Amazon Sale: ఐఫోన్ లవర్స్‌కు పండగే.. అమెజాన్‌లో తక్కువ ధరకే ఐఫోన్ 14.. తోపు డీల్ ఇది..!

Amazon Sale
x

Amazon Sale

Highlights

Amazon Sale: అమెజాన్ iPhone 14పై భారీ డీల్ ప్రకటించింది. 24 శాతం డిస్కౌంట్‌తో ఫోన్ కొనుగోలు చేయవచ్చు.

Amazon Sale: గ్లోబల్ టెక్ బ్రాండ్ ఆపిల్ ప్రతేడాది నవంబర్‌లో సరికొత్త సిరీస్ ఫోన్లను విడుదల చేస్తుంది. కంపెనీ కొత్త ఫోన్లను లాంచ్ చేస్తున్నప్పుడు పాత మోడల్ ధరలను తగ్గిస్తుంది. ఈ అవకాశాన్ని ఐఫోన్ లవర్స్ ఉపయోగించుకోవచ్చు. ఇప్పుడు తాజాగా iPhone 14పై భారీ ఆఫర్ ప్రకటించింది. మీరు తక్కువ ధరకే ఈ ఫోన్‌ను మీ సొంతం చేసుకోవచ్చు. అమెజాన్‌ నుంచి మీరు ఈ ఫోన్‌ను కొనుగోలు చేయవచ్చు. ఈ ఫ్లాగ్‌షిప్ ఫోన్‌లో బెస్ట్ కెమెరా, వేగవంతమైన ప్రాసెసర్‌ ఉంటుంది. ఈ స్మార్ట్‌ఫోన్ ఆక్టాకోర్ GPUతో A15 బయోనిక్ చిప్‌సెట్‌తో వస్తుంది. ఈ ఫోన్ డిస్కౌంట్ ఆఫర్, స్పెసిఫికేషన్‌లను పరిశీలిద్దాం.

అమెజాన్ iPhone 14పై భారీ డీల్ ప్రకటించింది. 24 శాతం డిస్కౌంట్ ఆఫర్ చేస్తోంది. దీని తర్వాత రూ.60,900 ధరతో స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేయవచ్చు. ఐఫోన్ 14 లాంచ్ అయిన్పప్పుడు దాని ధర రూ.79,900. ఇంకా తక్కువ ధరకు స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేయాలనుకునే కస్టమర్‌ల కోసం అనేక బ్యాంక్, ఎక్స్‌ఛేంజ్ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. ICICI క్రెడిట్ కార్డ్‌ నుంచి రూ. రూ. 41,940పైన చెల్లింపు చేస్తే రూ. 3000 తక్షణ తగ్గింపు లభిస్తుంది.

ఐఫోన్ 14 లాంగ్ లైఫ్ బ్యాటరీ లైఫ్‌తో కెమెరా సెంట్రిక్ ఫోన్ కోసం చూస్తున్న వారికి సరైనది. స్మార్ట్‌ఫోన్ 2532x1170 పిక్సెల్ రిజల్యూషన్‌తో 6.1-అంగుళాల సూపర్ రెటినా XDR OLED డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది 12MP ప్రైమరీ కెమెరా, ప్రొటక్షన్ కోసం సిరామిక్ షీల్డ్ గ్లాస్‌తో 12MP అల్ట్రావైడ్ కెమెరాతో డ్యూయల్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. ఈ లేటెస్ట్ కెమెరా సిస్టమ్ వినియోగదారులను ఏ లైటింగ్‌లోనైనా క్వాలిటీ గల చిత్రాలను తీయడానికి అనుమతిస్తుంది.

ఇది 30 fps వద్ద ఫోటోలను క్యాప్చర్ చేయడానికి 4K డాల్బీ విజన్‌తో కూడిన సినిమాటిక్ కెమెరా మోడ్‌ను కలిగి ఉంది. ఇది స్టిల్, హ్యాండ్‌హెల్డ్ వీడియోని క్యాప్చర్ చేయడానికి యాక్షన్ మోడ్‌ను కూడా కలిగి ఉంది. స్మార్ట్‌ఫోన్ ముందు, వెనుక భాగంలో కార్నింగ్ ప్రొటక్షన్‌తో కూడిన అల్యూమినియం ఫ్రేమ్‌ను పొందుతుంది. దీని బరువు 172 గ్రాములు. ఇది IP68 రేటింగ్‌తో వాటర్, డస్ట్ నుంచి మొబైల్‌ను ప్రొటక్ట్ చేస్తుంది. ఐఫోన్ 14‌లో 3279mAh బ్యాటరీ ప్యాక్ ఉంటుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories