ప్లే, స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్‌తో వస్తుంది. దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.

మీరు OnePlus స్మార్ట్‌ఫోన్‌ల అభిమాని అయితే OnePlus ఫోన్‌లపై ఈ కామర్స్ సైట్ అమెజాన్ లిమిటెడ్ డీల్ కింద OnePlus Nord CE 3 5G రూ. 8000 వరకు తగ్గింపు అందిస్తుంది. ఈ ఫోన్ AMOLED డిస్‌ప్లే, స్నాప్‌డ్రాగన్ పవర్‌ఫుల్ ప్రాసెసర్‌తో వస్తుంది. ఈ ఫోన్‌ను కేవలం 16 నిమిషాల్లో 60 శాతానికి పైగా ఛార్జ్ చేయవచ్చని కంపెనీ పేర్కొంది.

OnePlus Nord CE 3 5G Highlights
వన్‌ప్లస్ Nord CE 3 5G ఫోన్ 6.7-అంగుళాల FullHD+ ఫ్లాట్ AMOLED స్క్రీన్‌ను కలిగి ఉంది. ఇది 120 Hz రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది. HDR10+ వంటి ఫీచర్‌లకు సపోర్ట్ ఇస్తుంది. ఫోన్‌లో Qualcomm Snapdragon 782G ఆక్టాకోర్ ప్రాసెసర్ ఉంది. ఫోన్ 5,000 mAh బ్యాటరీని కలిగి ఉంది. ఈ మొబైల్ 80W SuperVOOC ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ సపోర్ట్‌తో వస్తుంది.

OnePlus Nord CE 3 5G ఫోన్ రెండు మెమరీ వేరియంట్‌లలో వస్తుంది. ఫోన్ ర్యామ్ 12 GB వరకు పెంచుకోవచ్చు. ఫోన్ వెనుక ట్రిపుల్ కెమెరా ఉంది. ఇందులో 50 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్, 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, 2 మెగాపిక్సెల్ మాక్రో సెన్సార్ ఉన్నాయి. సెల్ఫీ కోసం 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను కలిగి ఉంది.

OnePlus Nord CE 3 5G Offer
స్మార్ట్‌ఫోన్ మేకర్ వనప్లస్ OnePlus Nord CE 3 5Gని గతేడాది లాంచ్ చేసింది. ఆ సమయంలో 8GB RAM+ 128GB స్టోరేజ్‌ వేరియంట్ ధర రూ.26,999. ఇప్పుడు ఈ ఫోన్ అమెజాన్‌లో రూ. 18,998కి అందుబాటులో ఉంది. ఫోన్, బ్లూ, బ్లాక్ కలర్ వేరియంట్‌లు ఈ ధరలో అందుబాటులో ఉన్నాయి. దీనితో పాటు ఫోన్‌లో రూ.16,000 వరకు ఎక్స్ఛేంజ్ బోనస్ కూడా ఇస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories