Free Amazon Prime: వారికి మాత్రమే.. ఫ్రీగా అమెజాన్ ప్రైమ్.. అదిరిపోయే ప్లాన్..!

Free Amazon Prime: వారికి మాత్రమే.. ఫ్రీగా అమెజాన్ ప్రైమ్.. అదిరిపోయే ప్లాన్..!
x
Highlights

Free Amazon Prime: ఎయిర్‌టెల్ తన ఈ రెండు రీఛార్జ్ ప్లాన్‌లపై అమెజాన్ ప్రైమ్ మెంబర్‌షిప్ ఫ్రీగా అందిస్తుంది.

Free Amazon Prime: మీరు భారతీ ఎయిర్‌టెల్ సిమ్‌ని ఉపయోగిస్తుంటే మీకో గుడ్ న్యూస్ ఉంది. ఇప్పుడు అనేక ఓటీటీ సబ్‌స్క్రిప్షన్‌ను ఉచితంగా పొందొచ్చు. కంపెనీ తమ నెట్వర్క్ వినియోగదారుల కోసం అటువంటి ప్లాన్‌లను అందిస్తోంది. దీని ద్వారా రీఛార్జ్‌పై ఓటీటీ కంటెంట్‌ను అదనపు ఖర్చు లేకుండా ఫ్రీగా ఎంజాయ్ చేయవచ్చు. ఈ నేపథ్యంలో అమెజాన్ ప్రైమ్ మెంబర్‌షిప్‌పై అందుబాటులో ఉన్న ప్లాన్‌ల గురించి తెలుసుకుందాం. విషయమేమిటంటే ఈ ప్లాన్‌లలో డేలీ డేటా కూడా చాలా అందిస్తున్నారు.

కాలింగ్ డేటా వంటి అవసరాల కోసం మీరు ఎలాగైనా రీఛార్జ్ చేసుకోవాలి. అటువంటి పరిస్థితిలో OTT సర్వీస్ సబ్‌స్క్రిప్షన్ ఉచితంగా ఇవ్వబడుతున్న ప్లాన్‌ల నుండి మీరు రీఛార్జ్ చేసుకుంటే మంచిది. ఇది కాకుండా అర్హులైన సబ్‌స్క్రైబర్‌లకు ఈ ప్లాన్‌లతో రీఛార్జ్ చేసేటప్పుడు అన్‌లిమిటెడ్ డేటా ప్రయోజనం అందించబడుతుంది. దీని కోసం ఎయిర్‌టెల్ 5G సర్వీసెస్ వారి ప్రాంతంలో అందుబాటులో ఉండాలి. వినియోగదారులు తప్పనిసరిగా 5G స్మార్ట్‌ఫోన్‌ను కలిగి ఉండాలి.

ఎయిర్‌టెల్ రూ. 838 ప్లాన్
ఎయిర్‌టెల్ యూజర్లు రూ. 838 ప్రీపెయిడ్ ప్లాన్‌లతో రీఛార్జ్ చేసుకుంటే 56 రోజుల వాలిడిటీని పొందుతారు. ఇది కాకుండా 3GB రోజువారీ డేటాతో రోజుకు 100 SMSలు వస్తాయి. వినియోగదారులు అన్ని నెట్‌వర్క్‌లలో అన్‌లిమిటెడ్ కాలింగ్ చేయవచ్చు. అమెజాన్ ప్రైమ్ మెంబర్‌షిప్ కాకుండా వినియోగదారులు అపోలో 24/7 సర్కిల్, ఉచిత హలోట్యూన్‌లను పొందుతారు.

ఎయిర్‌టెల్ రూ. 1,199 ప్లాన్
మీకు ఎక్కువ కాలం వాలిడిటీ కావాలంటే 84 రోజుల వాలిడిటీ ఇచ్చే ఈ ప్లాన్‌తో రీఛార్జ్ చేసుకోవచ్చు. దీనితో రీఛార్జ్ చేస్తే మీరు అన్ని నెట్‌వర్క్‌లలో 2.5GB రోజువారీ డేటా, అన్‌లిమిటెడ్ కాలింగ్ బెనిఫిట్స్ పొందుతారు. అలాగే చందాదారులు రోజూ 100 SMSలు పంపవచ్చు. అమెజాన్ ప్రైమ్ మెంబర్‌షిప్ కాకుండా ఇతర ప్రయోజనాల గురించి మాట్లాడితే మీరు అన్‌లిమిటెడ్ 5G డేటా, రివార్డ్స్‌మినీ సబ్‌స్క్రిప్షన్, ఉచిత HelloTunes, Apollo 24/7 సర్కిల్ సబ్‌స్క్రిప్షన్ పొందుతారు.

రెండు ప్రీపెయిడ్ ప్లాన్‌లతో పాటు వినియోగదారులకు ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ప్లే ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ కూడా దక్కించుకోవచ్చు. దీనితో 22 కంటే ఎక్కువ OTT ప్లాట్‌ఫామ్స్ నుండి కంటెంట్‌ను చూడవచ్చు. వాలిలో SonyLIV, Lionsgate Play, Aha, Chaupal, Hoichoi, SunNxt మొదలైనవి ఉన్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories