iQOO Neo 9 Pro 5G: మిస్ అయితే ఎలా.. రూ.4 వేలు డిస్కౌంట్.. భారీగా తగ్గిన ఐక్యూ ఫోన్ ప్రైస్..!

iQOO Neo 9 Pro 5G
x

iQOO Neo 9 Pro 5G

Highlights

iQOO Neo 9 Pro 5G: అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌లో ఐకూ నియో 9 ప్రో స్మార్ట్‌ఫోన్‌ను రూ. 4 వేల డిస్కౌంట్‌తో కొనుగోలు చేయవచ్చు.

iQOO Neo 9 Pro 5G: టెక్ కంపెనీ iQOO ఈ సంవత్సరం ప్రారంభంలో భారతీయ మార్కెట్లో iQOO నియో 9 ప్రో స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. ఇది బోల్డ్ డిజైన్, అద్భుతమైన 144Hz డిస్‌ప్లే, కొన్ని ఫ్లాగ్‌షిప్ రేంజ్ కెమెరా ఫీచర్లు, చాలా స్పష్టమైన ఇంటర్‌ఫేస్‌ను కలిగి ఉంది. ఈ ఫోన్‌ను కంపెనీ ప్రారంభ ధర రూ. 35,999తో లాంచ్ చేసింది. టాప్ వేరియంట్ రూ. 36,999కి చేరుకుంది. అయితే ఇప్పుడు ఈ స్మార్ట్‌ఫోన్‌పై అమెజాన్ భారీ డిస్కౌంట్ ప్రకటించింది. దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.

అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ సందర్భంగా iQOO Neo 9 Pro 5G రూ. 4,000 తగ్గింపుతో లభిస్తుందని కంపెనీ ప్రకటించింది. నియో 9 ప్రో 5G స్మార్ట్‌ఫోన్ సెప్టెంబర్ 27 నుండి ప్రారంభమయ్యే అమెజాన్ సేల్‌లో రూ. 31,999 ప్రారంభ ధరకు అందుబాటులో ఉంటుంది. అయితే అమెజాన్ ప్రైమ్ సభ్యులు సెప్టెంబర్ 26న సేల్ ముందస్తు యాక్సెస్‌ను పొందగలరు. రూ. 4,000 తగ్గింపుతో పాటు, కస్టమర్లు తమ పాత స్మార్ట్‌ఫోన్‌ను ఎక్స్ఛేంజ్ చేసుకుంటే రూ. 2,000 వరకు డిస్కౌంట్ పొందవచ్చని ఐక్యూ తెలిపింది. 3, 6 నెలల నో-కాస్ట్ EMI ఎంపిక కూడా ఫోన్‌లో అందుబాటులో ఉంటుంది.

iQOO Neo 9 Pro 5G Features
ఈ స్మార్ట్‌ఫోన్ 6.78 అంగుళాల LTPO AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది 3,000 nits పీక్ బ్రైట్నెస్‌తో 144Hz ఆకట్టుకునే రిఫ్రెష్ రేట్‌ను అందిస్తుంది. ఇందులో 'వెట్ హ్యాండ్ టచ్' ఫీచర్ కూడా ఉంది. కాబట్టి మీరు తడి చేతులతో కూడా స్క్రీన్‌ని ఉపయోగించవచ్చు.

ఫోన్ Qualcomm Snapdragon 8 Gen 2 చిప్‌సెట్‌తో వస్తుంది. ఇది 12GB వరకుRAM+ 256GB UFS 4.0 స్టోరేజ్‌తో వస్తుంది. మెరుగైన గేమింగ్ అనుభవం కోసం ఫోన్ Adreno 740 GPUతో వస్తుంది. ఫోన్ 'ఎక్స్‌టెండెడ్ ర్యామ్' టెక్నాలజీని కూడా పొందుతుంది. ఈ ర్యామ్‌ను 16GB, 12GB, 24GB వరకు పెంచుకోవచ్చు.

ఫోటోగ్రఫీ కోసం ఈ ఫోన్‌లో 50 మెగాపిక్సెల్ IMX 920 నైట్ విజన్ సెన్సార్, 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్‌తో డ్యూయల్ కెమెరా సిస్టమ్‌ ఉంటుంది. ఫోన్ అల్ట్రా-ఫాస్ట్ 120W ఛార్జింగ్‌కు సపోర్ట్ ఇచ్చే 5,160 mAh బ్యాటరీని ప్యాక్ చేస్తుంది. ఇది Wi-Fi 7కి సపోర్ట్ ఇస్తుంది. ఇది వేగవంతమైన వైర్‌లెస్ కనెక్షన్‌ను అందిస్తుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories