iPhone 15: అమెజాన్ రిపబ్లిక్ డే సేల్.. రూ. 2,788లకే ఐఫోన్ 15 ఆర్డర్ చేయండి..!

Amazon Announces Huge Offer on iPhone 15 in Republic Days Sale
x

iPhone 15: అమెజాన్ రిపబ్లిక్ డే సేల్.. రూ. 2,788లకే ఐఫోన్ 15 ఆర్డర్ చేయండి..!

Highlights

iPhone 15: 2025లో ఐఫోన్ కొనాలని ఆశపడుతున్న ప్రతి ఒక్కరికీ శుభవార్త! ఐఫోన్ 15 ఇప్పుడు డిస్కౌంట్ల తర్వాత చాలా తక్కువ ధరకు అందుబాటులో ఉంది.

iPhone 15: 2025లో ఐఫోన్ కొనాలని ఆశపడుతున్న ప్రతి ఒక్కరికీ శుభవార్త! ఐఫోన్ 15 ఇప్పుడు డిస్కౌంట్ల తర్వాత చాలా తక్కువ ధరకు అందుబాటులో ఉంది. గణతంత్ర దినోత్సవం 2025 సమీపిస్తుండటంతో ఈ-కామర్స్ కంపెనీలు మొబైల్‌లపై అద్భుతమైన తగ్గింపులను అందిస్తున్నాయి. అమెజాన్ iPhone 15 మోడళ్లపై భారీ డిస్కౌంట్లను ఆఫర్ చేస్తోంది. మీరు సరైన సమయంలో ఈ మొబైల్‌ని ఆర్డర్ చేస్తే చాలా డబ్బు ఆదా చేసుకోవచ్చు.

ఆపిల్ ఐఫోన్లు వాటి అత్యుత్తమ భద్రతా ఫీచర్లు, అద్భుతమైన బిల్డ్ క్వాలిటీకి ప్రసిద్ధి చెందాయి. అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ అనేది ఐఫోన్ కొనాలనే వారికి సరైన అవకాశం కల్పిస్తోంది. దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.

ఐఫోన్ 15 ఇప్పుడు అమెజాన్‌లో రూ. 69,900కి అందుబాటులో ఉంది. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ-కామర్స్ సైట్ 18శాతం డిస్కౌంట్‌ను అందిస్తుంది. మీరు దీన్ని కేవలం రూ. 57,499కి ఆర్డర్ చేయచ్చు. అలానే మీరు నెలకు రూ. 2,788 ఈఎమ్ఐగా చెల్లించి ఇంటికి తీసుకురావచ్చు.

ఈ ఆకర్షణీయమైన ఆఫర్‌లతో పాటు, SBI బ్యాంక్ కార్డ్‌ని ఉపయోగించి కొంటే రూ.1,000 తక్షణ తగ్గింపు లభిస్తుంది. అదనంగా, ఎక్స్ఛేంజ్ ఆఫర్‌లు దీని ధరను గణనీయంగా తగ్గేలా చేస్తాయి. మీరు మీ పాత స్మార్ట్‌ఫోన్‌ని ఎక్స్‌ఛేంజ్ చేయడం ద్వారా గరిష్టంగా రూ.22,800 వరకు ఆదా చేసుకోవచ్చు.

iPhone 15 Specifications

ఐఫోన్ 15 ఫీచర్ల విషయానికి వస్తే ఇందులో 6.1 అంగుళాల డిస్‌ప్లే ఉంటుంది. ఇది ఇంటరాక్టివ్ నోటిఫికేషన్ కోసం డైనమిక్ ఐలాండ్ ఫీచర్‌ని కలిగి ఉంది. ఇది కాకుండా, iPhone 15లో శాటిలైట్ కనెక్టివిటీని కూడా సపోర్ట్ చేస్తుంది. అలానే A16 బయోనిక్ చిప్‌సెట్‌ను అందించింది. ఈ ఐఫోన్ మోడల్‌లో మూడు వేరియంట్‌లు ఉన్నాయి. ఈ ఫోన్ టాప్ వేరియంట్ గరిష్టంగా 512 GB స్టోరేజ్ ఉంది. ఇది యాప్‌లు, ఫోటోలు, వీడియోలను సేవ్ చేయడానికి ఉపయోగపడుతుంది. కెమెరా విషయానికి వస్తే 48 మెగాపిక్సెల్‌ల ప్రైమరీ కెమెరాతో పాటు 12 మెగాపిక్సెల్‌ల సెకండరీ కెమెరా, డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌ ఉన్నాయి. ఫోన్‌లో 12 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంది.

Show Full Article
Print Article
Next Story
More Stories