Samsung Galaxy S24 Ultra 5G: 200 MP కెమెరా ఫోన్‌పై రూ.28 వేల డిస్కౌంట్.. రాసిపెట్టుకో.. ఇలాంటి ఆఫర్ ఎన్నడూ చూడలేదు..!

Samsung Galaxy S24 Ultra 5G
x

Samsung Galaxy S24 Ultra 5G 

Highlights

Samsung Galaxy S24 Ultra 5G: అమెజాన్‌ గ్రట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌లో Samsung Galaxy S24 Ultra 5G స్మార్ట్‌ఫోన్‌పై రూ.28 వేల డిస్కౌంట్ ప్రకటించింది.

Samsung Galaxy S24 Ultra 5G: దేశీయ టెక్ మార్కెట్‌లో బెస్ట్ ఆండ్రాయిడ్ ఫోన్ల విషయానికి వస్తే ముందుగా అందరికి సామ్‌సంగ్ పేరు గుర్తొస్తుంది. ఎందుకంటే ఈ బ్రాండ్ ఫోన్లకు బడ్జెట్ సెగ్మెంట్ నుంచి ప్రీమియం రేంజ్ వరకు అంతలా క్రేజ్ ఉంది. ఈ క్రమంలోనే ఇ- కామర్స్ ప్లాట్‌ఫామ్ ఫ్లిప్‌కార్ట్, అమెజాన్‌లు ఫెస్టివల్ సేల్‌లో సామ్‌సంగ్ ఫ్లాగ్‌షిప్ ఫోన్ Galaxy S24 Ultra 5Gపై భారీ ఆఫర్ ప్రకటించాయి. ఇప్పుడు తక్కువ ధరకే ఈ ఫోన్ మీ సొంతం చేసుకోవచ్చు. ఫోన్ లాంచ్ అయినప్పటి నుంచి మొదటిసారిగా రూ.28 వేల డిస్కౌంట్ అందిస్తోంది. దీని కారణంగా ఫోన్ ధర చాలా తగ్గుతుంది.

సామ్‌సంగ్ Galaxy S24 Ultra 5G అనేది సామ్‌సంగ్ అత్యంత పవర్‌ ఫుల్ ఫోన్. ఇది అనేక Galaxy AI ఫీచర్లకు సపోర్ట్ ఇస్తుంది. బిల్డ్ ఇన్ S-పెన్‌తో వస్తున్న ఈ ఫోన్ శక్తివంతమైన 200MP కెమెరా సిస్టమ్‌ను కలిగి ఉంది. పర్ఫామెన్స్ పరంగా దీనికి సరిపోలలేదు. ఆన్‌లైన్ షాపింగ్ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ద్వారా ఈ ఫోన్ అతి తక్కువ ధరకు కొనుగోలు చేయవచ్చ. అయితే దాని టైటానియం గ్రే కలర్ మాత్రమే బంపర్ తగ్గింపుతో అందుబాటులో ఉంది. బ్యాంక్ ఆఫర్‌లను విడిగా పొందవచ్చు.

Samsung తన ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ Galaxy S24 Ultra 5Gని భారతీయ మార్కెట్లో 12GB RAM +256GB స్టోరేజ్ వేరియంట్‌ను రూ. 129,999 ధరకు విడుదల చేసింది. ఈ వేరియంట్ ఇప్పుడు అమెజాన్‌లో రూ. 100,930కి ఉంది. అంటే దానిపై దాదాపు రూ.28,000 ఫ్లాట్ డిస్కౌంట్ ఇవ్వబడింది. ఇది మాత్రమే కాదు, వినియోగదారులు OneCard క్రెడిట్ కార్డ్ ద్వారా చెల్లిస్తే, వారు రూ. 1000 ఫ్లాట్ తగ్గింపును పొందుతున్నారు. ఫోన్ ధర రూ. 1 లక్ష కంటే తక్కువగా ఉంటుంది.

కస్టమర్‌లు తమ పాత ఫోన్‌ని ఎక్స్చేంజ్ చేస్తే Galaxy S24 Ultra 5Gపై గరిష్టంగా రూ. 53,350 వరకు తగ్గింపును కూడా పొందవచ్చు. అయితే, ఈ తగ్గింపు విలువ పాత ఫోన్ మోడల్, కండిషన్ మీద ఆధారపడి ఉంటుంది. ప్రత్యేక తగ్గింపు ప్రయోజనం టైటానియం గ్రే వేరియంట్‌పై మాత్రమే అందుబాటులో ఉంది.

Samsung Galaxy S24 Ultra 5G Specifications
సామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్, 2600నిట్‌ల పీక్ బ్రైట్నెస్‌తో పెద్ద 6.8-అంగుళాల ఫ్లాట్ LTPO AMOLED 2X డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది Qualcomm Snapdragon 8 Gen 3 ప్రాసెసర్‌‌తో Android 14లో రన్ అవుతుంది. కంపెనీ దీనికి 7 మెయిన్ Android అప్‌డేట్లు అందిస్తోంది. అనేక Galaxy AI ఫీచర్లు ఇందులో అందుబాటులో ఉన్నాయి.

వెనుక ప్యానెల్‌లో, 200MP మెయిన్, 10MP టెలిఫోటో, 50MP పెరిస్కోప్ టెలిఫోటో, 12MP అల్ట్రావైడ్ సెన్సార్ ఉంటాయి. సామ్‌సంగ్ గెలాక్సీ S24 Ultra 5Gలో 12MP సెల్ఫీ కెమెరా ఉంటుంది. ఇది 5000mAh కెపాసిటీ కలిగిన బ్యాటరీని కలిగి ఉంది. ఇందులో 45W వైర్డు ఫాస్ట్ ఛార్జింగ్, 15W వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. అదనంగా, 4.5W రివర్స్ వైర్‌లెస్ ఛార్జింగ్‌కు సపోర్ట్ కూడా అందుబాటులో ఉంది.

Show Full Article
Print Article
Next Story
More Stories