5G: 5జీ ట్రయల్స్‌ షురూ చేసిన ఎయిర్‌టెల్‌

Airtel Starts 5G Trails
x

ఎయిర్ టెల్ (ఫొటో ట్విట్టర్)

Highlights

5G: భారతీ ఎయిర్‌టెల్‌ 5జీ ట్రయల్స్‌ను ప్రారంభించింది.

5G: భారతీ ఎయిర్‌టెల్‌ 5జీ ట్రయల్స్‌ను ప్రారంభించింది. టెలికాం విభాగం (డాట్‌) ఓకే చెప్పిన నెల రోజులకే గురుగ్రామ్‌లోని సైబర్‌ హబ్‌ ప్రాంతంలో ఈ ట్రయల్స్‌ జరిపింది. డాట్‌ నుంచి అనుమతి పొంది, ట్రయల్స్‌ ప్రారంభించిన తొలి సంస్థగా ఎయిర్‌టెల్‌ నిలిచింది. 1జీబీ వేగంతో డేటా ట్రాన్స్‌ఫర్ అయినట్లు పేర్కొంది. త్వరలో ఇదే తరహాలో ముంబయిలో సైతం ఎయిర్‌టెల్‌ పరీక్షలు నిర్వహించేందుకు సిద్ధమైంది. ముంబయి, కోల్‌కతా, బెంగళూరు, దిల్లీ టెలికాం సర్కిళ్లలో 5జీ ట్రయల్స్‌ నిర్వహణకు డాట్‌ ఎయిర్‌టెల్‌కు అనుమతిచ్చింది.

ఎయిర్‌టెల్‌తో పాటు జియో, వొడాఫోన్‌ ఐడియా, ఎంటీఎన్‌ఎల్‌ 5జీ ట్రయల్స్‌లో పాల్గొంటాయి. ఎయిర్‌టెల్‌ స్వీడన్‌కు చెందిన ఎరిక్సన్‌తో కలిసి ఈ ప్రయోగాలు చేస్తుంది. జియో 5జీ సొంతంగా అభివృద్ధి చేసిన టెక్నాలజీని వాడనుంది. జియో సహా మిగిలిన సంస్థలు ట్రయల్స్‌ ఇంకా ప్రారంభించాల్సి ఉంది.

Show Full Article
Print Article
Next Story
More Stories