Amazon Vs Flipkart Sale: అమెజాన్ వర్సెస్ ఫ్లిప్‌కార్ట్.. ఐఫోన్లను చీప్‌గా తక్కువ ధరకే ఎక్కడ కొనుగోలు చేయాలంటే..?

iPhone Offers
x

iPhone Offers

Highlights

Amazon Vs Flipkart Sale: అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లు ఐఫోన్లపై భారీ ఆఫర్లు, డిస్కౌంట్లు అందిస్తున్నాయి. ఈ రెండిటిలో ఎక్కడ తక్కువకు లభిస్తోందో తెలుసుకోండి.

Amazon Vs Flipkart Sale: ప్రముఖ ఈ కామర్స్ ప్లాట్‌ఫామ్‌లు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లలో ఇప్పటివరకు అతిపెద్ద ఆఫర్‌లతో సేల్ ప్రారంభమైంది. సెప్టెంబర్ 27 నుండి రెండు ప్లాట్‌ఫామ్‌లలో సేల్ లైవ్ అవుతుంది. దీపావళికి ముందు అమెజాన్‌లో గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్, ఫ్లిప్‌కార్ట్‌లో బిగ్ బిలియన్ డేస్ సేల్ ప్రారంభమైంది. సేల్‌లో ఇటీవల ప్రారంభించిన ఐఫోన్ 16 నుండి పాత మోడల్స్ ఐఫోన్ 15, ఐఫోన్ 14, ఐఫోన్ 13పై భారీ ఆఫర్లు, డిస్కౌంట్లు పొందుతారు.

ఈ క్రమంలో ఐఫోన్ 16, 15, 14 లేదా 13 కొనుగోలు చేయాలని ఆలోచిస్తున్న కస్టమర్‌లలో మీరు కూడా ఒకరు అయితే, అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ నుండి కొనుగోలు చేయాలా లేదా ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో ఐఫోన్‌ను చౌకగా పొందాలో అర్థం చేసుకోలేకుంటే? మీ గందరగోళాన్ని క్లియర్ చేసి తక్కువ ధరలో iPhone ఎక్కడ లభిస్తుందో తెలుసుకోండి.

iPhone 13
ఐఫోన్ 13 ఆపిల్ కంపెనీకి చెందిన పాత మోడల్ అయినప్పటికీ దానిని కొనుగోలు చేసేవారు ఇంకా చాలా మంది ఉన్నారు. మీరు కూడా వారిలో ఒకరు అయితే ఐఫోన్ 13 స్మార్ట్‌ఫోన్ 128 GB వేరియంట్ అమెజాన్‌లో రూ. 41,999కి లభిస్తుంది. ఐఫోన్ 13 మొబైల్ 128 GB వేరియంట్ ఫ్లిప్‌కార్ట్‌లో రూ. 40,999కి అందుబాటులో ఉంది. రెండు ప్లాట్‌ఫామ్‌లలో బ్యాంక్ కార్డ్ ఆఫర్‌లు, ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్‌లు కూడా అందిస్తున్నాయి.

iPhone 14
అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌లో iPhone 14 మొబైల్ 128 GB వేరియంట్ రూ. 59,900కి అందుబాటులో ఉంది. అయితే ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో iPhone 14 స్మార్ట్‌ఫోన్ 128 GB వేరియంట్ ధర రూ. 50,999. రెండు ప్లాట్‌ఫామ్‌లలో వేర్వేరు బ్యాంక్ కార్డ్‌లపై వేర్వేరు తగ్గింపులు అందించబడుతున్నాయి. ఎక్స్‌ఛేంజ్ ఆఫర్లు కూడా ఉన్నాయి.

iPhone 15
మీరు iPhone 15ని కొనుగోలు చేయాలని ఆలోచిస్తున్నట్లయితే.. iPhone 15 128 GB వేరియంట్ అమెజాన్‌లో రూ. 69,900కి అందుబాటులో ఉంది. ఐఫోన్ 15 మొబైల్ 128 GB వేరియంట్ ఫ్లిప్‌కార్ట్‌లో రూ. 54,999కి జాబితా చేయబడింది. రెండు ప్లాట్‌ఫామ్‌లలో బ్యాంక్ ఆఫర్‌లు, ఎక్స్ఛేంజ్ ఆఫర్‌లు అందుబాటులో ఉన్నాయి.

iPhone 16
మీరు Apple లెటేస్ట్ మోడల్ iPhone 16ని కొనుగోలు చేయాలని ఆలోచిస్తున్నట్లయితే అది అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో తగ్గింపుతో కూడా లభిస్తుంది. ఐఫోన్ 16 రెండు ప్లాట్‌ఫామ్‌లలో విభిన్నమైన ఆఫర్‌లతో అందుబాటులో ఉంది. అయితే లేటెస్ట్ మోడల్ కావడంతో ధర తగ్గింపు లేదు. iPhone 16 128 GB వేరియంట్ అమెజాన్ , ఫ్లిప్‌కార్ట్‌లలో రూ.79,900కి జాబితా చేయబడింది.

హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ కార్డ్‌లపై 10 శాతం తగ్గింపుతో పాటు, ఫ్లిప్‌కార్ట్ రూ. 36,050 ఎక్స్ఛేంజ్ తగ్గింపును అందిస్తోంది. అయితే అమెజాన్‌లో SBI క్రెడిట్, డెబిట్ కార్డ్‌లపై 10 శాతం తగ్గింపు, 55,000 రూపాయల వరకు ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్ ఆఫర్ చేస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories