Mobile Recharge: మొబైల్ యూజర్లకు షాకింగ్ న్యూస్‌.. భారీగా పెరగనున్న రీఛార్జ్‌ ప్లాన్స్‌ ..!

After Jio Airtel is Also Hike Mobile Recharge Tariff, Check Here for Full Details
x

Mobile Recharge: మొబైల్ యూజర్లకు షాకింగ్ న్యూస్‌.. భారీగా పెరగనున్న రీఛార్జ్‌ ప్లాన్స్‌ ..!

Highlights

Mobile Recharge: టెలికం సంస్థలు యూజర్లకు షాకింగ్‌ న్యూస్‌ చెబుతున్నాయి. నిన్న జియో టారిఫ్‌లను పెంచుతూ నిర్ణయం తీసుకుంది.

Mobile Recharge: టెలికం సంస్థలు యూజర్లకు షాకింగ్‌ న్యూస్‌ చెబుతున్నాయి. నిన్న జియో టారిఫ్‌లను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. జియో ప్లాన్స్‌పై ఏకంగా రూ. 40 వరకు పెరగడం గమనార్హం. అన్ని రకాల ప్లాన్స్‌పై ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు.

దీంతో ప్రస్తుతం ఉన్న ధరలతో పోల్చితే రూ. 40 వరకు పెరగడం గమనార్హం. టారిఫ్‌లను సవరిస్తూ గురువారం జియో అధికారిక ప్రకటన చేసింది. పెరిగిన ఈ ధరలు జులై 3వ తేదీ నుంచి అమల్లోకి రానున్నాయని కంపెనీ తెలిపింది. ఇదిలా ఉంటే ఎయిర్‌ టెల్‌ కూడా జియో బాటలోనే నడుస్తోంది. భారతీ ఎయిర్‌టెల్ సైతం టారిఫ్‌ రేట్లను పెంచుతున్నట్లు ప్రకటన చేసింది.

జియో రీఛార్జి రేట్లను 12 నుంచి 15 శాతం వరకు పెంచుతున్నట్లు ప్రకటించగా, ఎయిర్‌టైల్‌ ఏకంగా టారిఫ్‌లపై 11 నుంచి 21 శాతం పెంచనున్నట్లు ప్రకటించి యూజర్లను షాక్‌కి గురి చేసింది. పెంచిన ఈ ఛార్జీలు జులై 3వ తేదీ నుంచి వర్తిస్తాయని ఎయిర్‌ తెలిపింది. అన్‌లిమిటెడ్‌ సెగ్మెంట్‌లో భాగంగా ప్రస్తుతం ఉన్న రూ. 179 ప్లాన్‌ను రూ. 199కి, రూ. 455 ప్లాన్‌ను రూ. 509కి, రూ. 1799 ప్లాన్‌ను రూ. 1999కి పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. వీటితో పాటు డెయిలీ డేటా ప్లాన్స్‌, డేటా యాడ్ ఆన్‌తో పాటు పోస్ట్ పెయిడ్‌ ప్లాన్స్‌ను సైతం పెంచారు.

Show Full Article
Print Article
Next Story
More Stories