Oppo F27 5G: బడ్జెట్ కింగ్.. ఒప్పో ఫోన్‌పై ఆఫర్లే ఆఫర్లు.. వావ్ అనిపిస్తున్న AI ఫీచర్లు..!

Oppo F27 5G
x

Oppo F27 5G

Highlights

Oppo F27 5G: అమెజాన్ Oppo F27 5G స్మార్ట్‌ఫోన్‌పై భారీ ఆఫర్ ప్రకటించింది. రూ. 2,299 డిస్కౌంట్‌తో కొనుగోలు చేయవచ్చు.

Oppo F27 5G: చైనీస్ స్మార్ట్‌ఫోన్ మేకర్ ఒప్పో గత నెలలో టెక్ మార్కెట్‌లో Oppo F27 5Gని విడుదల చేసింది. ఈ ఫోన్ 32 మెగాపిక్సెల్ Sony IMX615 సెల్ఫీ కెమెరా, పీక్ రీఫ్రెష్ రేట్‌తో ఆమ్లోడ్ డిస్‌‌ప్లే ఉంటుంది. అలానే ప్రత్యేకమైన AI ఫీచర్లు కూడా ఉన్నాయి. అయితే ఇప్పుడు ఈ స్మార్ట్‌ఫోన్‌పై అమెజాన్ భారీ ఆఫర్ ప్రకటించింది. కొనుగోలుపై రూ.2,229 డిస్కౌంట్ ప్రకటించింది. దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.

ఈ కామర్స్ ఆన్‌లైన్ వెబ్‌సైట్ అమెజాన్ Oppo F27 5Gపై డిస్కౌంట్ ప్రకటించింది. తక్కువ ధరకే మొబైల్ ఆర్డర్ చేయవచ్చు. వీటితో పాటు నో కాస్ట్ EMI, ఎక్స్‌ఛేంజ్ ఆఫర్లు కూడా అందుబాటులో ఉన్నాయి. IP64 డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ అందించే ఫోన్ స్ప్లాష్ టచ్ ఫీచర్‌ను కలిగి ఉంది. దీని కారణంగా స్క్రీన్‌పై నీటి చుక్కలు ఉన్నప్పటికీ దాని టచ్ పనిచేస్తుంది.

మీరు Oppo F27 5Gని చౌకగా ఆర్డర్ చేయాలనుకుంటే ఎంచుకున్న బ్యాంక్ కార్డ్‌ల సహాయంతో చెల్లింపు చేయాలి. 8GB RAM +128GB ఇంటర్నల్ స్టోరేజ్ కలిగిన ఈ ఫోన్ బేస్ వేరియంట్ అమెజాన్‌లో రూ. 22,999 ధరతో ఉంది. అయితే HDFC బ్యాంక్ లేదా ICICI బ్యాంక్ కార్డ్‌ల సహాయంతో పేమెంట్‌పై రూ. 2,299 ఫ్లాట్ తగ్గింపు అందుబాటులో ఉంది. ఈ తగ్గింపు తర్వాత ఫోన్ ధర రూ.20,700 అవుతుంది.

పాత ఫోన్ ఎక్స్‌ఛేంజ్ చేయడం ద్వారా స్టమర్‌లు గరిష్టంగా రూ. 21,600 వరకు ఎక్స్‌ఛేంజ్ డిస్కౌంట్ పొందవచ్చు, దీని విలువ పాత ఫోన్ మోడల్, పర్ఫామెన్స్‌పై ఆధారపడి ఉంటుంది. Oppo F27 5G ఫోన్‌ను రెండు కలర్ వేరియంట్‌లలో కొనుగోలు చేయవచ్చు. అందులో ఎమరాల్డ్ గ్రీన్, అంబర్ ఆరెంజ్ ఉన్నాయి.

Oppo F27 5G Specifications
Oppo ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్‌తో 6.67 అంగుళాల ఫుల్ HD+ AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది హాలో లైట్ ఎఫెక్ట్స్ ఫీచర్‌ను కలిగి ఉంది. ఫోన్‌లో 8GB RAMతో పాటు MediaTek డైమెన్సిటీ 6300 ప్రాసెసర్‌ ఉంటుంది. వెనుక ప్యానెల్‌లో 50MP మెయిన్, 2MP సెకండరీ కెమెరాతో డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది. ఫ్రంట్ 32MP సెల్ఫీ కెమెరా ఫోన్‌లో అందించారు.

Oppo F27 5G మొబైల్‌లో 5000mAh కెపాసిటీ బ్యాటరీ ఉంటుంది. ఇది 45W SuperVOOC ఫాస్ట్ ఛార్జింగ్‌కి సపోర్ట్ ఇస్తుంది. AI స్మార్ట్ ఇమేజ్ మ్యాటింగ్ 2.0, AI ఎరేజర్ 2.0, AI స్టూడియో వంటి అనేక ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత ఫీచర్లు ఈ ఫోన్‌లో అందించబడ్డాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories